image_print

యాదోంకి బారాత్- 13

యాదోంకి బారాత్-13 -వారాల ఆనంద్           ఒకసారి ఉద్యోగంలో చేరింతర్వాత మన జీవిత చక్రం మారిపోతుంది. అప్పటి దాకా వున్న అలవాట్లు టైంటేబుల్ వున్నది వున్నట్టు వుండదు. ఉద్యోగకాలానికి అనుకూలంగా మారిపోతుంది. మార్చుకోవాలి. తప్పదు. అందులోనూ పని చేసే ఊర్లోనే వుంటే పరిస్థితి ఒకరకంగా వుంటుంది.  వేరే వూర్లో వుండి రొజు షటిల్ కొట్టాలంటే మరొక రకం. నాది షటిల్ సర్విస్. వేములవాడ-సిరిసిల్లా-వేములవాడ. అదట్లా వుంటే నేను ఉద్యోగంలో చేరిన 80 […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 22

వ్యాధితో పోరాటం-22 –కనకదుర్గ అమ్మ ఫోన్ చేసి శ్రావణ శుక్రవారం పూజ చేస్తున్నాను వచ్చి పొమ్మన్నది. పూజ కోసం కాకపోయినా ఇలాగైనా అమ్మని, నాన్నని చూసి రావొచ్చని, వెళ్దామనుకున్నాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చి మా అత్తగారిని తాంబూలం తీసుకొని వెళ్ళమని పిలిచారు. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు రమ్మన్నారు. నేను రెడీ అయ్యాను కానీ ఆమె తాంబూలం తీసుకుని వచ్చేదాక నేను వెళ్ళలేను, ఎందుకంటే శైలుని చూసుకోవాలి. శైలు లోపల కూర్చొని ఉన్నపుడు మా అత్తగారు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-35)

నడక దారిలో-35 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ :తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహా లతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపో యింది. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -11 (యదార్థ గాథ)

జీవితం అంచున -11 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి శిశిరం వసంతం కోసం కాచుకున్నట్లు ఆరేసి రోజుల ఎదురు చూపుల తరువాత బుధవారం వచ్చేది. ఆరు రోజుల రొటీను నుండి ఇష్టమైన ఆహ్లాదకరమైన మార్పు. ఆ ఇష్టమే రోటీనయితే మళ్ళీ అంత ఉత్సాహం వుండదేమో… బుధవారం ఇంటి పని, వంట పనికి సెలవు. ఆస్ట్రేలియాలో గ్రాసరీ షాపింగ్ చేయటం లేదా పిల్లలను దింపటం వరకేనా నా ఔటింగులు అని ఇంత వరకూ పడిన […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-10

నా అంతరంగ తరంగాలు-10 -మన్నెం శారద నాకు తెలిసిన జానకమ్మగారూ! 1992 లో నా టెలిసీరియల్ పనిమీద చెన్నై వెళ్తున్న నన్ను వీలు కుదిరితే తమ పత్రిక కోసం జానకమ్మ గారిని ఇంటర్వ్యూ చేయమని కోరారు మయూరి వారపత్రిక వారు. ఆ  పత్రిక కోసం నేను వివిధ రచయితలని చేసిన ఇంటర్వ్యూ లకు మంచి పేరు రావడంతో ఈ బాధ్యత నాకు అప్పగించారు. నేను చెన్నైలో నా పని చూసుకుని జానకి గారి ఫోన్ నంబర్ సేకరించి […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 12

యాదోంకి బారాత్-12 -వారాల ఆనంద్ ఉద్యోగ పర్వం – మంథని జీవితంలో అనేకసార్లు ఊహించని విధంగా మలుపులు ఎదురవుతాయి. వాటిల్లో మన ప్రమేయం అసలే ఉండక పోవచ్చు. కానీ ఎం చేస్తాం మలుపు తిరిగి ప్రయాణం కొనసాగిం చడమే. సరిగ్గా నాకు అట్లే జరిగింది. హాయిగా యునివర్సిటీలో చదువుతూ హాస్టల్ లో ప్రతి గురువారం సాయంత్రం హాఫ్ చికెన్, ప్రతి ఆదివారం ఫుల్ చికెన్ తింటూ ఏవో పోటీ పరీక్ష లకు తయారవుదామను కుంటున్న వేళ ఓ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 21

