ప్రమద

మేరీ ఒలివర్ 

సి.వి.సురేష్ 

ఇటీవల, అనగా జనవరి 17, 2019 ఒక అద్బుత ఆంగ్ల రచయత్రి మేరీ ఒలివర్  ఫ్లోరిడా లో మరణించింది. ఆమె ప్రకృతి ప్రేమికురాలు. ఆమె గురించి, ఇవాళ  ‘నెచ్చెలి’ అంతర్జాల పత్రికకు అందచేస్తున్నాను. 

“ నా చిన్న తనం లో దారుణమైన లైంగిక వేదింపులకు గురయ్యాను. ఎన్నో భయానక నిద్రలేని రాత్రుల్లను గడిపాను.  అత్యంత కుటుంబ సమీపకుల నుండి ఈ లైంగిక వేదింపులను నేను చెప్పుకోలేక పోయాను. నా జీవితం లో అదొక “నైట్ మేర్”… ఇలాంటి పరిస్థితి ఏ స్త్రీ కి రాకూడదని కోరుకుంటున్నాను.” మేరీ ఒలివర్ తన ఇంటర్వ్యూ లో ఒకసారి చెప్పారు.     

“ఎప్పుడైతే అన్నీ సవ్యంగా సాగుతుంటాయో, నీ పయనం లో ఎలాంటి వేగం ఉండదు, ఎక్కడికీ చేరలేవు. చివరగా నేను , అక్కడే నిలిచిపోయి, రాయడం మొదలు పెట్టాను.  అదే నా విజయవంతమైన పయనం” ఇలా ఒక ఇంటర్వ్యూ లో మేరీ ఒలివర్ బోల్డ్ గా చెప్పడం ఎంత స్ఫూర్తి దాయకమో అనిపిస్తుంది.”

మేరి ఒలివర్ ,  ఒకసారి, ఒక చిక్కటి వృక్షాల మధ్య వెళుతూ ,తన దగ్గర అప్పుడు పెన్ లేని లోటు ను కనుగోనింది.  అప్పటి నుండి , ఆమె తాను ఎక్కడకు వెళ్ళినా, అక్కడక్కడ వృక్షాల మధ్యలో చిన్న చిన్న పెన్సిళ్ళను దాచి ఉంచేది.  ఇంకెప్పుడూ తనకు ఆ కలం లేని ప్రదేశాల్లో నిలిచి పోకూడదని.

తన వెంట ఎప్పుడూ ఒక చిన్న నోట్ బుక్ ను వెంట తీసుకెళ్ళేది. సహజ సిద్ధమైన ప్రకృతికి ఆమె రచనలు ప్రతీక గా ఉండేవి.  మాక్సిన్ కుమిన్ , Thoreau లు ఒలివర్ ను “ఇన్స్పెక్టర్ అఫ్ స్నో స్టోర్మ్స్” అని, “patroller of wetlands” అని పిలిచే వారు.  వాల్ట్ విట్మన్, రూమీ, హఫీజ్, ఎమెర్సన్, షెల్లీ, జాన్ కీట్స్ తన అభిమాన కవులు అని చెప్పేది…

ఎడ్వర్డ్ విలియం మరియు హెలెన్ దంపతులకు సెప్టెంబర్ 10, 1935 లో ఒహియో లోని మాపెల్ హైట్స్ లో జన్మించింది. ఆమె తన తండ్రి సోషల్ టీచర్ కావడం తో, ఆమె ఆ స్కూల్, ఆయన బోధనలు మేరీ ని ప్రభావితం చేసాయి. తన 14 ఏట నుండే కవిత్వం రాయడం మొదలు పెట్టింది. తన 15 ఏట నేషనల్ మ్యూజిక్ క్యాంపు కు హాజరయింది.  తన 17 వ ఏట, న్యూ యార్క్ లో నివాసం ఉంటున్న, పులిట్జేర్ అస్వార్డ్ గ్రహీత ఎడ్నా సైంట్ విన్సెంట్ మిల్లీ ఇంటికి వెళ్లి ఆమె తో మాట్లాడింది. ఆ కవియత్రి చెల్లి సిస్టర్ నోర్మ తో స్నేహం చేసింది. సిస్టర్ నోర్మ తో కలిసి ఆరేడేళ్ళ పాటు పులిట్జేర్ అవార్డు గ్రహీత విన్సెంట్ మిల్లీ రాసిన పేపర్స్ ను క్రమం లో పెడుతూ,  ప్రూఫ్ రీడింగ్ వగైరా పనులు చేసారు. 1963 లో తన మొదటి కవితా సంకలనం వచ్చింది. అక్కడి నుండి తన విజయ పరంపర అలా కొనసాగింది. క్రిస్టోఫర్ అవార్డు, పెన్ న్యూ ఇంగ్లాండ్ అవార్డు , నేషనల్ బుక్ అవార్డు, వంటి ఎన్నో పురస్కారాలు ఆమెకు వచ్చాయి. ఆమె ప్రకృతి ఆరధకురాలు. కవిత్వం లో ఎమిలి డికెన్సన్ తో ఒలివర్ ను పోల్చే వారు. ప్రకృతి కి స్త్రీ కి అతి ప్రమాదకరమైన సంబంధం  ఉందని రాసిన ఆమె కవితలు విమర్శలకు గురి అయ్యాయి. అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు, ఎలాంటి డాంబికాలు, భూషణాలు లేని భాష కు ఆమె కవిత్వం ప్రత్యేకం. మోఇలీ మలోన్ కుక్ అనే ఫోటో గ్రఫర్ తో వివాహమాడి 40 ఏళ్ళు సంసార జీవితం గడిపింది. తర్వాత 2012 లో ఆమె కాన్సర్ వ్యాధికి గురి అయ్యిందని డాక్టర్ లు తేల్చడం, ఆ తర్వాత తిరిగి ఆమె ఆరోగ్యం కుదుట పడటం, చివరకు లిమ్ఫోమా కాన్సర్ తో జనవరి నెల  17 వ తేదీ 2019 లో ఫ్లోరిడా లో తన 83 వ ఏట మరణించింది.

