చిత్రం-44

-గణేశ్వరరావు 

                   ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేధిస్తే, అతని అభిమాని నెపోలియన్ చక్రవర్తి అడ్డుపడ్డాడు.                    ఈ బొమ్మ నేటి కాలానికి సంబంధించినది, వేసింది: లారా కసెల్( కెనడా). ఆమె చిత్రాలలో ఒక ప్రత్యేకత ఉంది, అది: గతాన్ని వర్తమానంతో కలుపుతూ గీసిన అపురూపమైన చిత్రకళా రీతి. సాంకేతికత పట్ల నేటి ప్రజలకున్న వ్యామోహాన్ని పట్టి చూపుతాయి. లారా తన బొమ్మ కోసం సరైన మోడళ్లను (ప్రతి రూపాలు) ముందుగా ఎంచుకుంటుంది. ఆ కాలం నాటి అలంకరణకు దీటుగా ప్రస్తుతం వాడుకలో వున్న వాటిని చిత్రించడానికి శ్రమిస్తుంది. ఈ చిత్రంలో పెళ్ళిలో ధరించే దుస్తులు ఆ అమ్మాయికి తొడిగి ప్రయోగం చేసింది. ప్రాదేశిక నేపథ్యం సమకూరుస్తుంది, సెట్ డిజైన్ లో, చిత్రానికి నిండుదనం ఇవ్వడంలోనూ శ్రద్ధ తీసుకుంటుంది.           లారా చిత్రం పేరు ‘బుడగలు ఊదడం ‘. చిత్రంలో ఇద్దరు యువతులు ఉన్నారు. ఒకామె బుడగలు ఊదుతోంది. ఆమె ధరించిన దుస్తులు, చేస్తున్న పనులు ఒకప్పటివి, ఇక రెండో అమ్మాయి iPad కు అతుక్కు పోయింది, దాని బటన్లు నొక్కుతూ కాలం గడుపుతోంది. లారా లక్ష్యం జీవనవిధానంలోని తేడాలు ఎత్తి చూపడమే! జన్యుశాస్త్రం దృష్ట్యా ఎడతెగని సారూప్యతలను ప్రముఖంగా ప్రకటించడమే! లారా తాత్వికత సూత్రాన్ని తేలిక భాషలో చెప్పాలంటే – జీవితం, ఏ స్థాయిలోనైనా, ఏ కాలంలో నైనా, స్థూలంగా ఒకేలా ఉంటుంది. ఎవరి బ్రతుకు వారు బతకడంలో – శ్రీకృష్ణదేవరాయలు కోల్పోయింది ఏమీ లేదు, మనం గొప్పగా కనుక్కుంది ఏమీ లేదు! అప్పుడు కవులకు గండపెండేరాలు తొడిగే వారు, ఇప్పుడు గుడ్డముక్క (శాలువ), చెక్క ముక్క (జ్ఞాపిక) తో పాటు టోపీ పెడుతున్నారు, అంతే!*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.