వ్యాధితో పోరాటం-21 –కనకదుర్గ ఫైనల్ ఇయర్ ఫేయిలవుతానేమో అని భయమేసేది కానీ చదువు మీద దృష్టి పెట్టలేకపోయాను. అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య, దాశరధి , ప్రముఖ కవి, ప్రజాకవి, సినీ కవి, కొన్నాళ్ళు ఆస్థాన కవిగా ఉన్నారు…. అంతకంటే ముఖ్యమైంది ఆయన నిజాం రాజుకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించి, ఎన్నోసార్లు జైలు కెళ్ళి జైలు గోడల పైన “నిజాము రాజు తరతరాల బూజు,” “రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు”. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-34)

నడక దారిలో-34 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలం స్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాల తో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -10 (యదార్థ గాథ)

జీవితం అంచున -10 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఉరకలేసే ఉత్సాహంతో రెండో వారం కాలేజీకి తయారయ్యాను. నేను బయిల్దేరే సమయానికి అప్పుడే రాత్రి షిఫ్ట్ ముగించుకుని వచ్చిన అల్లుడు కారు బయటకు తీసాడు. “పోయిన వారం అమ్మాయి దింపినప్పుడు నేను దారి జాగ్రత్తగా గమనించాను. గూగుల్ మ్యాప్ సాయంతో నేను వెళ్ళగలను..” అన్నాను అల్లుడితో లోలోపల ఒంటరిగా వెళ్ళటానికి కొంత భయంగా వున్నప్పటికీ. “లేదు మమ్మీజీ.. యూనివర్సిటీ రోడ్డు చాలా ప్రమాదకరమైన […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-9

నా అంతరంగ తరంగాలు-9 -మన్నెం శారద మహానటికి పుట్టినరోజు జే జేలు! —————————– సావిత్రి ! సావిత్రికి మరో పేరు ఉపమానం ఉంటాయా …వుండవుగాక వుండవు ! ఒక రోజు వైజాగ్ లో పనిచేస్తున్నప్పుడు మేం ఇద్దరమే కనుక తోచక అప్పటికప్పుడు ఏదో ఒక సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం !           అలా మేం అనుకున్న సినిమా టికెట్స్ దొరక్క జగదాంబలో ఆడుతున్న ఒక మళయాళ సినిమా కి వెళ్ళాం. కారణం అందులో […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 11

యాదోంకి బారాత్-11 -వారాల ఆనంద్ సామాజిక పోరాటాలూ- ఉన్నత చదువులు- యునివర్సిటీలో చేరిక  నాకు తెలిసి నేను మధ్య తరగతి జీవిని. పట్టణ వాసన వున్న వాణ్ని. చాలా వాటిని ప్రేమించాను, అభిమానించాను, ఆరాధించాను, ప్రేరణ పొందాను. కానీ, అందులోకి దిగలేదు కాళ్ళకు మట్టి అంటలేదు, ఒంటికి సురుకూ అంటలేదు. కానీ నేను నా విశ్వాసాల్ని, ప్రేమల్ని అభిమానాన్ని అట్లే ఉంచుకున్నాను. మారలేదు. నమ్మిన దానికి ఎప్పుడూ వ్యతిరేకమయితే కాలేదు. శత్రువుగానయితే మారలేదు. బహుశా నేను నమ్మింది […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 20

వ్యాధితో పోరాటం-20 –కనకదుర్గ నేను కాపురానికి వచ్చినపుడు శ్రీని, నేను రెండేళ్ళ వరకు పిల్లలు వద్దని అనుకు న్నాము. నేను జర్నలిజం చేసి జాబ్ చేయాలని నా కోరిక. కానీ నేను వచ్చిన నెల తర్వాత నుండే నేను నెల తప్పానా లేదా అని ఆరాలు మొదలయ్యాయి ఇంట్లో. నెల నెల బయట కూర్చుంటానని అనుకున్నారు. మా అత్తగారు శైలజతో కష్టం అవుతుందని బయట కూర్చోవడం మానేసారని, శైలజ కూడా కూర్చోదు కాబట్టి నేను ఆ ఆచారం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-33)

