
చిత్రలిపి
గుండెనీరయిన కథ !
-మన్నెం శారద
అప్పుడసలు గుండె ఒకటుంటుంది తెలియనే తెలియదు
బోసినవ్వుల అమాయకత్వం నుండి ఆటపాటల అల్లరిదాకా ‘చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తిండి గోలేతప్ప గుండె గో;ల తెలియదు గాక తెలియదు దశలుమారి ,దిశలు తిరిగి వయసు భుజాలపై రంగు రంగు రెక్కలు మొలిచి లోకమొక నందనవనంగా కనులకు భ్రాంతి గొలిపి ……..పిదప గుండెజాడ తెలిపింది ఎర్రని వర్ణపు మధువులు ఒడలంతా వంకరలు పోతూ గిరగిరా తిరిగి హృదయాన్ని మోహపరచి మైమరపిస్తున్న వేళ ఒక ధ్యేయం లేక పువ్వు పువ్వు చుట్టూ తిరుగుతూ జుంటితేనెలు గ్రోలి మత్తుగా గమ్మత్తుగా గాలిలో పల్టీలు కొడుతున్న నా రంగుల రెక్కల్ని ఎక్కడివో మాయదారి ముళ్ళు అతి రక్కసము గా చీల్చి నా రక్తాన్ని నీరు చేసి వళ్ళు దగ్గర పెట్టుకోమని కసికొనలతో హెచ్చరించాయి .సుకుమార సుందర సుగంధ పుష్పాలన్నీ రెక్కలు విరు చుకుని వయ్యారాలుపోతూ వగలమారిన నవ్వులు పరుస్తుంటే పరువుపోయి తలదించుకుని తలవంచుకుని గుండెనీరయి గృహోన్ముఖమయ్యాను . ****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
