స్వరాలాపన-13

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: సింధు భైరవి రాగం 

Arohanam:  S R1 G2 M1 P D1 N2 S

Avarohanam:  S N2 D1 P M1 G2 R1 S

చిత్రం: గుండమ్మ కథ (1962)

గీతం: సన్నగ వీచే  చల్లగాలికి

సంగీతం: ఘంటసాల వేంకటేశ్వర రావు

గీత రచన: పింగళి నాగేంద్ర రావు

సన్నగ వీచే  చల్లగాలికి

దాదని నీసా సారి గమగమారిసా 

కనులు మూసినా కలలాయే

ససరి  గమ గమామమా పనిదనీదపా

తెల్లని వెన్నెల పానుపుపై  ఆ…. ఆ … ఆ…. ఆ … ఆ…. ఆ … 

పపపపపాపప దాపమమా గపదాసా  నిసనిద గమగా  

కలలో వింతలు కననాయే

సగగా గదపమమమా సరిగమ రిగరిగరిసా 

 

సన్నగ వీచే చల్లగాలికి 

సామమమామా మాపపాపపా 

కనులు మూసినా కలలాయే

పపదనీదపా మపగమపా 

తెల్లని వెన్నెల పానుపుపై 

పాసససాసస నీసనిదాపా 

ఆ కలలో వింతలు కననాయే

గపదనిదప మారిరి గమగరిసా 

అవి తలచిన ఏమో సిగ్గాయే

సద నిసససా గాదాపమమ సరిగమగరిరిసా

 

కనులు తెరచిన నీవాయే

దదనినీససా గమగరిసా 

నే కనులు మూసిన నీవాయే

సరి గమగ మాపపా గామమ గరిరిస

కనులు తెరచిన నీవాయే

దదనినీససా గమగరిరిసా

 

నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే

సమమా మమమా మపపప పపపా పదనీ దపపప  మపగమపా 

నిదురించిన నా హృదయమునెవరో కదిలించిన సడి విననాయే

సమమా మమమా మపపప పపపా పదనీ దపపప  మపగమపా 

కలవరపడి నే కనులు తెరువ నా కంటి పాపలో నీవాయే

పససససాసస నినిసనిదాపపా  గపదనిదప  మారిరి గమగరిసా 

ఎచట చూచినా ఆ .. ఆ .. 

సదద నీససా గమపా గమమా రిరిగా 

నీవాయే

సరిమాగరిరిసా

 

కనులు తెరచిన నీవాయే

దదనినీససా గమగరిసా 

నే కనులు మూసిన నీవాయే

సరి గమగ మాపపా గామమ గరిరిస

కనులు తెరచిన నీవాయే

దదనినీససా గమగరిరిసా

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.