నడక దారిలో-33 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలం స్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహా లతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -9 (యదార్థ గాథ)

జీవితం అంచున -9 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి రాణి వెడలె రవితేజములలరగ… ఆనందోత్సాహములు మోమున వెల్లి విరియగ… ఓహ్… మీకు తెలియదు కదూ అమ్మ పెట్టిన నా అసలు పేరు ఝాన్సీ రాణి. అయ్యగారిని కట్టుకున్నాక ఇంటి పేరు మార్చుకోవటమే కాకుండా నా పేరులో సగాన్ని తొలిగించేసి వారికి స్థానం కల్పించి ఝాన్సీ శ్రీనివాస్ గా మారాను. ఐడీ కార్డు స్కాన్ చేస్తేగాని కాలేజీ ముఖద్వారం తెరుచుకోదు. ఇండియాలో పాడుబడిన ప్రభుత్వాఫీసులో […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-8

నా అంతరంగ తరంగాలు-8 -మన్నెం శారద నేనూ …నా చిన్నతనపు రచనావ్యాసంగం .. ————————————- ‘అసలు రచన అంటే ఏమిటి ..ఎలా రాయాలి, ఎందుకు రాయాలి’ అనే ప్రాధమిక విషయాలేమీ తెలియని రోజుల్లోనే నా రచనా వ్యాసంగం మొదలయ్యింది . మొదటిసారి అంటే నా ఏడవ సంవత్సరంలో మా పెదనాన్నగారు, దొడ్డమ్మ ఆయన చీపురుపల్లిలో ఉద్యోగం చేస్తున్నప్పుడు కాకినాడలో చదువుకుంటున్న వాళ్ళ పిల్లల్ని చూసేందుకు దగ్గర బంధువుల్ని ఇంట్లో పెట్టి వెళ్ళారు. వాళ్ళు పెదనాన్న పంపిస్తున్న మిఠాయిలు, […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 19

వ్యాధితో పోరాటం-19 –కనకదుర్గ డాక్టర్ పెట్టిన చివాట్లతో నాకు బుద్దివచ్చి మళ్ళీ క్లీనింగ్ లు కానీ, వంటలు కానీ చేయలేదు కానీ చైతన్య స్కూల్ హోం వర్క్ నా దగ్గరే కూర్చుని చేసుకుంటుంటే చూసేదాన్ని, క్లాస్ ప్రాజెక్ట్స్ చేయడంలో కూర్చునే సాయం చేసేదాన్ని. ఇలా జాగ్రత్తగా నెల అయిపోయింది. చెకప్ కి వెళితే డాక్టర్ అన్నీ చెక్ చేసి బ్రెదిన్ పంప్ (Brethen pump) తీసేసారు. పాప ఆరోగ్యంగా ఉంది, నేను బాగానే ఉన్నాను. బెడ్ రెస్ట్ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -8 (యదార్థ గాథ)

జీవితం అంచున -8 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి భయభక్తులతో బాల్యం, కఠిన నిబంధనల్లో కౌమార్యం, ప్రేమకు అర్ధం తెలియని అయోమయంలో యవ్వనం గడిచిపోయాయి. యవ్వనపు మావి చిగుర్లు చిగురించీ చిగురించకనే దాంపత్యంలో బంధింపబడ్డాను. ప్రేమ ఊసులు, ప్రియ సరాగాలు తెలియ కుండానే తల్లినై పోయాను. నవరసాల్లో జీవితంలో మానసికోల్లాసానికి ఎరువులైన రసాల కరువులోనే రెండొంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు అమ్మమ్మను కూడా అయ్యాక ఆరు పదుల నేను టేఫ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-7

నా అంతరంగ తరంగాలు-7 -మన్నెం శారద ఈ సారి నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన మా పెదనాన్న గారి గురించి చెబుతాను. పెదనాన్న పేరు కొమ్మిరెడ్డి కేశవరావు. తెల్లగా, సన్నగా, నాజూకుగా వుండే ఈయన్ని పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరూ నమ్మరు. ఇది వరకు కొన్ని ఎపిసోడ్స్ లో ఆయన గురించి ప్రస్తావించాను. పెదనాన్న పోలీస్ ఆఫీసర్ గా వున్నా ఆఁ కరకుదనం ఆయనలో ఎక్కడా కనిపించేది కాదు. పిల్లలలో పిల్లవాడిలా కలిసి ఆడి పాడేవారు. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-32)

