ప్రమద

ఎమిలీ డికెన్సన్

సి.వి.సురేష్ 

తన జీవితకాలం లో చాల తక్కువ కవితలు రాసారు.ఆమె మరణానంతరమే ఆమె కవితలు వెలుగులోకి వచ్చాయి. ఈ వారం శీర్షిక కు సుప్రసిద్ధ ఆంగ్ల కవియత్రి ఎమిలీ డికేన్సన్ రాసిన ఈ చిన్ని కవిత ను  అందిస్తున్నాను.


మరణిస్తున్న వ్యక్తికి,  తన మరణానికి ముందు ఒక దివ్యలోక స్మృతి  లేదా అపశకునాలేవో కనిపించినట్లు గుర్తించి రాయడం ఈ కవిత మూలం. 


అదే క్రమంలో  మరణానికి ముందు  మనిషి ఎలా స్వార్థపూరితంగా వ్యవహరిస్తాడో,…కూడా ఈ కవిత లో చెప్తారు. 

కవితలో ……ఒక చోట.  మరణానికి ముందు 

తనకు సంబంది౦చినవన్నీ అందులోనూ  తన భాగానికి వచ్చేవన్నీ, వీలునామాల్లో భద్రపరచినట్లు చెప్తుంది. 

మరణాన్ని, ఒక ఈగ లాగా పోలుస్తూ, ఆ మరణం చేసే దాడి ని రాజు చేసే చివరి దాడి గా అభివర్ణిస్తూ, ఆమె చెప్పుకు రావడం. ఈ కవిత లో విశేషము. 

… 


రెండవ స్టా౦జా లో ఆ గదిలో, ఆ మరణపు అంచుకు చేరుకొన్న వ్యక్తి  యొక్క cynical దృశ్యాలు…మూడవ స్టా౦జాలో వ్యంగ్య పూరితమైన స్వార్థాన్ని, నాలుగో స్టా౦జా లో ఆ చివరి మరణ దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.  మోదటి స్టా౦జా…చివరి స్టా౦జాలలో మాత్రమే మరణానికి ప్రతీక గా ఈగ ను ప్రస్తావిస్తారు

..

superstitious గా, అంటే మూడ నమ్మకాలను నమ్మే వ్యక్తి రాసుకొనే కవిత అనిపిస్తుంది. అయితే, ఈ కవిత ను ప్రపంచ సాహితీ  విశ్లేషకులు ఎందరో అద్బుతంగా విశ్లేషించారు. వేల కొద్ది రివ్యూ లు రాసారు. ఆ మరణపు పెను బాధ ను , ఆ మరణానికి ముందు ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో చాల ఆర్ద్రత గా చెప్పినా…. ఇదో లిరికల్ పోయెట్రీ. rythem and sound ను ఏక కాలం లో పాటకుడి లోకి ప్రవేశ పెట్టె ఆలోచన రచయత్రి ది.

..

ఆమె మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె మొదటి కవిత సంకలనం వచ్చింది. పబ్లిష్ అయిన రెండు సంవత్సరాల లోనే 11 ఎడిషన్ లు ముద్రించాబడ్డాయి. ఈ కవితలన్నీ తన స్నేహితురాలు సేకరించి పబ్లిష్ చేసారు. అది 1890 లో.  అప్పటివరకు సాంప్రదాయంగా వస్తున్న కవిత్వపు పోకడలను ఆమె చేదించి , కవిత్వం లో కొత్త ఒరవడి ని తీసుకు వచ్చిన రచయత్రి. తండ్రి లాయర్. ఆమె కూడా తన తండ్రి ప్రాక్టిస్ లో కలిసి లా ప్రాక్టిస్ చేసారు. 

అద్బుతమైన ఈ కవిత ను అనుసృజన లోకి తీసుకురావడానికి పూర్తి స్వేఛ్చ ను తీసుకొన్నాను. ఈ కవిత ఎంపిక చేసుకొన్న తర్వాత  ఈ కవిత పైన ఉన్న విశ్లేషణలు, ఈమె పోయెమ్స్ ఒక రెండు మూడు చదివాను. ఆమె ఓ అద్భుత రచయత్రి.   

