కుమ్మరి పురుగు

-సుధామురళి

పరపరాగ సంపర్కం’నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. గడ్డ కట్టించే చలుల వలయాలు లేవువేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్పఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవుమారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్పఅవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదునిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు తప్ప ఏ అచేతనత్వపు నీడలూ కానరావునిశిని ఎరుగని చీకటి వెలుగులు తప్పఏ ఏ మౌనభాష్యాల వెక్కిరింతలూ పలకరించవునివురుగప్పిన నిశ్శబ్దపు స్పర్శ తప్పఏ ఏ ఏ కార్యాకారణ సచేతన ఫలితాలూ ప్రకటించబడవుధైర్యపు దూరత్వ భారత్వం తప్ప అందుకే….పరపరాగ సంపర్కంనాలోనుంచినా……లోలోనికి…..

*****

Please follow and like us:

4 thoughts on “కుమ్మరి పురుగు (కవిత)”

  1. ఈ కవితకు కుమ్మరిపురుగు శీర్షిక బాగా కుదిరింది. ఈ కవితా రచన రచయిత్రి ఆత్మకథగా, ఉత్తమ పురుష కథనంలో చక్కగా సాగింది.

  2. చెల్లమ్మా… నీ కవిత అంటేనే శ్రద్ధగా చదువుతాను. కనిపించినంత తేలిక కాదు. అంతర్లీనంగా భావమిమిడి ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే భావప్రకటనాశైలి ఇలా ఉండాలి అన్న సత్యం కచ్చితంగా తెలుస్తుంది. శుభాభినందనలు.💐💐💐💐💐

  3. నివురుగప్పిన నిశ్శబ్ధపు స్పర్శ తప్ప….చాలా బాగుంది

Leave a Reply to మౌళి, జయపురం, ఒడిశా Cancel reply

Your email address will not be published.