
జవాబు జాడ చెప్పడం లేదు…
-చందలూరి నారాయణరావు
నా కథలో
అడుగుదూరంలో
ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును
దగ్గరగా విన్న ఇష్టం
కలకు ప్రాణంపోసి….
ప్రవహించే ఊహగా
పరిగెత్తె ఆశగా
ఎంత వెతికినా
నడక ఎవరిదై ఉందన్న ఒక్క ప్రశ్నకు
ఏ క్షణం జవాబు జాడ చెప్పడం లేదు.
నెర్రెలు బారిన మోముతో
పొడిబారిన కళ్లతో
ఏనాడో పుట్టి పెరిగిన ఈ రహస్యమో
గుండెలో దాచుకున్న సత్యంగా
ఏ గాలికి కొట్టుకురావాలో?
ఏ వరదకు నెట్టుకురావాలో?
*****
Please follow and like us:

పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు.
వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు
ప్రవృత్తి: వచన కవిత్వం
రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి
