యుద్ధం పుల్లింగమే

-జయశ్రీ మువ్వా

కాలాన్ని గుప్పిట పట్టి పంటి కింద్ర తొక్కిపట్టిఇదిగో ఇప్పుడిప్పుడే రెక్కల సవ్వడి గుర్తుపడుతున్నాం వెన్నెలను అద్దంలో ఒంపి తృప్తిపడుతున్నాంనక్షత్రాలను పెదాలపై అతికించుకునిఆనందంలోకి అడుగుపెడుతున్నాం నాలోనూ రక్తమే ప్రవహిస్తోందనిఆకశాన్ని అంగిట్లో దాచేస్తున్నాం రంగాలన్నీ రంగరించి గుటుక్కున మింగేస్తూపాదాలకు పరుగు నేర్పిస్తున్నాం శరీరం పై మచ్చలన్నీ మాయమైన సంతోషంలోకొత్త వలసపక్షులైరెక్కలు కూర్చుకున్నాం ఆదిమ నుంచి అంచలంచలుగా అందరూ ఎదుగుతూనే ఉన్నారునువ్వూ అతీతం కాదు నీ మత మౌఢ్యం మాత్రంఅదిగో పురిటిదుర్వాసన నుంచి ఇంకా శుద్ధి కాలేదుఅందమైన బలపాలు అరచేతి పలకలో అరిగే క్షణాలనొదిలినిప్పులు కురిసే గొట్టాం తుపాకుల సహవాసమా? అల్లరి వల్లరి పాటలతో గడపాల్సిన బాల్యానికితూటాల మోతల సంగీతమా? ఏ రాత్రి ఉరి బిగించుకుని ఊసు మరచి నిన్ను కనిపడేసిందో రక్తమడుగులోనే అసహ్యపు చూపులతో..అందుకే పురిటి వాసన వారసత్వమై వసిస్తొంది నిన్నుకన్నది నీకు బానిసా?నీ జీవాన్ని మోసినది నీకు దాసీనా?ఎవరిది భిక్ష?ఎవరికి శిక్ష? కరుకు బూట్ల చప్పుడుసరిహద్దు ఆవల కదులుతుంటేవీపులపై చండ్రకోల శబ్ధంజలదరిస్తూ పాకుతోంది చీకట్లో చతికల పడ్డ చర్మంచివుక్కున తలుపు చాటు నక్కుతోందిపిరమిడ్ చేసి ఊరేగాల్సి వస్తుందని.. మేను ముందుగానే వర్షిస్తోందిమనిషి నుంచి వేరు పడివాసన కోల్పోతున్న భావన మహిషి మనిషిపై స్వారిచేస్తున్న రోదనగుండె గుండెనీ ముడేసి చితిపేసిన ఆక్రందన ఉన్నట్టుండి అవే ఇనుప బూట్ల నాడాలు కిటికీ చివర గాలినిఖతం చేసాయి  తెరిచే ఉన్న తలుపు భయంతోమరో గోరీ అయింది బానిసత్వం ఇక ప్రొఫెట్  ఫత్వా అయిగడపకు తావీద్ లు కడుతోంది నాలుగో ప్రపంచ యుద్ధం కోసం చేతులు కలిపే దేశాలు మొహం చాటేస్తాయామనకెందుకులే అని ఎవరి చావు వాళ్లనే చావమంటాయా? స్వేచ్చ జారి కలలోంచి ఎగిరిపోయిందివేలాడిన ముంగురులు వేడి గాలికి ఒణికి  నల్ల ముసుగులోకి జారుకున్నాయి! (ఆఫ్ఘన్ ఆడపిల్లల వేదన విని చలించి )

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.