
మ్యూజిక్ ( కవిత)
-దేశరాజు
తెల్లవారని జాముకికాస్త ముందు-వెలుతురు కోసం పచ్చని మొక్కలువెతుకులాడుతూంటాయినిద్దట్లోంచి లేచినా కలలోంచి మేల్కొనని ఆమెతోపరిమళాల మాట కలుపుతాయిస్టౌ పై మరుగుతున్న కాఫీ పొడి పెర్క్యులేటర్ నుంచి గుబాళిస్తుంటుందిగాలి గుడ్డిదిదానికి లింగ, వయోభేదాలు లేవుమా ఇద్దరినీ ఒకేలా అకేలా అల్లుకుంటుందిఇంతలో చిన్న పిట్టలేవో గ్రిల్ కంతల్లోంచి దూరిఊరిస్తున్నట్టుగా దూరంగా వాలి అందమైన పాటలు చూపిస్తాయిఆ దినపు మొదటి కాఫీ సిప్ చేస్తున్న ఇద్దరూ ఇద్దరే-ఇళయరాజా, రెహ్మాన్ తెలియనే తెలియరులయకారుడే, అసలైన సంగీతకారుడు అప్పుడే కాదు, ఎప్పటికీ.
*****

దేశరాజుగా అందరికీ సుపరిచితులైన దేశరాజు రవికుమార్ పుట్టింది, పెరిగింది గోదావరి జిల్లాల్లో, చదివింది శ్రీకాకుళం జిల్లాలో, జర్నలిస్ట్‌గా స్థిరపడింది హైదరాబాద్‌లో. కవిత్వం, కథలతోపాటు ఇంటర్వ్యూలు, వ్యాసాలు, పుస్తక సమీక్షలు వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. జనవరి, 2000లో ‘ఒకేఒక్క సామూహిక స్వప్నావిష్కరణ’, డిసెంబర్ 2019లో ‘దుర్గాపురం రోడ్’ కవితా సంపుటాలు; నవంబర్, 2021లో ‘బ్రేకింగ్ న్యూస్’, డిసెంబర్, 2002లో ‘షేమ్..షేమ్.. పప్పీ షేమ్’, 2023లో ‘ఆలీబాబా అనేక దొంగలు’ కథా సంపుటాలు వెలువరించారు. వీరి రచనలకు పలు బహుమతులు, పురస్కారాలు లభించాయి.
