పునాది రాళ్లు -7

-డా|| గోగు శ్యామల 

కుదురుపాక   రాజవ్వ కథ

అది 1970వ  దశకo. తెలంగాణా ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoలో భాగంమై ఉంది. భౌగోళికంగా విశాలాంధ్రమై విస్తరించినప్పటికీ, ప్రాంతాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక  పరమైన వైవిధ్యాలు, వైరుధ్యాలు కొనసాగుతూ వచ్చాయి. ఆ రకంగా ఉత్తర తెలంగాణాలోని గడీల దొర తనo ఆ ప్రజలఫై అత్యంత క్రూరమైన వెట్టి దోపిడి( కట్టు బానిసత్వం, వేతనం లేని పని, చట్ట విరుద్ధం మరియూ మనిషి తనానికి , మనుసుకు విరుద్ధమైన  కుల అణిచివేత రూపాల్లో ఒకటైన ప్రత్యేక రూపం ”వెట్టి ”) దొరలకు పని చేయాలి కాబట్టి మనుషులు బతికుండాలి, బతికుండి పని చేయాలి కనుక ఓకే పూట తిండి తినాలి. నాలుకకు నచ్చింది తినడం కాదు. దొర దొరసాని ఏదిపెడితే అదే తినాలి. ఈ స్థితిలో ఉన్న ఒక స్త్రీ ని  పూట కూలిది అని, కూలిగాడు అనీ పొట్ట గంజిది, పొట్ట గంజిగాడు అని పిలిచే మాటలు ఉత్తర తెలంగాణ భాషలో భాగమైనాయి. అత్యాచారాలు, హింస అణిచివేతను ప్రయోగించింది. ఇది ఒక ఎత్తు ఐతే కులం కారణంగా చాకిరీ చేపించుకోవడంలో గ్రామారాజ్యం సఫలమైంది. ఇందులో భాగంగానే సూద్ర కులాల పెద్దాచిన్నా రైతులు, సబ్బండ వృత్తి నైపుణ్య జాతులవారు, మాల మాదిగలు వెట్టి చాకిరిలో మగ్గిపోయారు. జాత్యంకారానికి గురి అయ్యే నల్ల జాతి ప్రజల బాధల కన్నా భయంకర కుల అణిచివేతనుబరిస్తారు. మాల మాదిగలు భరించిన అమానవీకరమైన  ఘటనలు ఇందులో భాగమే. కుల రాజకీయాలు, అంటరానితనం అమానవీకరణనే పాలనగా కొనసాగడం దొర గడి పాలకుల ప్రత్యేకతగా నడిసింది. అది నేటికీ అణగారిన ప్రజలను వెంటాడుతున్న గాయంగా చాలా మంది భావిస్తారు. ఉధా..కుదురుపాకలోని దొర గడి లో పాయఖాన ( సెప్టిక్ ట్యాంక్) మలం ఎత్తి ఊరవతల పోయడానికి ఇద్దరు మాదిగ పురుషులను గడి వారు కేటాయించారు. వీరిని ప్రత్యక్షంగా చూసిన కుదురుపాక గ్రామపు లక్ష్మి ఈ విధంగా చెప్పింది ..” ఒక రోజు దొరసాని దొర భార్య చేతి వేలు ఉంగరం (సెప్టిక్ ట్యాంక్ లో పడిపోయింది. ఇక క్షణం కూడా ఆగకుండా  మాదిగ వాడ నుండి వారిని పిలిపించారు. ట్యాంక్ లోకి దిగి ఆ ఉంగరాన్ని తీయమని హుకుం జారీ చేశారు. జారీ చేసిన తరువాత వారికీ కాదనే అవకాశం అస్సలు ఉండదు. ఉండకూడదు కనుక నోరు విప్పకుండా లోతుగా ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి ఇద్దరు మొత్తం దిగి మునుగుతూ తేలుతూ రొచ్చులో ఈదుకుంటూ కాళ్ళు చేతులతో దేవులాడారు. ఎంతకీ దొరకకపోవడం వెలుపలికి వచ్చారు . అతన్ని తిట్టి మల్లి బలవంతంగా దింపారు. చేసేదిలేక మల్లి వెదకడం మొదలు పెట్టారు. ఆలా వెతుకoగా చాలా సేపటికి ఉంగరాన్ని దొరకవట్టారు. కానీ కొన్నిరోజులకే ఆ ఇద్దరూ జబ్బు చేసి చనిపోయారు. తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో, తల నొప్పితో చనిపోయారు. వీరీతో ఈ  పని చేపిస్తున్నారని ఎవ్వరు వీరికి పిల్లనివ్వక చివరి వరకు కూడా పెళ్లి జరగలేదు” అని ఆమె వివరించింది.      