నడక దారిలో-32 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాల తో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయిం […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 10

యాదోంకి బారాత్-10 -వారాల ఆనంద్ ఖాళీ కాలాలు- భాష్యత్తు పునాదులు వైఫల్యం అనుకుంటాం కానీ విద్యార్థి కాలంలో ఫెయిల్ అయ్యో, పై చదువులకు సీటు దొరక్కో ఒకటో రెండో సంవత్సరాలు ఖాళీ దొరికితే…ఆ కాలం మామూలు యువకుల సంగతేమో కానీ సృజన రంగం పట్ల అసక్తి ఉత్సాహం వున్న వాళ్ళకు బంగారు కాలమే. ఆ కాలం ఎన్నో చదవడానికి ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తు రూపొందడంలో ఆ కాలం గట్టి పునాదులు వేస్తుంది. నా అనుభవంలో 1977-78 […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -7 (యదార్థ గాథ)

జీవితం అంచున -7 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి మనిషికి ఆనందంలో కలిగే ఉత్సాహానికి, దిగులు వలన కలిగే నిస్సత్తువకి ఎంత వ్యత్యాసం..? ఒక్కసారిగా అన్నింటి పైన ఆసక్తి తగ్గి నన్ను నైరాశ్యం ఆవహించేసింది. అర్ధ శతాధిక వసంతాల జీవితచక్రం కళ్ళ ముందు గిర్రున తిరిగింది. రక్తపాశాలు, పేగు బంధాలు, స్నేహ సాంగత్యాలు, అనేకానేక పరిచయాలు, కీర్తి శేషమైన ప్రియ బంధాలు… ఒక్కొక్కటిగా రీలు మారుతూ కనుమరుగవుతున్నాయి. జీవితం ఇంతేనా అనే వైరాగ్య […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 9

యాదోంకి బారాత్-9 -వారాల ఆనంద్ నటరాజ కళానికేతన్- సభలు సమావేశాలూ 1975-76 ప్రాంతం. డిగ్రీ చదువుతున్న రోజులు. అప్పుడప్పుడే టీనేజీ దాటుతున్న కాలం. ఒక వైపు అకాడెమిక్ చదువులు వాటి వొత్తిడి. మరోవైపు సాహిత్యం పత్రికలు సభలు సమావేశాలూ జీవితాన్ని కమ్ముకుంటున్న సమయం. ఇటు కరీంనగర్ లోనూ అటు వేములవాడలోనూ సాహిత్య నాటక సభలు నా ఒక్కడి కాలాన్నే కాదు నా సహచరుల అందరి జీవితాల్నీ బాగా ప్రభావితం చేసాయి. మరో వైపు సిరిసిల్లా జగిత్యాల పోరాటాల […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 18

వ్యాధితో పోరాటం-18 –కనకదుర్గ “ఇపుడు ఇన్ని సమస్యలు, ఇన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి. మా సమయంలో అయితే కాన్పు కాగానే పిల్లగానీ, పిల్లవాడ్ని గానీ ఇంట్లో వున్న పెద్ద వారికి అంటే అత్తగారికి అప్ప చెప్పి పొలంకి వెళ్ళి పని చేసే వాళ్ళం తెలుసా?” అంది. నేను ఇలాంటి కథలు వినే వున్నాను.  చైతన్య కడుపులో వున్నపుడు అత్తగారింట్లోనే వుండేవారం. శ్రీనివాస్ అమ్మమ్మ వుండేవారు. ఆమె చాలా జాగ్రత్తగా మా మామగారు, శ్రీనివాస్ ఆఫీస్ లకు వెళ్ళిపోయాక నన్ను […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-31)

