జ్ఞాపకాల సందడి-13

-డి.కామేశ్వరి 

కరోనా  …హహ …కరోనా తాత వచ్చినా  భారత జనాభాని  ఏమి చెయ్యలేక తోకముడిచి  పారిపోతుంది. కుళ్ళు కాళ్లతో కుళ్ళునేలమీద పానీపూరి  పిండి తొక్కి తొక్కి మర్దించే పానీపూరీలు లొట్టలేసుకుతింటం, బండిమీద ఆకుకూరలమ్మేవాడు డ్రైనేజీ వాటర్ లో ఆకుకూరలు కడిగేసినా చూస్తూ కూడా కొనేసి వండేసుకుంటాం, రోడ్డుసైడ్ బండిమీద టిఫిన్ లు సప్లై చేసేవాడు  ఎంగిలి ప్లేట్లు రోడ్డుమీద కుళ్ళుగుంటలో కడిగేసినా ఎగబడి తింటాం, చెత్తకుప్పలమధ్య ఆవాసముండే కోట్ల జనాభా పందులమధ్య హాయిగా బతికేస్తారు, ప్రభుత్వ ఆసుపత్రులకెళ్లి ఎన్ని రోగాలమధ్య , నీళ్లు లేని టాయిలెట్లకి అలవాటుపడిపోయి , బెడ్లు ఖాళీ లేకపోతే  కింద నేలమీదయినా గడిపేసే జనం, వెల్ఫేర్ హాస్టల్ లో పిల్లలు రోడ్డుమీద తిరిగే కుక్కలకన్నా హీనంగా బతికేస్తారు.

 ఎన్ని కల్తీలుచేసినా తిని హరాయించుకునే జనాన్ని కరోనా ఏమిచేస్తుంది.ఇమ్యూన్ అయిపోయాం  ఏదన్న తట్టుకునే శక్తి మాకొచ్చేసింది. ఊరికే భయపెట్టి టైం వేస్ట్ చేయకండి, పనిపాటు లేని మీడియాలు. ప్రజల మనసులు గెల్చుకునే ఏ చిన్న అవకాశాలు  వదులుకొని  ప్రభుత్వాలు, చేయని పనుల  గురించి ప్రజలు నిలదీసే టైంకి ఏ కరొన  వచ్చి ప్రభుత్వాలని ఆదుకుంటుంది?

మాస్కుల వాళ్లపంట పండింది. అంతే!

వందకోట్ల జనాభాలో ఇద్దరికివస్తే  ఇంత హడావిడి. కరోనాని కంట్రోల్ చేసేముందు, రోడ్ల మీద పేరుకుపోయిన చెత్తతీయండి, నాళాలలో  పేరుకున్న చెత్త శుభ్రం చేయండి. ఆసుపత్రులు, ప్రభుత్వ బడులు, ఆఫీసులు ,రోడ్లు , డ్రైనేజీలు బాగుచేయించండి .

రోజు చస్తూ బతికే రైతులని ఆదుకోండి కరోనా హడావిడి మానేసి. దేశంలో సగం జనాభా అన్నిటికి ఇమ్యూన్ అయిపోయి బతుకుతూ ఉంటే కరోనా ఇక్కడికి వస్తే లేని కొత్తరోగం తన కొస్తుందని అదే పారిపోతుంది.

(నిజంగా డ్రైనేజీ నీళ్లతో  కూరలు కడగడం, రోడ్డుమీద నీళ్లగుంటలో ప్లేట్స్ కడగడం వీడియో లోచూసాక ..చూస్తూ పక్కనించి  పట్టనట్టు  వెళ్లే జనాన్ని చూసాక రాస్తున్న ఇది.)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.