
చిత్రలిపి
-మన్నెం శారద
ఇప్పుడేరెక్కలొచ్చి …గూడువదలి రెక్కలల్లార్చి ఎగురుతున్న దాన్నిచెట్టుదాటి పుట్టదాటి ఆకాశపు అంచులు తాకాలని ఆశ పడుతున్నదాన్ని మబ్బుల పై పల్టీలు కొట్టి రెక్కలకింత రంగులు పూసుకునిచెలికత్తెలకు చూపించాలని తెగ సరదా పడ్తున్నదాన్ని నన్నెందుకు మీ నుండి విడదీస్తున్నారు ?? పంచాంగాలు తెచ్చి నే పుట్టిన ఘడియలు లెక్కలు కట్టినన్ను ఎడంగా కూర్చో బెడుతున్నారు??? మనసుకు వయసుని లెక్కించే పంచాంగాలుంటే పట్టుకురండి ఒక్కొక్కరి వయసుని వేళ్ళని తాటిస్తూ ,హెచ్చించి, భాగించి ఎన్నెన్నో విన్యాసాలు చేస్తూ నేనిక్కడ లెక్కించిమీ భరతం పడతాను… ఎవరెవరు వృద్ధుల్లో నేనిప్పటికిప్పుడే లెక్కలు తేలుస్తాను…
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
