ప్రమద

కుప్పిలి పద్మ 

సి.వి.సురేష్ 

కుప్పిలి పద్మగారు రాసిన అద్భుతమైన పోయమ్ ఎంతో లోతైన అర్థాన్ని నాలో నింపింది.
అటు ఖరీదైన … ఇటు సామాన్యమైన జీవితాల్లోని సంక్లిష్టత కు అద్దం పట్టినట్లనిపించి౦ది
నా చిన్ని బుర్రకు…. ఈ పోయెమ్ ను translate చేయాలనిపించి చేసిన ఒక చిన్న ప్రయోగం..!!!

***

That pretty jasmine

English Translation – C. V. Suresh

That pretty jasmine is such a miser

Either two or three buds per day

As the rays of dusk hide back in the black shades

The branch of moon blossoms into two or three

Futile efforts of that fragrance

To enter into the hearts or houses

May be

Doors remain closet

to hold the cool breezes of conditioners

to fear from mosquitos!

It begins its Invasion into it..

As the doors of houses or hearts opened

With the rings of calling bell…!!!

when they spread their necks out of doors or windows

and whispers “waah” what a wish of fragrance !!!

my blossomed branch of jasmine

shifts them into her path….!

Exactly….like your sweet saving words!!!…

 

****

మా మల్లి

కుప్పిలి పద్మ

మా మల్లి మహా పొదుపరి

రెండు లేదా మూడు

అంతే

రోజుకి మొగ్గ లేస్తుంది

సూర్య కాంతి లేత

నలుపు పరదా చాటుకి

యిలా వెళుతుందో లేదో

కొమ్మ చందమామ పరిమళిస్తుంది

యిద్దరిగానో ముగ్గురిగానో

యేసి చల్లదనం కోసమో

దోమలకి దడిసో

మూసుకొన్న కిటికీ రెక్కలల్లోంచి

యిళ్ళ హృదయాల్లోకి

ప్రవేశించలేని

సువాసన

యే కాలింగ్ బెల్ సవ్వడికో

యింట్లో వాళ్ళు

తలుపు తెరచి తెరవక ముందే

చప్పున యింటిలోకి

వొక్క గెంతుగెంతుతుంది

అబ్బా! యెక్కడ

నుంచి యీ తీయని పలకరింపు

అనుకొంటూ

బయటకి సాచిన మెడలని

రెండో మూడో విచ్చుకొన్న

తన వైపు తిప్పుకొంటుంది

అందరి

మనసులని మా విచ్చుకొన్న మల్లె కొమ్మ

అచ్చు

నీ

పొదుపు కమ్మని మాటల్లా …!!

*****

Please follow and like us:

3 thoughts on “ప్రమద – కుప్పిలి పద్మ”

  1. Very good transliteration to a very good poem with sweet n short words..Kudos to both of you👍👍👌👌💐💐💐

Leave a Reply

Your email address will not be published.