జీవితం అంచున -32 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          సభ జరిగిన వారం రోజులకనుకుంటా తెలియని నంబరు నుండి ఒక కాల్ వచ్చింది. ఆ నంబరు నుండి మూడు రోజుల క్రితం కూడా ఒక మిస్డ్ కాల్ వుండటం గమనించాను. ఎవరైవుంటారాని ఆలోచిస్తూ రెండోరింగ్కే ఎత్తాను. నేను‘హలో’అన్నా అవతలి నుండి జవాబు లేదు. రెండోసారి‘హలో’అన్నాను.

          “హలోఅండి, నాపే రు రామం. మీ పుస్తకావిష్కరణకివచ్చి, పుస్తకం తీసుకున్నాను. చాలాహృద్యంగా, ఆర్ద్రంగా మీ మనవరాలిపై ప్రేమను ఆవిష్కరించారు. అందులో చివరిపేజీలో మీ గత ప్రచురణల వివరాలు వున్నాయి. నాకు మీ పాత నాలుగుపుస్తకాలు కావాలండి. పేమెంట్ఎంత, ఎలాచేయాలో చెప్పగలరు” అవతలి నుండి ఓ పురుష కంఠ౦.

          ఇండియాలో వుండేది చాలా తక్కువ. ఆ కొద్ది రోజుల్లో ఇలాంటి కాల్స్ మామూలే కాబట్టి అతను మాట్లాడుతున్న నంబరుకే ఫోన్పే చేయమనీ, పోస్టేజీ ఉచితమనీ చెప్పి కాల్ డిస్ కనెక్ట్ చేసాను. ఆరువందలు ఫోన్పే చేసి, స్క్రీన్షాట్తో పాటు అడ్రస్ పంపాడు ఆ ఆగంతకుడు. మరో రెండు రోజుల తరువాత పుస్తకాలు డిస్పాచ్అయ్యాయా అని మెసేజ్చేశాడు. కొరియర్ట్రాకింగ్ ఐడీ పంపాను.  ఆ తర్వాత పుస్తకాలు అందాయని మెసేజ్చేశాడు. థంబ్ఎమోజీ పెట్టాను.

          అప్పటికి ఊరుకుని ఆ సాయంత్రం “మీవేకాక మరేమైనా మంచి బుక్స్ఉంటే సజెస్ట్చేయండి” అని మెసేజ్చేశాడు.

          “సారీ అండీ. నేను ఇండియాలో వుండను. ఇండియా వచ్చినప్పుడల్లా మీరడిగినట్లే అందరినీ కనుక్కుని మంచి పుస్తకాలు కొనుక్కుని పట్టుకెళుతుంటాను” అని జవాబిచ్చాను.

          నాలుగురోజుల తరువాత నా నవల అనాచ్చాదిత ముగించి, మళ్ళీ మెసేజ్చేశాడు.

          “మీ మొదటి నవలను బ్రేక్లేకుండా పూర్తిచేసాను. వదలబుద్ధి కాలేదు. ముప్పై మూడేళ్ళు ఆర్మీలో పనిచేసి, వాలంటరీ రిటైర్మెంట్తీసుకున్నారని రాసారు. నేనూ ఎయిర్ఫోర్స్వెటరన్ను. రాతలోని మీ ఫ్లైర్తో చాలా ఇంప్రెస్అయ్యాను. నేను ఎయిర్ఫోర్స్తర్వాత, పదమూడేళ్లు దుబాయ్లో పనిచేశాను. భార్యపోయాక, ఈ మధ్యనే ఇండియా వచ్చాను. రాగానే ఇక్కడ యూనివర్సిటీలో ఉద్యోగం. సారీ ఇవన్నీ చెబుతున్నందుకు” అని టెక్స్ట్చేశాడు.

          ఆ వివరాలన్నీ నాకెందుకు చెప్తున్నాడా అనుకున్నాను. నా మనసులో మాటతెల్సినట్టుగా రెస్పాండయ్యాడు.

          “ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే, నేను జీవితంలో చాలా చూశాను. నవలలో మీలీడ్రోల్నన్ను పెద్దగా బాధపెట్టలేదు. నాది పెద్ద గీత అయితే, కథలోని ఆ పాత్రది చాలాచిన్న గీత’’అని మెసేజ్చేశాడు.

          నాలో కొంచం క్యూరియాసిటీ పెరిగింది.

          “ఇంటింటికో రామాయణం ఉంటుందండీ. అది మామూలేగా” అని రిప్లైఇచ్చాను.

