స్వరాలాపన-10
(మీ పాటకి నా స్వరాలు)
-డా||కె.గీత
మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.
మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను. మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!
***
రాగం: శివరంజని రాగం
ఆరో: సరి2 గ2 ప ద2 స
అవ: స ద2 ప గ2 రి2 స
Arohanam: S R2 G2 P D2 S
Avarohanam: S D2 P G2 R2 S
చిత్రం: మేఘసందేశం
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: వేటూరి సుందరరామమూర్తి
ఆకాశదేశానా.. ఆషాడమాసానా
పాగారి రీరీరీగా పాగారి రీరీరీగా
మెరిసేటి ఓ మేఘమా
పపపాప పదసా దాపపా…. దా
మెరిసేటి ఓ మేఘమా
పపపాప పదాసా దాపపా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
సరి*గ*రీ* దసరిసా రిసదాప పాదదాపా
వినిపించు నా చెలికి
గగగాగ గాగపపగా
మేఘసందేశం.. మేఘసందేశం..
పాపదారీసాదాపా పాపదాసాసా
చరణం 1:
వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై…. ఇ …ఐ
గాగగాగ గాగపగా రీరిసాద సారిరి సరిదసరిగ
వానకారు కోయిలనై.. తెల్లవారి వెన్నెలనై
గాగగాగ గాగపగా రీరిసాద సారిరి సరిదసరిగ
ఈ ఎడారి దారులలో
సారిగాప పాపదదాపా
ఎడద నేను పరిచానని..
పదప గాపపాదాదదా
కడిమివోలె నిలిచానని
స*రి*స*దాప దాసాససా
ఉరమని తరమని ఊసులతో
సరిగప గరిసరి గాగగగా
ఉలిపిరి చినుకుల బాసలతో..
రిగపద పగరిగ పాదదదా
విన్నవించు నా చెలికి
పపపదాస సాసస దాపా
విన్న వేదనా.. నా
పాపదారి*రీ* సాదాపా
విరహ వేదనా
పపప దాససా
ఆకాశదేశానా.. ఆషాడమాసానా
పాగారి రీరీరీగా పాగారి రీరీరీగా
మెరిసేటి ఓ మేఘమా
పపపాప పదసా దాపపా…. దా
మెరిసేటి ఓ మేఘమా
పపపాప పదాసా దాపపా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
సరి*గ*రీ* దసరిసా రిసదాప పాదదాపా
వినిపించు నా చెలికి
గగగాగ గాగపపగా
మేఘసందేశం.. మేఘసందేశం..
పాపదారీసాదాపా పాపదాసాసా
చరణం 2:
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
రాలుపూల తేనియకై రాతిపూల తుమ్మెదనై
ఈ నిశీధి నీడలలో నివురులాగ మిగిలానని.. శిధిల జీవినైనాని
తొలకరి మెరుపుల లేఖలతో రుధిర భాస్పజల ధారలతో..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
విన్నవించు నా చెలికి మనోవేదనా నా మరణయాతనా
ఆకాశదేశానా.. ఆషాడమాసానా
మెరిసేటి ఓ మేఘమా.. మెరిసేటి ఓ మేఘమా
విరహమో.. దాహమో.. విడలేని మోహమో..
వినిపించు నా చెలికి మేఘసందేశం.. మేఘసందేశం.
*****
*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-