
హ్యాపీ న్యూ ఇయర్!
-బండి అనూరాధ
హఠాత్తుగా మాయమైన ఎవరో..ఇంటి ముందు నడుచుకుంటూ మరెవరో..లోనికింకి బయటపడని మరింకెవరో.. చుట్టూ పచ్చదనంలోకి నిన్ను లాగేఅక్కడే వాలిన ఒక పక్షి! ఇలాగా!?కొంత నొప్పిని, కథలోకోకవిత్వంలోకో చొప్పించడం! మరి నువ్వు చూసుకుపోతున్నప్పుడుదారి నిన్ను చూసి నవ్వినట్లనిపించిందా?పక్కలమ్మట గడ్డిపూలనయినా పలకరించావా? సైడు కాలువలో నుండీ బయటకొచ్చీ లోపలికి గెంతులేసే కప్పల సంగతీ?నీలోని బెకబెకల సంగతో మరి!ఆకలేస్తోందా..? అక్షరాలని ఇక కట్టేసిదారిన పంటపొలాలకేసి చూస్తోన్నావా.. మరి వాళ్ళకు తప్పదు; కోత కొయ్యాలీ,.. కుప్పవెయ్యాలీ,..నూర్చాలీ,.. హేయ్…నువ్వు ఇక కవితల్ని తూర్పారపెట్టుకోమాటలజాలిని పొట్టులా విసురుకో Happy new year!!
*****

పేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. కథలంటే ఆసక్తి. రాస్తుంటాను.
