
పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు)
-కర్ణ రాజేశ్వర రాజు
రంభలా మేకప్ చేసి వదులుతారు
నే రంభను కాను
టీ కప్పు అందించమంటారు
టీ బాయ్ ను కాను
ముద్దుగుమ్మలా ఒదిగి ఒదిగి కూర్చోమంటారు
నే గంగిరెద్దును కాదు
తల పైకెత్తి కనులతో కనులు కలిసి చూడమంటారు నే మెజీషియన్ను కాను
అక్కరకు రాని లక్ష ప్రశ్నలు సందించుతారు కోర్టులోనే ముద్దాయిని కాను
ఎందుకీ యుద్ధభూమిలో
నిస్సహాయురాలైన నన్ను
క్షతగాత్రిని చేస్తారు
నాకూ మనసూ మానవత్వం ఉంది
నా మదిలోని రహస్యాన్ని తెలుసుకొని
నడుచుకో మానవుడా
*****

కలం పేరు జ్వలిత. అసలు పేరు విజయకుమారి దెంచనాల. స్వస్థలం పెద్దకిష్టాపురం,ఉమ్మడి ఖమ్మం. విశ్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయిని. ప్రస్తుతం సాహితీవనం మిద్దెతోట సాగు.
రచనలు-
1)కాలాన్ని జయిస్తూ నేను-2007(కవిత్వం)
2)మర్డర్ ప్రొలాంగేర్-2008 (కవిత్వం,ఆంగ్లానువాదం)
(3)సుదీర్ఘ హత్య-2009(కవిత్వం)
(4)ఆత్మాన్వేషణ -2011(కథలు )
5)అగ్ని లిపి- 2012(తెలంగాణ ఉద్యమ కవిత్వం )
6) జ్వలితార్ణవాలు- 2016(సాహిత్య సామాజిక వ్యాసాలు)
7) సంగడి ముంత- 2019(కవిత్వం)
8) రూపాంతరం – 2019 (కథలు)
