స్వరాలాపన-36

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: అమృతవర్షిణి రాగం 

Arohanam: S G3 M2 P N3 S
Avarohanam: S N3 P M2 G3 S

కురిసేను విరిజల్లులే
ససగాస గపపాసనీ
ఒకటయ్యేను ఇరు చూపులే
సససాగాస గపపానిసా
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
సససాసాస నిసనీప పపసాప పమగమగ
శృంగారమునకీవె శ్రీకారమే కావె
స*స*గా*స*నిస*నీప గమపసప పమగమస

కురిసేను విరి జల్లులే
ససగాస గపపాసనీ
ఒకటయ్యేను ఇరు చూపులే
సససాగాస గపపానిసా

ఆకుల పై రాలు
గామప నీసాస
ఆ..ఆ… ఆ..
నిసనిపపా పనిపమగా గమగసనీ
ఆ..ఆ… ఆ..
నిసగమ గమపని మపనిస నిసనిసనిసా
ఆకులపై రాలు హిమబిందువు వోలె
గామప నీసాస నినిసస నిపపనిని
నా చెలి వొడిలోన పవళించనా
నీసస నీపాప గమపనినిసా

ఆకులపై రాలు హిమబిందువు వోలె
గామపనీసాస నినిసస నిపపనిని
నా చెలి వొడిలోన పవళించనా
నీసస నీపాప గమపనినిసా

రాతిరి పగలు మురిపాలు పండించు
పానిస గ*ప*గా* సగసాని పాగామ
చెలికాని ఎద చేర్చి లాలించనా
గమపాని నినిసాని పనిసాగపగసా
నేను నీకు రాగ తాళం
సాపాప పాగపగా సాపాగ సానీ
నీవు నాకు వేద నాదం
సాపాప పాగపగా సాపాగ సానీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సగసని నిసనిప
నిసనిప పనిపమ
గమపని సనిపమ పమగగ మగసా

కురిసేను విరి జల్లులే
ససగాస గపపాసనీ
ఒకటయ్యేను ఇరు చూపులే
సససాగాస గపపానిసా
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
సససాసాస నిసనీప పపసాప పమగమగ
శృంగారమునకీవె శ్రీకారమే కావె
ససగాసనిసనీప గమపసప పమగమస

2.
కన్నుల కదలాడు ఆశలు శృతి పాడు
గామపనీసాస నినిసస నిపపనిని
వన్నెల మురిపాల కధ యేమిటో
నీసస నీపాప గమపనినిసా
తలపుల మాటుల్లో వలపుల తోటల్లో
గామపనీసాస నినిసస నిపపనిని
ఊహలు పలికించు కలలేమిటో
నీసస నీపాప గమపనినిసా
పెదవుల తెరలోన మధురాల సిరివాన
పపనిస గ*ప*గా*స సగసాని పాగామ
మధురిమ లందించు సుధలేమిటో
గమపాని నినిసాని పనిసా*గ* ప*గ*సా
పరవశమే సాగి పరువాలు చెలరేగి
పనిసగ*పా*గా*స సగసాని పపగమగ
మనసులు కరిగించు సుఖమేమిటో
గమపని నినిసాని పనిసా*గ* ప*గ*సా
పల్లవించే మోహ బంధం
సాపాప పాగపగా సాపాగ సానిసనీ
ఆలపించే రాగ బంధం
సాపాప పాగపగా సాపాగ సానిసనీ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
సగసని నిసనిప
నిసనిప పనిపమ
గమపని సనిపమ పమగగ మగసా

కురిసేను విరి జల్లులే
ససగాస గపపాసనీ
ఒకటయ్యేను ఇరు చూపులే
సససాగాస గపపానిసా
అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను
సససాసాస నిసనీప పపసాప పమగమగ
శృంగారమునకీవె శ్రీకారమే కావె
ససగాసనిసనీప గమపసప పమగమస

 *****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో మూడవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.