image_print

మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం

శ్రీమతి కె. వరలక్ష్మి అజో-విభో కందాళం విశిష్ట సాహితీ మూర్తి జీవిత కాల సాధన పురస్కారం జనవరి 6, 2020న బాపట్లలో అందుకున్న సందర్భంగా ప్రత్యేక వ్యాసం- మానవ సంబంధాలకు తాత్త్విక రూపం – కె. వరలక్ష్మి కవిత్వం  -కొండేపూడి నిర్మల ప్రధానంగా నేను కె. వరలక్ష్మి కధలకు  అభిమాన పాఠకురాలిని. ఆమె వేళ్ళు కధలోనే ఎక్కువ దూరం వెళ్ళాయి. వరలక్ష్మి నిర్లక్ష్యం చేసిన ఇంకో మొక్క ఆమె కవిత్వం . సరే ప్రక్రియ ఏమయినా ఒక […]

Continue Reading

“వాసా ప్రభావతి స్మృతిలో- నేనెరిగిన వాసా ప్రభావతి “

నేనెరిగిన వాసా ప్రభావతి  -గణేశ్వరరావు  మా కుటుంబానికి ఎంతో ఆత్మీయురాలు, ప్రముఖ రచయిత్రి, సాహితీవేత్త  వాసా ప్రభావతి 2019, డిసెంబర్ 18వ తేదీ ఉదయం హైదరాబాదులో మరణించారు. ఆమె   మరణం దారుణంగా మమ్మల్ని బాధిస్తోంది.’80 వ దశకంలో ఢిల్లీ కందుకూరి మహాలక్ష్మి ఇంట్లో వారితో అయిన  పరిచయం అయింది ఇటీవల దాకా కొనసాగుతూ వచ్చింది. మా ఢిల్లీ తెలుగు అకాడమీ వారిని ఉత్తమ సాహితీవేత్త అవార్డ్ నిచ్చి  సత్కరించింది. తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ఉత్తమ రచయిత్రి […]

Continue Reading

బెట్టు విడిచిన చెట్టు (బాల నెచ్చెలి-తాయిలం)

 బెట్టు విడిచిన చెట్టు -అనసూయ కన్నెగంటి            ఎక్కడి నుండో ఎగురుకుంటూ వచ్చి అక్కడున్న వేప చెట్టు మీద వాలింది గోరింక. దాంతో చాల కోపం వచ్చేసింది చెట్టుకు. దానిని ఎలాగైనా తన మీద నుండి ఎగిరిపోయేలా చేయాలనుకుని  గట్టిగా అటూ ఇటూ ఊగసాగింది వేప చెట్టు.         కొమ్మపై కూర్చున్న  గోరింకకు ఉన్నట్టుండి  ఆ చెట్టు ఎందుకు ఇలా ఊగుతుందో అర్ధం కాక కంగారు పడుతూ చుట్టూ చూసింది. ఆ సమయంలో  గాలీ,వానా ఏదీ రావటం లేదు. చుట్టు […]

Continue Reading

తమసోమా జ్యోతిర్గమయ!(క‌థ‌)

తమసోమా జ్యోతిర్గమయ ! -విజయ తాడినాడ  “బావా! ఒకసారి రాగలవా?”  ఉలిక్కిపడ్డాను ఆ మెసేజ్ చూసి. త్రిపుర నుంచి వచ్చింది అది. అదీ చాలా రోజుల తర్వాత. ‘ఏమై ఉంటుంది?’ అంతుచిక్కని ఆలోచన …వెంటనే రామశాస్త్రి బాబాయ్ మొన్న కలెక్టర్ ఆఫీసు లో కనబడ్డప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. “ఏంటో రా మాధవా, మీ మావయ్య నాల్రోజుల నుండి గుడికేసి రావటమే లేదు. చూడడానికి ఎప్పుడు వెళ్ళినా నిద్రపోతూ కనిపిస్తున్నాడు. ఒంట్లో ఏమన్నా నలతగా ఉందో ఏమో. […]

Continue Reading

యదార్థ గాథలు-ఓ అమల కథ

యదార్థ గాథలు -దామరాజు నాగలక్ష్మి ఓ అమల కథ మరీ పల్లెటూరు పట్నమూ కాని వూళ్ళో ముగ్గురు అన్నదమ్ముల ముద్దుల చెల్లెలు అమల. మనవరాలంటే తాత సోమయ్య, నాయనమ్మ పార్వతిలకి చాలా గారాబం. అందరి మధ్యన చాలా అపురూపంగా పెరుగుతోంది.  పల్లెటూరులో పెద్ద పెంకుటిల్లు. ముందు వెనక చాలా ఖాళీస్థలం. ఎప్పుడూ వచ్చేపోయేవాళ్ళతో ఇల్లంతా సందడిగా వుండేది. ఇంటినిండా పనిమనుషులు, పాలేళ్ళతో చిన్నపాటి జమీందారుగారిల్లులా వుండేది. ఊళ్ళో అందరికీ  సోమయ్య, పార్వతి అంటే గౌరవం, అభిమానం. అమల […]