          “కానీ నా రామాయణం వేరు. మీకు మంచి కథావస్తువు అవుతుందండీ”అన్నాడు.

          “అయితే మీ జీవితంలో ఆ బారెడు కష్టాలగీత ఏమిటో చెప్పండి క్లుప్తంగా”అన్నాను.

          “ఒకటనికాదండీ. నాది కట్నం తీసుకుని చేసుకున్నపెళ్ళికాదు. ఎదురుకట్నం పెళ్ళి. తానుపోయాక గాని తెలియలేదు నాకు, తను అంతకాలం నాతో ఇష్టంగా లేదని. తన ఫోనులో ఇతరులతో చాట్ చదివాక అర్ధమయ్యింది తన మనసులో నా స్థానం. నా దురదృష్టానికి తోడు తను పోయాక బంధువులబ్బాయితో జరిపించిన నా కూతురి పెళ్ళి ఆరునెలలకే విడాకులకు దారి తీయటం. ఒక్కోసారి దృశ్యంలో వెంకటేష్ పాత్రలా అనిపిస్తుంది నాది. ఇలాంటి వాటికి తోడుగా ఇంకా చాలా జరిగాయి నా జీవితంలో. నేను గాయకుడిని. నాతో పాటలు పాడే ఒకావిడ, వాళ్ళమ్మకి హెల్త్ బాలేదని రిక్వెస్ట్చేసి ఒక లక్ష తీసుకుంది. తిరిగి అడిగితే, సెక్సువల్ హెరాస్మెంట్ కేసు పెడతానంది. ఇలా బోలెడు. ఇవన్నీఇలా మెసేజీలో చెప్పుకునేవి కావు. కొన్ని కొన్ని సార్లు దేవుడు లేడనిపిస్తాడు. మళ్ళీ దారిలోకి వస్తాను. భగవద్గీతను, రామాయణాన్నీ అనుసరిస్తూ భోదిస్తూ ఉంటాను.’’ అన్నాడు.

          గాడంగా నిట్టూర్చి “ఐయాం రియల్లీ సారీ అండి. విల్ టాక్ టు యూ లేటర్” అన్నాను.

          మళ్ళీ నాలుగురోజులు తరువాత కాల్ వచ్చింది. నంబరు చూసాక కొంచం చిరాకు, విసుగు కలిగింది. నా పుస్తకాల పైన విశ్లేషణ వరకూ వినొచ్చు, పాఠకుని అభిప్రాయం తెలుసుకోవచ్చు కాని అతని స్వంత విషయాలు కొంచం విసుగు కలిగించాయి.

          అతను కొంచెం మొహమాటంగా “ఝాన్సీగారూ, ఆ రోజు సభలో మీ దీర్ఘ కవితను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్చేయించాలని చెప్పారు. ఆ ఛాన్స్ నాకు ఇవ్వొచ్చు కదా. మీ అంచనాలకు తగ్గకుండా, ఎక్కడాఫ్లేవర్మారకుండా చేయగలను. ఆ హామీఇస్తాను మీకు.’’ అన్నాడు.

          “ఆల్రెడీ ఒకరు మొదలుపెట్టారండీ. దాదాపు సగంవరకూ అయ్యింది. అసలయితే రెండు వర్షన్స్ఒకేసారి ఆవిష్కరించాలను కున్నాను. అనువాదం డిలే కావటంతో తెలుగు వర్షన్ఆవిష్కరణ చేసేసాను. ఐయాంసో సారీ. బట్వన్స్ అగైన్  థాంక్యూ ఫర్యువర్ కన్సర్న్” అన్నాను.

          “బై ఎనీ ఛాన్స్ఏమాత్రం అవకాశమున్నా చెప్పండి. నా నంబరు సేవ్చేసి పెట్టుకోండి” అతని గొంతులో నిరాశ వినిపించింది.

          “థాంక్స్అండీ. తప్పకుండా” అంటూ ఫోను పెట్టేసాను.

          మరో పది రోజులు ఎదురు చూసినా నా అనువాదం చేస్తున్న శరత్ బాబుగారి అనువాదం ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేదు. నలభై శాతం చేసారను కుంటా. నాలో ఓపిక, సహనం చచ్చిపోయాయి. అప్పుడు మాటాడటానికే విసుగనిపిం చిన రామం నంబరు వెతికి సేవ్ చేసుకుని కాల్ చేసాను.

          “రామంగారూ, మీరు నా దీర్ఘ కవితను ట్రాన్స్లేట్చేస్తానన్నారు కదా. ఇంకా అదే మాటమీద వున్నారా.

