
చిత్రం-36
-గణేశ్వరరావు
ఇది తైలవర్ణ చిత్రం అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను. మిమ్మల్ని తప్పు పట్టను. తర్వాత తెలిసింది. ఇది ఫోటో అని. ఈ ఫోటో నా కంట పడగానే ఆశ్చర్యంతో ఒక్క క్షణం నోట మాట రాలేదు.
ఒకటి రెండు.. . ఫోటోలను బ్లెండ్ చేస్తుంటారని తెలుసు. ఈ ఫోటోలో మాత్రం కొన్ని ఫోటోలు కలిసిపోయి, ఒక అధివాస్తవికత తైల వర్ణ చిత్రంలా అయింది ! దీన్ని ఎన్నో కోణాల నుంచి చూసినప్పుడు గాని, అది మనకు అర్థం కాదు.
దీని సృష్టికర్త – మోనికా కార్వాల్హో, పుట్టింది స్విట్జర్లాండ్, స్థిరనివాసం బెర్లిన్. ఫొతొమొంతగెస్ అంటే ఆమెకు ప్రాణం. ఆమె అనేక అంశాలను – రంగు, ఇతివృత్తం, రూపం వగైరాలను పరిగణలోకి తీసుకుని రంగంలోకి దిగుతుంది. అందుకే ఆమె ఫోటోలు మనల్ని ఒకటికి రెండు సార్లు చూసేలా చేస్తాయి . మనల్ని దిగ్భ్రాంతికి గురిజేస్తాయి. మనం చూస్తున్న ప్రపంచం, మనం ఎరిగిన ప్రపంచానికున్న పరిమితులు తెలుసు. కాని మన ఊహా ప్రపంచ ఓ అపరిమితం కదా! పైగా. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రపంచం! రెక్కలు తొడిగిన ఆ మరో ప్రపంచాన్ని మన ముందుకు పరచడమే మోనికా లక్ష్యం.
ఆమె తన ఫోటో ట్రిక్ లన్నిటికీ ఆదొబె సొఫ్త్వరె వాడుతుంది. తన ఫోటోల్లోని ప్రతి
image ఆమె తీసిందే, వాటినే వాడుతూ, manipulate చేస్తూ .. ఒక చిత్ర విచిత్రమైన ప్రపంచాన్ని మన ముందు ఉంచడంలో ఆమెకు ఆమే సాటి.
*****

గణేశ్వర్రావు ప్రముఖ రచయిత. చిత్రకళ పట్ల వీరికి అమితమైన ఆసక్తి. ప్రత్యేకించి వీరు రాసే చిత్ర కథనాల ద్వారా ఎందరో గొప్ప చిత్ర కళాకారుల్ని పరిచయం చేసారు. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత శాంతసుందరి గారు వీరి సతీమణి.