 


I heard a Fly buzz – when I died – (591)

BY EMILY DICKINSON

తెలుగు లోకి అనుసృజన :  ||నా మరణ క్షణం – నే విన్న ఆ ఈగ రొద||

..

నే మరణిస్తున్న ఆ క్షణాన… 

అక్కడో…ఈగ రొద వినిపించింది 

ఆ గది అంతా నిండిన అచేతనంగా…. 

విసిరేసే తుఫాన్ భీభాత్శాల మధ్య-  

స్తంబించిన గాలి లాగ ఉండిపోయింది!

..

నా కండ్ల సమీపం లో.. 

తడిలేని తనంతో అవి ఎండిపోయాయి.

నా శ్వాసలు ఒక్కొక్కటే గట్టి పడుతున్నాయి..

ఆ మృత్యువు చేసే చివరి దాడి 

ఆ గదిలో సాక్ష్యంగా నిలుచుంది….  

..

నా సంబందితాలన్నీ.. 

అందులో నా భాగానికి వచ్చేదంతా…

రాతపూర్వకమైన వీలునామాలలో ఉంచాను.

సరిగ్గా అప్పుడు, అక్కడే ఆ ఈగ ప్రత్యక్షమైంది

..

నాకు ఆ కాంతి వలయానికి మధ్య 

అది నీలి రంగు లో…

అనిశ్చితంగా, తడబడుతూ ఆ ఈగ చేసే ఝుమ్మన్న రొద…

అప్పుడే ఆ కిటికీలు విఫలమవ్వడం ….

ఆ తర్వాత అవేవీ నా చూపుకు అందకుండా పోయాయి… 

ఒరిజినల్ పోయెమ్

ఎమిలీ డికెన్సన్ || I heard a fly buzz- when I died ….(591)

..

I heard a Fly buzz – when I died –

The Stillness in the Room

Was like the Stillness in the Air –

Between the Heaves of Storm –

.. 

The Eyes around – had wrung them dry –

And Breaths were gathering firm

For that last Onset – when the King

Be witnessed – in the Room –

 ..

I willed my Keepsakes – Signed away

What portion of me be

Assignable – and then it was

There interposed a Fly –

..

With Blue – uncertain – stumbling Buzz –

Between the light – and me –

And then the Windows failed – and then

I could not see to see –

 

*****

Please follow and like us:

8 thoughts on “ప్రమద – ఎమిలీ డికెన్సన్  ”

  1. ఎంతో నేర్పుగా ఆ లిరికల్ మ్యాజిక్ లా వుండే ఆ కవిత ని ,అందులోని అంతరార్థాన్ని వివరిస్తూ సాగిన ఈ అనువాదం చాలా బావుంది సర్..మరణము సమీపించినపుడు ఎదురయ్యే సందర్భాలలో కనిపించే దృశ్యాలను తాత్విక కోణంలో ఏమిలీ రాసిన ఈ పోయెమ్ ఆమె రచనలలో విశిష్టమైనది అని అంటారట.. ఇలా ప్రఖ్యాత రచనలను అనువాదం చేసిన మీకు ధన్యవాదాలు..ప్రమద శీర్షిక నిర్వాహకులకు కృతజ్ఞతలు..

    1. చాలా సంతోషం.మీ ఆత్మీయ స్పందనకు

  2. తక్కువ కవితలు, రాసినా, ఎమిలీ కవితలు.. శైలి, బాగుంటుంది..!మీ అనువాదం బాగుంది.. ధన్యవాదాలు cv సర్💐

  3. కొత్త అభివ్యక్తి ,సాంప్రదాయ కవిత్వానికి చెల్లు చీటి రాసి ఆధునికతకు పెద్దపీట వేసిన రచయిత్రి.తన వకీలు వృత్తిలోని పరిభాషను కూడా గమనించవచ్చు ఉదా: witness,wil,assign లాంటివి.100%న్యాయం చేకూర్చిన అనుసృజన మీది.సురేషజీ అభినందనలు💐💐💐💐💐💐

    1. అన్న..చాలా సంతోషం మీ ఆత్మీయ స్పందనకు

Leave a Reply

Your email address will not be published.