          అనువాదం చేస్తున్నతను తెలుగు అకాడమీ అప్పగించిన పనుల్లో బిజీగా వున్నారట. సమయం పడుతుందంటున్నారు.  మీకు అభ్యంతరంలేకపోతే వారు చేసినంత వరకూ వదిలేసి, ఆపై నుండి అనువాదం కొనసాగించగలరా” అని అడిగాను.

          “తప్పకుండానండీ. వారు ఎంతవరకూ చేసారో చెప్పండి. ఆపైన చేస్తాను” అన్నాడు. అతని గొంతులో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపించింది.

          “నా సిక్స్త్ సెన్స్ గట్టిగా చెప్పిందండీ మీరు కాల్ చేస్తారని. నా ఐదుపదులు దాటిన జీవితంలో సిక్స్త్సెన్స్ఫెయిల్అయిన దాఖలాలే లేవు. ఏదయినా నమ్మితే చాలాదృడంగా నమ్ముతాను. నా ముందు ఆంజనేయస్వామి, వెన్నంటి సాయిబాబా, కుడిపక్క కృష్ణుడు, ఎడమపక్క లలితమ్మ నిత్యం నాకు తోడువుంటారు. నా జీవితాన్నినడిపే సారధులువారే”

          అతనేమి అన్నాడో అసలు ఏమిచేప్పాలనుకుంటున్నాడో ఒక్క ముక్క అర్ధం కాలేదు నాకు. కాని ఏదో యుద్ధాన్ని గెలిచిన గర్వం, ఉల్లాసం ఆ గొంతులో స్పష్టంగా తెలుస్తోంది. అతని మాటలు మనస్తత్వం చిత్రంగా అనిపించాయి. అంత ఎక్సైట్మెంట్ ఎందుకో అంతు పట్టలేదు. అతనికి అనువాదం అయిపోయిన పేజీల సంఖ్య చెప్పి “కంగారు ఏమీలేదండీ. నిదానంగానే చేయండి” అన్నాను. ఓ నిమగ్నతతో ఇష్టనైవేద్యపు అర్పణలా ఏకధాటిన అదే రోజు అర్ధరాత్రికి ఐదుపేజీల అనువాదం చేసి పంపేశాడు. అతని స్పీడుకి, అంకిత భావానికి ఆశ్చర్యమేసింది.
దాన్ని పబ్లిషర్కి పంపాను. పబ్లిషర్ ఫెయిర్ చేసి పంపిన పేజీలను తిరిగి రామంకి పంపాను. వాటిలో అచ్చుతప్పులు, తప్పుపంక్చువేషన్మార్క్స్ అతనికి నచ్చలేదు.
“ఝాన్సీగారూ, పబ్లిషర్కి అంతగా ఇంగ్లిష్ నాలెడ్జి లేనట్టుంది. పబ్లిషరూ, మీరూ, నేనూ కాన్ఫెరెన్స్కాల్చేసుకుని ఎడిట్చేద్దామా. రాత్రి పది తరువాత నేను ఫ్రీ అవుతాను” అన్నాడు.

          “పబ్లిషర్ని అడిగి చెబుతానండీ” అన్నాను. పబ్లిషర్తో మాటాడి ఆ రాత్రి పదింటికి రామంకి కాల్చేసాను. అతను ప్రతి  పదాన్నీ విడమర్చి పబ్లిషర్కి చెప్పి కరెక్ట్చేయించే విధానం అద్భుతం.  ఎక్కడికక్కడ స్పెల్లింగ్తో పాటు అర్ధాన్ని కూడా వివరించడం మరీ నచ్చింది. వారిరువురి మధ్యా నేను శ్రోతగా మాత్రమే మిగిలిపోయాను.

          ఆ రోజు నుంచీ అనువాదం పూర్తయ్యేవరకూ రోజూ రాత్రి పదింటికి కాన్ఫరెన్స్ కాల్ మొదలయ్యేది. ఒక్కోసారి గంటా గంటన్నరలో పబ్లిషర్డ్రాప్ అయిపోయినా మేమిద్దరం అనువాదాన్ని ఇంకా మెరుగుపరిచే దిశగా డిస్కస్చేసుకునే వాళ్ళం. సమయమే తెలిసేది కాదు. ట్రాన్స్లేషన్ పూర్తియైనరోజు “శరత్ బాబుగారు చేసిన మొదటి భాగం కూడా నాకు పంపుతారా? నేను ఆ భాగం కూడా చేసాను. పోనీ నేను చేసింది మీకు పంపుతాను. రెంటినీ బేరీజువేసి తోచిన మార్పులూ చేర్పులతో ఫైనల్చేసుకోండి. ఏది ఏమైనా మీ పుస్తకం దిబెస్ట్గారావడమే నాకు కావలిసింది.” అన్నాడు.

