
దేహచింతన
–చల్లపల్లి స్వరూపారాణి
నిజానికి మీకో దేశాన్నే యివ్వాలనుకున్నాదేహాన్నిచ్చి పాఠ్య పుస్తకం అవుతున్నా చచ్చినాక పూడ్చుకోడానికి ఆరడుగుల నేలకోసం యుద్ధాలు చేసే సంతతివైద్య విద్యార్దీ!యిది దేహం కాదు, దేశం ఈ దేహాన్ని జాగ్రత్తగా చదువు!దేశం అర్ధమౌతాది పేగుల్లో అర్ధశాస్త్రముంది చూడు చర్మం సుకుమారి కాదు వెన్నపూసల మర్దనా నలుగుపిండి స్నానం యెరగదు అయినా కళ్ళల్లో ఆకాంతి యెక్కడిదో ఆరా తియ్ !యిక గుండెకాయ గురించి యేమి చెప్పను!యెన్ని కొంచెపు మాటలు రంపంతో కోశాయో!ఆ గాయాలే సాక్ష్యం వూపిరితిత్తులు నవనాడులు కాసింత గౌరవం కోసమే కొట్టుకునేవి ఈ దేహానికి తలకంటే పాదాలే పవిత్రం రాళ్ళూ రప్పల్లో చెప్పుల్లేకుండా తిరుగాడిన కాళ్ళు యెదురు దెబ్బలతో నెత్తురు చిమ్మినా నడక ఆపని కాళ్ళు మొరటు చేతులు యింకా మట్టి వదల్లేదు కదూ!పైకి తేలిన నరాలు తప్ప కాస్త నునుపైనాలేని ఆ చేతి వేళ్ళు లేడీస్ ఫింగర్స్ కావు ఎండుకట్టె పుల్లలు పిల్లలూ, యెడమ చెయ్యి జాగ్రత్తరో !వరినాటు, కవిత్వం అల్లిన చెయ్యి అర్ధంపర్ధం లేని నీతుల్ని కుడికాలితో తన్నిన చెయ్యిపువ్వుల్నీ నవ్వుల్నీ వర్ణించుకోక యెప్పుడూ ఆ దిక్కుమాలిన మట్టీ మాశానం చెమటల్ని యెందుకు రాయాల్సి వచ్చిందో అడుగు and she met the king in the capacity of an opponent not as slave
******

చల్లపల్లి స్వరూప రాణి కవయిత్రి, కథా రచయిత్రి, కాలమిస్ట్, ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు జిల్లా ప్యాపర్రు గ్రామం. మరియమ్మ, మంత్రయ్యల ఐదుగురు కుమార్తెలలో ఒకరు. ప్యాపర్రు ప్రభుత్వ పాఠశాలలోను, జిల్లా కేంద్రమైన గుంటూరులోను చదువుకున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలిగా విద్యార్థి రాజకీయాల్లో పాల్గొన్నారు. హిస్టరీ & ఆర్కియాలజీలో మాస్టర్స్, మధ్యయుగ చరిత్రలో M.Phil, ప్రాంతీయ అధ్యయనాలలో Ph.D పొందారు. మాస్టర్స్ పరీక్షలో గోల్డ్ మెడల్ సాధించారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధ అధ్యయనాల ప్రొఫెసర్ & సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. నివాసం విజయవాడ.
ఆదివాసీ, దళిత, స్త్రీవాద కవిత్వంతోబాటూ, స్వరూప సిద్ధాంతం మీద నాలుగు పుస్తకాలు (ఇంగ్లీష్ & తెలుగు), రెండు సంకలనాలు (తెలుగు), వివిధ పత్రికలలో దాదాపు వంద వరకు వ్యాసాలను ప్రచురించారు. మంకెనపూవు, వేకువ పిట్ట పేరున కవితా సంకలనాలు ప్రచురించారు.
వీరి కవిత్వం అనేక సంకలనాల్లో చోటుచేసుకుంది. అలాగే ఆంగ్లం, హిందీ, గుజరాతీ, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళంలోకి అనువదించబడింది. వీరి రచనల మీద విద్యా పరిశోధనలు జరుగుతున్నాయి. వీరి కవిత్వం గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్ స్థాయిలో పాఠ్యాంశాల్లో చేర్చబడింది.

దేహ చింతన కవిత అక్షర సత్యం.
చాలా బాగుంది స్వరూపా రాణి గారు
మీకు అభినందనలు
దేహా చింతన కవిత భావగర్భితంగా సమాజానికి వాతలు పెట్టేలా వుంది. ప్రతి అక్షరంలోను స్వరూపారాణి గారి ఆవేదన స్పష్టమయింది . సూటిగా పదునైన వాస్తవాలను కవిత ద్వారా వ్యక్తిక రించిన రచయిత్రి అభినందనీయురాలు .
DR.RANI GARU
GREAT ONE MADAM.
I READ U R MANKENA POOVU 10 TIMES