ప్రముఖ అనువాదకులు గౌరీ కృపానందన్ గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(గౌరీ కృపానందన్ గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

          గౌరీ కృపానందన్ గారు 14 ఆగస్టు 1956న తమిళనాడులో జన్మించారు. బి.కామ్.చదివారు. మాతృభాష తమిళం అయినా, తెలుగు, హిందీ భాషలతోపాటూ ఆంగ్లంలో మంచి ప్రవేశం ఉంది.

          సాహిత్యం పట్ల మక్కువ కారణంగా తన నలభైవ ఏట అనువాద రంగంలోకి అడుగు పెట్టారు. ఇరవై ఐదేళ్లకి పైగా తమిళం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి తమిళంలోకి అనువాదాలు చేస్తున్నారు. 

తమిళం నుంచి తెలుగులోకి అనువాదాలు:

  • యండమూరి వీరేంద్రనాథ్ (45),
  • యద్దనపూడి సులోచనారాణి(20),
  • డి. కామేశ్వరి(3),
  • ఓల్గా (5)
    తదితరుల నవలలు 80కి పైగా అనువదించారు.

చా సో (చాగంటి సోమయాజులు) గారి కథల సంకలనం, సాహితి అకాడమీ ప్రచురణ శ్రీవల్లీరాధిక, విహారి, సింహప్రసాద్, కవనశర్మ, వారణాసి నాగలక్ష్మి పి.ఎస్.నారాయణ తదితరుల కథలు యాభైకి పైగా అనువదించారు.

మొదటి అనువాద కథ యండమూరి వీరేంద్రనాథ్ గారి ‘ది బెట్’ (1995)
మొదటి అనువాద నవల యండమూరి వీరేంద్రనాథ్ గారి ‘అంతర్ముఖం’ (1997)

తమిళంలో అనువదించిన ముఖ్యమైన రచన కొండపల్లి కోటేశ్వరమ్మ ఆత్మకథ ‘నిర్జనవారధి.’ Tamil title “Alatra Palam” by Kalachuvadu publications

 తెలుగు నుంచి తమిళంలోకి అనువాదాలు:

  • తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్ గారి నవల అనువాదం ‘పూనాచ్చి ఒక మేకపిల్ల కథ’ (2018)
  • సుందరరామసామి గారి నవల‘చింతచెట్టు కథ’ (2022)
  • తమిళ అనువాద కథలు, కథల సంకలనం(2022)

అవార్డులు:

  • కు. అళగిరిసామి గారి ‘బహుమతి’ (సాహిత్య అకాడమీ అవార్డు కథల సంకలనం, 2022)
  • ప్రపంచన్ గారి నవల ‘ఆకాశం నా వశం’ (సాహిత్య అకాడమీ అవార్డ్ నవల అచ్చులో)
  • తమిళం నుంచి తెలుగులోకి అరవైకి పైగా కథలు అనువదించారు. (అశోకమిత్రన్, డి.జయకాంతన్, ఆర్. చూడామణి, శివశంకరి, అనురాధా రమణన్, ఇందిరా పార్థసారథి తదితరులు)
  • 2015 సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం (‘Meetchi’ కథల సంకలనం)
  • ఓల్గా గారి ‘విముక్త’ కు పురస్కారం వచ్చిన సంవత్సరంలోనే దాని తమిళ అనువాదం ‘Meetchi’ కి కూడా తమిళ అనువాద పురస్కారం లభించింది. మూల రచనకు, దాని అనువాదానికి ఒకే సంవత్సరం సాహిత్య అకాడమీ అవార్డులు రావడం ఇదే ప్రథమం.
  • 2016 స్పారో అవార్డు 
  • 2021 కృష్ణా జిల్లా రచయితల సంఘం అనువాద పురస్కారం
  • తిరుపూర్ లయన్స్ క్లబ్ శక్తి అవార్డు, టి.కె. కృష్ణసామి శక్తి అవార్డు, హైదరాబాద్ లేఖిని అవార్డు మొదలైనవి.

పాల్గొన్న సభలు:

1.కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం అనువాద సదస్సులలో గౌరవ అతిధిగా రెండుసార్లు.
2.Tamil – Telugu Translation Workshop (25 – 29 October 2018 at Periyar University, Salem)
3. US లో తానాసభలు, కాలిఫోర్నియా సదస్సులలో అనువాద రచయిత్రిగా పాల్గొన్నారు.

*****

Please follow and like us:

One thought on “ప్రముఖ అనువాదకులు గౌరీ కృపానందన్ గారితో నెచ్చెలి ముఖాముఖి”

Leave a Reply

Your email address will not be published.