          నేను ఆలోచనలోపడ్డాను. రెంటినీ పోల్చిచూసాను. కొన్ని స్టాంజాలు రామంవే బావున్నాయి. ఆంగ్ల భాష పైన మంచి పట్టు వున్న మనిషే. పైగా కొన్ని లైన్లు ఒక రిథంతో అంత్యప్రాసలో ముగించడం బావుంది. సొంతరచనే అన్నంత ప్రేమగా చేశాడు. అయినా నా మొదటి భాగాన్ని ట్రాన్స్లేట్చేసిన వాళ్ళ వర్క్ ని తీసేయాలను కోలేదు. అలానే ఉంచి, అనువాదకులుగా ఇద్దరి పేర్లనూ పెట్టమనీ, రామంని రెండో పేరుగా పెట్టమనీ పబ్టిషర్కి చెప్పాను.

          అనువాదంపూర్తయ్యేసరికి రామంకి నాతో చనువుపెరిగింది.
“రాత్రి పదయ్యేసరికి మీతో మాట్లాడటానికి అలవాటు పడిపోయాను. తీరిగ్గా ఉన్నప్పుడు కాల్చేయండి. నేనేమీ మిమ్మల్నిఇబ్బంది పెట్టను”అన్నాడు.

          “అయ్యో, ఎంత మాటండీ. తప్పకుండా చేస్తాను. వీలయితే రోజూనూ” అంటూ నవ్వాను. నిజానికి నేనూ అతని మాటలకు అడిక్ట్ అయిపోయాను. మా మధ్య రోజూ మాటలతో చనువు పెరిగింది, దూరం తరిగింది.

          పురాణాలు, వేదాంతం, రాజకీయం, నేటిజనరేషన్, నైతిక విలువలు, కలలు, మంత్రతంత్రాలు, జ్యోతిష్యం, వివాహాలు, పునర్వివాహాలు, పునర్జన్మలు, సినీ గేయాలు…

          ఇలా ఒకటేమిటి అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. కూలంకుషంగా చర్చించుకునే వాళ్ళం. అతనో నడిచే గూగుల్అని నాకు అర్ధమయ్యింది. అతని సూథింగ్కంఠ స్వరాన్ని బట్టి మంచి భావుకుడనీ, సుకుమారుడనీ అనుకున్నాను. అలాగే మాటాడే విషయాలను బట్టి స్థితప్రజ్ఞుడని అనిపించింది. ఇంకో విచిత్రమైన విషయమేమి టంటే తాత్వికచింతనా, రసికత్వమూ రెండు సగాలుగా అతనిలో కొలువున్నాయనీ అనిపించింది. అసలు ఆ మల్టీట్యాలెంట్ కి విస్తుపోయాను. అతను అరుదైన మనిషిలా, అపురూపమైన వ్యక్తిత్వం కలవాడిగా అనిపించింది.

          ప్రెస్నుండి పుస్తకాలొచ్చాయి. నా ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలను కున్నాను. మనసులో రామం మెదిలాడు. మొదటి కాపీని రామంకే ఇవ్వాలనిపిం చింది. రామంని డిన్నర్కి ఇన్వైట్చేసాను. అతనికి ఇష్టమైన వంటకాల గురించి ఆరాతీసాను. అతను బ్రాహ్మిన్అని తెలుసు కానీ అంతవరకూ మా ఇద్దరి మధ్యా ఎప్పుడూ కులమతాల ప్రసక్తిరాలేదు. అతను నాన్వెజ్ తింటాడని తెలిసి విస్తు పోయాను. చాటుగా నాన్వెజ్ని లాగించేసే దొంగబ్రాహ్మలు చాలా మంది తెలుసు నాకు. మటన్బిరియానీ చేసి, చికన్కర్రీ చేద్దామనుకున్న నా ప్లాన్అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అసలే నేను నాన్ వెజ్ ప్రియురాలిని. అతను కోరిన పెసరకట్టు, ఆలూఫ్రై, కొత్తిమీర కారం, పరమాన్నంచేసి బయటి నుండి కాశీతో స్వీట్స్తెప్పించి అతని రాక కోసం ఎదురు చూసాను. ఆ ఎదురు చూపుల్లో నేను ఇదివరకెన్నడూ ఎరుగని అనిర్వచనీయ ఉద్వేగం.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.