శూన్య తత్వం

-గవిడి శ్రీనివాస్

ఆకాశ ఎడారి నుంచి
చూపులు వేలాడేసుకుని
దిక్కులు చూస్తున్నప్పుడు
శూన్య తత్వం బోధపడుతుంది.

కలలకి కన్నీళ్ళకి మధ్య
దూరాన్ని చెరిపి
అతి దగ్గరగా చూసినప్పుడు
నిశ్శబ్దంలోంచి
జీవిత సత్యం అవగతమవుతుంది.

గుప్పెడు కన్నీళ్ళని పట్టుకుని
వేలాడటం కాదు జీవితం.

రాత్రి వెనుక పగలు దాగున్నట్టు
దుఃఖః ఆవల సుఖం
మౌనంగా కాలం కోసం
ఎదురుచూస్తోంది.

ఏమీ తోచనప్పుడు
దిక్కులు చీకట్లతో
మూసుకున్నప్పుడు
మౌనం పరమావధిగా
కాలాన్ని చెక్కు కోవాలి.

ఆనంద తీరం ఎక్కడంటే
ఆలోచనలు కుదురుగా కూచున్న చోట
ప్రశాంతత మాటల్లో
తొణికిసలాడే చోట
కొలవలేని సంతోషొలు
కొలువు ఉంటాయి.

శూన్య తత్వం
పల్లవించిన చోట
పదిలంగా మనసు
అనురాగ రాగాలను వినిపిస్తుంది.
ఆత్మీయ పూలతోటనే
పూయిస్తుంది.

*****

Please follow and like us:

One thought on “శూన్య తత్వం (కవిత)”

  1. “గుప్పెడు కన్నీళ్ళను పట్టుకుని వేలాడటం కాదు జీవితం” గొప్ప పద ప్రయోగం..అద్భుత కవనం. శ్రీనివాస్ గారి కవిత్వం చాలా గొప్పగా ఉంటుంది. అభినందనలు

Leave a Reply to శింగరాజు శ్రీనివాసరావు Cancel reply

Your email address will not be published.