సైరంధ్రి (దీర్ఘ కవిత)

గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి

తెలుగు సేత: డా. సి. భవానీదేవి

ఒకటవ సర్గ :

వివశసంధ్యలో నిరాలంబ గగనం

నిస్పంద నిగూఢ సమీరం

అధోముఖమై నిలిచిన యువతి

వ్యగ్రమానస సంకలిత!

తనపేరునే తలచుకుంటూ

నిట్టూరుస్తున్నది సైరంధ్రి

హస్తినాపుర సామ్రాజ్ఞికి

ఎన్నడెరుగని  అవమానం!

విరాటనగరం, విరాటరాజు

అజ్ఞాత అనూహ్య దేశం

అసలు దాచిన రహస్యరూపం

ఆబద్ధ అసత్యవేషం !

అడుగులు సాగటంలేదు

చకోరనేత్రాలు  సుంతయినా  నవ్వవు

నియతిగ్రస్త, రూపు మాసీమాయనిది

విచలిత కఠిన మానసి !

నిజమా.. మోసమా ?

ప్రతిక్షణమనంత భ్రాంతి

భయపడుతున్న లోచీకటి

కరిగే రోజు ఎప్పటికి  ?

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.