స్మృతి లేఖనం

బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సయ్యద్ శంశూల్ హక్

తెలుగు సేత:వారాల ఆనంద్

నేనెవరో తెలియాల్సిన అవసరం లేదు
నేను గుర్తుండాల్సిన అవసరమేముంది
నన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి

దానికి బదులు నా పెట్టుడు పళ్ళని
సాయంత్రపు సినిమాని
నా ఉమ్మనీటిని గుర్తుంచుకోండి

నీను వచ్చాను, చూశాను
కానీ
ఏ దిష్టి బొమ్మ విప్లవంలోనూ
గెలవలేకపోయాను

ఓ యాత్రికుడా
నువ్వొకవేళ బంగ్లాదేశ్ లో పుట్టి వుంటే
నా లోతయిన ఆవేదనని
ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతావు

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.