me too # మేరీ ఒలివర్ తన బాల్యం లో తీవ్రమైన లైంగిక వేదింపులకు గురి అయ్యానని  ( ” సెక్సువల్ అబ్యూస్”), కొన్ని సంవత్సరాల పాటు భయానకమైన నిద్ర లేని రాత్రులను గడిపానని, ఆమె తన ఇంటర్వ్యూ లో చెప్పింది.  తన సమీపకుల నుండి వచ్చిన ఈ లైంగిక వేదింపులు మరో స్త్రీ కి రాకూడదని ఆమె కోరుకొంటున్న అని చెప్పుకొచ్చారు. !

ఈ సందర్భంగా ఆమె రాసిన  “జర్నీ’ అనే ఆంగ్ల పోయెమ్ ను అనువదించాను.

మేరీ ఒలివర్ || journey ||

అనుసృజన : సి.వి.సురేష్ || ప్రయాణం||

..

ప్రయాణం..

చివరాఖరున ఒకరోజు నీవు తెలుసుకొంటావ్

ఏమి చేసి ఉండి ఉండాల్సిందని..

ఎలా మొదలు పెట్టి ఉండాల్సింది అని.!

 

నీ చుట్టూ ఉన్న అనేక గొంతులు

చెడు సలహాలతో గొంతెత్తి అరుస్తున్నా..

మొత్తం ఇల్లంతా అలా వణికిపోతున్నప్పటికీ..

నీ కాలి చీలమండలను ఒక పాత లాగిన ప్రయత్నం

ఉన్నట్లు అనుభూతి చెందుతావ్..

 

“నీ జీవితాన్ని సరిచేసుకో”… అని

ప్రతి గొంతూ చెపుతున్నా.. నీవు ఆగవు!!

నీకు తెలుసు నీవేమి చేసి ఉండి ఉండాల్సిందని..

ఆ గాలి తన వ్రేళ్ళతో గట్టిగా నీ మూల కుదుళ్ళల్లో చరుస్తున్నా…

వాటి అవ్యక్తవేదన మాత్రం చాలా దారుణం..

 

ఇప్పటికే తగినంత చాలా ఆలస్యం అయ్యింది.

అంతే కాదు..

ఆ దుర్మార్గపు రాత్రి నిండా..

 కూలిన కొమ్మలు… రాళ్లు పడి ఉన్నాయి..

కానీ, కొద్దికొద్దిగా వారి మాటలు దూరమయ్యే కొద్దీ..

నక్షత్రాలు వెలగడం మొదలు పెడతాయి..

దట్టంగా మేఘాలు కమ్ముకొంటున్నప్పటికీ..

ఒక కొత్త గొంతు వినిపిస్తుంది..

ఆ గొంతును నీవు చిన్నగా గుర్తిస్తావ్..

అది నీ స్వంత గొంతుక అని.

అప్పుడది నీ వెంటే ఉంటుంది..

అప్పుడే, ఈ ప్ర్రత్యక్ష ప్రపంచం లోలోపలికి వెళ్తూ వెళ్తూ ఉంటే..

నీవు నిర్ధారించుకొన్న పనిని మాత్రమే నీవు నిర్ధారణ గా చేస్తావ్!

ఏది నీవు జాగ్రత్తగా మిగిలించాలనుకొంటావో..

ఆ జీవితాన్నే నీవు మిగిల్చుకొంటావ్…

….

original poem :

The Journey

One day you finally knew

what you had to do, and began,

though the voices around you

kept shouting

their bad advice – – –

though the whole house

began to tremble

and you felt the old tug

at your ankles.

‘Mend my life!’

each voice cried.

But you didn’t stop.

You knew what you had to do,

though the wind pried

with its stiff fingers

at the very foundations – – –

though their melancholy

was terrible.It was already late

enough, and a wild night,

and the road full of fallen

branches and stones.

But little by little,

as you left their voices behind,

the stars began to burn

through the sheets of clouds,

and there was a new voice,

which you slowly

recognized as your own,

that kept you company

as you strode deeper and deeper

into the world,

determined to do

the only thing you could do – – – determined to save

the only life you could save.

– Mary Oliver

*****

Please follow and like us:

6 thoughts on “ప్రమద – మేరీ ఒలివర్  ”

  1. This translation is very much related to the original poem.. I liked this “to feel an old tug on ankle” which women felt often. Very nice Suresh Sir. Good poem selection for this column.

    1. చాలా సంతోషం మీ ఆత్మీయ స్పందనకు ప్రత్యేక ధన్యవాదాలు గీత

  2. అనుసృజన, బాగుంది.Cv సర్..మీకిది కొట్టిన పిండి వంటిది..కాబట్టి. బాగానే ఉంది అనుసృజన… మిగతా వాటితో, పోలిస్తే.. ఎందుకో మాకు,అంతగా.. నచ్చలేదు..క్షమించండి.. Cv సర్.,

    1. చాలా ధన్యవాదాలు ..తర్వాత క్రమం లో నేర్చుకుంటాను…రాస్తాను..

Leave a Reply

Your email address will not be published.