హ్యాపీ న్యూ ఇయర్!

-బండి అనూరాధ

హఠాత్తుగా మాయమైన ఎవరో..
ఇంటి ముందు నడుచుకుంటూ మరెవరో..
లోనికింకి బయటపడని మరింకెవరో..
 
చుట్టూ పచ్చదనంలోకి నిన్ను లాగే
అక్కడే వాలిన ఒక పక్షి!
 
ఇలాగా!?
కొంత నొప్పిని, కథలోకో
కవిత్వంలోకో చొప్పించడం!
 
మరి నువ్వు చూసుకుపోతున్నప్పుడు
దారి నిన్ను చూసి నవ్వినట్లనిపించిందా?
పక్కలమ్మట గడ్డిపూలనయినా పలకరించావా?
 
సైడు కాలువలో నుండీ బయటకొచ్చీ 
లోపలికి గెంతులేసే కప్పల సంగతీ?
నీలోని బెకబెకల సంగతో మరి!
ఆకలేస్తోందా..?
 
అక్షరాలని ఇక కట్టేసి
దారిన పంటపొలాలకేసి చూస్తోన్నావా..
 
మరి వాళ్ళకు తప్పదు; 
కోత కొయ్యాలీ,.. 
కుప్పవెయ్యాలీ,..
నూర్చాలీ,.. 
 
హేయ్…
నువ్వు ఇక కవితల్ని తూర్పారపెట్టుకో
మాటలజాలిని పొట్టులా విసురుకో
 
Happy new year!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.