Continue Reading

జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’

కథా మధురం జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’  -ఆర్.దమయంతి ఇది కథే అయినా, కథ లా వుండదు. నిజం  లా వుంటుంది. ఇంకా చెప్పాలీ అంటే, మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుంటుంది.   కథలో పాత్రలు మనకు బాగా తెలిసినవారే కావడం ఈ కథలోని ప్రత్యేకం.    ఇంతకీ కథేమిటంటే : ఒక తండ్రి కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు. ఒక కూతురు. ఇద్దరూ జీవితం లో స్థిరపడతారు. అయితే, అల్లుడి కి […]

Continue Reading
Posted On :

అనుసృజన-ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా

ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా హిందీ మూలం – కాత్యాయని అనుసృజన – ఆర్ . శాంత సుందరి ఏడుగురు అన్నదమ్ముల మధ్య  పెరిగి పెద్దదయింది చంపా వెదురు కొమ్మలా నాజూగ్గా తండ్రి గుండెలమీద కుంపటిలా కలల్లో కదులుతూన్న నల్లటి నీడలా రోట్లో ధాన్యంతోపాటు రోకటి పోటులని భరించి పొట్టుతోపాటు చెత్తకుప్పలో పారేస్తే అక్కడ పూలతీవై మొలిచింది. అడవి రేగుపళ్ళ ముళ్ళపొదల్లో మాధవీలతలా పెరిగిన చంపా ఇంట్లో ప్రత్యక్షమైంది మళ్ళీ. ఏడుగురు అన్నదమ్ములతో కలిసి పుట్టిన చంపా […]

Continue Reading

పునాది రాళ్ళు-7

పునాది రాళ్లు -7 -డా|| గోగు శ్యామల  కుదురుపాక   రాజవ్వ కథ అది 1970వ  దశకo. తెలంగాణా ప్రాంతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రoలో భాగంమై ఉంది. భౌగోళికంగా విశాలాంధ్రమై విస్తరించినప్పటికీ, ప్రాంతాల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక  పరమైన వైవిధ్యాలు, వైరుధ్యాలు కొనసాగుతూ వచ్చాయి. ఆ రకంగా ఉత్తర తెలంగాణాలోని గడీల దొర తనo ఆ ప్రజలఫై అత్యంత క్రూరమైన వెట్టి దోపిడి( కట్టు బానిసత్వం, వేతనం లేని పని, చట్ట విరుద్ధం మరియూ మనిషి […]

Continue Reading

షర్మిలాం“తరంగం”-7

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  ఇదీ మాట్టాడుకోవాల్సిందే ! కొన్ని విషయాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి . కానీ వాటిగురించి పెద్ద చర్చే చేయాల్సి వస్తుంటంది ఒక్కోసారి . మన ఇళ్లల్లో ఎంగిలిపళ్లాలు కడిగి మనం పారేసే చెత్తని ఊడ్చి శుభ్రం చేసే మనుషుల పట్ల మనం ఎలావుంటున్నాం ! కనీసం వాళ్లు అత్యవసరంగా టాయిలెట్ వాడాల్సి వస్తే మనం అనుమతిస్తామా ? కొందరు వున్నత వర్గాల్లో బయట సర్వెంట్ బాత్రూంలు అని కడతారు . మామూలుగా అందరిళ్లల్లో […]

Continue Reading

జ్ఞాపకాలసందడి -6

జ్ఞాపకాల సందడి-6 -డి.కామేశ్వరి  “క్రూరకర్మములు  నేరక చేసితి “ తెలియక చేసిన పాపాలు , తెలిసిచేసిన పాపాలు (బొద్దింకలు , ఎలకలు, ఈగలు, దోమలు  వగైరా ) వాటి బాధ భరించలేక తప్పక చంపడం, చిన్నప్పుడు తెలియక తల్లినించి కుక్కపిల్లలని, పిల్లిపిల్లలని  దాచి వినోదించడం, బోనులో ఉడతలని పట్టుకుని వినోదించడం కాలికింద మనకు తెలియకుండా చీమలలాటివి చచ్చిపోవడం  ఇవన్నీ తెలియక చేసిన పాపాలు.  ఇవన్నీ అందరు చేసేవే. మరి మాంసాహారులు  జంతువులని చంపి తినడం పాపంకిందకివస్తుందా?  అది […]

Continue Reading