 అంతె కాక,  ఊరిలో అందరిలాగే  కుదురుపాక రాజవ్వ కూడా అమానవీయ అనుభవ  జ్ఞ్యాపకాల బరువును గుండెల మీద మోస్తూవచ్చిందనే చెప్పాలి.  అణగారిన శ్రామిక స్త్రీగా, అత్తగారి ఊరైనా, మిగితా సబ్బండ స్త్రీల వలె  తన బాల్యం నుండే దొరల గడిలలో పొలంలో నిరంతరం చాకిరీ చేసేది. బాల్యం వయసు నుండే ఏమాత్రం విరామం లేకుండా  16 నుండి 17 గంటలు వెట్టి చేసేది. ‘తెల్లవారుజాము 3 గంటల రాత్రిల నిద్రలేచి మాదిగ వాడ నీలోజి పల్లీ నుండి ఆడవాళ్లు నడుస్తూ గడికి చేరేవాళ్ళలో  రాజవ్వ ఒకరు. రెండు కిలోమీటరు దూరంలో ఉన్న గడి చేరేవారు. నిజానికి వాడ నుండి గడికి ఒక కిలోమీటరు మాత్రమే. మామాలు ఉరుమధ్యలోనుండి వెళ్ళకూడదు, బ్రాహ్మణ హిందూ కులవ్యవస్థ ప్రకారం  వారు అంటరాని వారు. ఊరులో నుండి వెళితే ఊరంతా మైలపడుతుంది. ఊరు మధ్యలోనుండి ఒక కిలోమీటరు మాత్రమే ఉన్న తొవ్వన కాకుండా ఊరు చుట్టూ తిరిగి గడి వెళ్ళాలి అంటే రెండు కిలోమీటర్లు దూరం నడిచి ఊరు చుట్టూ తిరిగి పోవాల్సి ఉంటుంది.  పాము తేలు వంటి విషప్పురుగుల బారిన పడకుండా చీకటిలో నడుసుకుంట వెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగా 20, 25 మంది ఆడవాళ్లు వాడనుండి గుంపుగా వెళ్లి పనిలో చేరేవారు. వాకిలి, పశువుల కొట్టం శుభ్రపర్చడం, ధాన్యం చెరిగి ఇసుక చేయడం, వడ్లు దంచడం, ఇసుర్రాయి విసిరి  పిండిని తీయడం వంటి ప్రతి పనిని చేసేవారు. ఆ పనిని మొత్తం వేతనం లేకుండా వెట్టి కింద చేసేవారు. ఈ రకమైన వెట్టి విధానమ్ మహారాష్ట్ర లో కొనసాగిన విధానం గూర్చి షర్మిలా రెగె (2006)లో తన ” రైటింగ్ కాస్ట్, రైటింగ్ జెండర్” అనే గ్రంధంలోని ముక్తా శర్వగడ్ జీవిత  కథలో వివరించారు. ఇదే కులవివక్ష వెట్టి అనే అంశాలను దుబే మరియూ ఉమా చక్రవర్థి తమ తమ రచనల్లో ప్రముఖంగా వివరించారు. అగ్రకుల భూస్వామ్య గ్రామీణ వ్యవస్థలో సబ్బండ అణగారిన ప్రజలు అద్వాన, అమానవీయ స్థితిలనే పోరాటాలు చేయాల్సి వచ్చిందనేది నిర్వివాదాంశం. ఈ నేపథ్యంలో మార్క్సిస్టు లెనినిస్ట్ పార్టీ ప్రవేశించిన విధానంను పరిశీలించాలి.  మొదటి దఫాగా కమ్యూనిస్ట్ పోరాటాలు రాగ, రెండవ దఫాగా నక్సలిజం పేరుతొమార్క్ స్టు లెనినిస్టు పార్టీలు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర తెలంగాణతో పాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసి పోరాటాలను నిర్వహించింది. గ్రామ స్థాయిలో, మండల స్థాయిల్లో సంఘం కమిటీలు ఏర్పాటు చేశారు. ”దున్నే వాడికే భూమికావాలి ” అనే నినాదం ఇచ్చింది. వెలమ రెడ్డి భూస్వాముల నియంత్రణలోనే మొత్తం భూమి ఉన్నది కనుక జనం ఈ నినాదాన్ని ఆధరించారు.  జన కంటకమైన వెట్టి చాకిరి( ఫై పోరాటానికి పిలుపు నివ్వడం ఇంకో ముఖ్యాంశము. సూక్ష్మ జనాభా కలిగిన రెడ్డి వెలమ భూస్వాములను ఎదుర్కోవడానికి అధిక సంఖ్యాక జనంను కదిలించడానికి వర్గసిద్ధాంతాన్ని అనుసరించిన కారణంగా పేద రెడ్డి వెలమ ప్రజలు కూడా నక్సలైట్ పోరాటంలో కలిసి రాగలగండం మరోకారణం. ఐతే భారత సమాజాన్ని అర్ధవలస అర్థ భూస్వామ్య స్వభావాన్ని కలిగింది అని నిర్వచించారు . కానీ కుల విభజన స్వభావాన్ని కలిగి ఉన్నదని, అది పితృ స్వామ్యాన్ని మెండుగా మోస్తున్నదనే వాస్తవాన్ని విస్మరించారనేది గమనించాలి.     

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.