నడక దారిలో-31 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-6

నా అంతరంగ తరంగాలు-6 -మన్నెం శారద మాచర్ల…! దాని అసలు పేరు మహాదేవచర్ల అని నాకు చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన చక్రపాణి మాస్టర్ గారు చెప్పారు. నాకప్పుడు ఆరేళ్లయిన మాస్టారి మొహం స్పష్టంగా గుర్తుంది. మాచర్లని ఎవరన్నా హేళనగా మాట్లాడితే మాస్టర్ గారు భాస్వరంలా మండిపడేవారు. అందుకే శ్రీనాథుడంటే ఆయనకు వళ్ళు మంట! ఆయన పల్నాడు మీద రాసిన చాటువులు కొన్ని చెప్పి మండిపడి “అందుకే అలాంటి శిక్ష అనుభవించాడు అనేవారు. వాటిలో ఒకటి రెండు గుర్తున్నాయి. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -6 (యదార్థ గాథ)

జీవితం అంచున -6 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అనారోగ్యంలో మనిషిని వైరాగ్య భావన అమాంతం ఆవహించేస్తుంది. అప్పటి వరకూ వున్న ఉత్సాహాన్ని చప్పగా చల్లార్చేస్తుంది. మనిషిలో అనారోగ్యం కన్నా అనారోగ్యంగా వున్నామన్న ఆలోచన పెనుభూతంలా కబళించేసి మానసికంగా కృంగదీసేస్తుంది. క్వాన్టిఫెరాన్ TB పరీక్ష ఫలితాలు కాళ్ళ కింద భూమిని కదిలించేసాయి. లో లెవెల్ పాజిటివ్. ఎమర్జెన్సీ అటెన్షన్ అంటూ GP నుండి పిలుపు వచ్చింది. ఒక్కసారిగా నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 17

వ్యాధితో పోరాటం-17 –కనకదుర్గ ఫోన్ తీసుకొని, “బూస్టర్ షాట్ తీసుకున్నాను డాక్టర్,” అని చెప్పాను. ఏం జరుగు తుందోనని నాకు భయం పట్టుకుంది. “ఓ.కే, నౌ డోంట్ మూవ్, జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ ప్లీజ్ రెస్ట్. నువ్వు ఇపుడు ఒకసారి చెకప్ కి రావాలి, రాగలవా?” ” డాక్టర్ ఈజ్ ఎనీధింగ్ రాంగ్? నాకు భయం వేస్తుంది….” నాకు ఏడుపొస్తుంది. చైతు వచ్చి నా చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. ” ఒకసారి చెక్ చేస్తే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-30)

నడక దారిలో-30 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కుటుంబంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-5

నా అంతరంగ తరంగాలు-5 -మన్నెం శారద అమ్మమ్మ ఊరు కాకినాడ గురించి చెప్పానుకదా… ఇప్పుడు నానమ్మ ఊరు ఒంగోలు గురించి చెప్పాలి. మా తాతగారు అమ్మ పెళ్ళికి ముందే చనిపోవడంతో మా పెదనాన్నగారే గుంటూరు లో పనిచేస్తూ ఈ సంబంధం చూశారని చెప్పాను కదా! నాన్నమ్మకు ఈ సంబంధం ఎంత మాత్రం ఇష్టం లేదట! “అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్ల మనతో ఎక్కడ కలుస్తుంది, వద్దు “అని చాలా గొడవ చేసిందట. అయితే నాన్న […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -5 (యదార్థ గాథ)

జీవితం అంచున -5 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Care for one… that’s love. Care for all… that’s nursing. కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది. మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను. ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా… నా కంటి […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 8

యాదోంకి బారాత్-8 -వారాల ఆనంద్ కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం           వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావవంత మయినది. అనేక ఆటుపోట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 16

వ్యాధితో పోరాటం-16 –కనకదుర్గ రోజూ చైతన్య స్కూల్ కి, శ్రీని ఆఫీస్ కి వెళ్ళేలోగా అన్నీ పనులు చేసుకుని రిలాక్స్ అయ్యేదాన్ని. వాళ్ళు వెళ్ళేలోపే స్నానం చేసి, ఏదైనా తినేసి టీ.వి పెట్టుకుని కూర్చునే దాన్ని. మధ్యాహ్నం శ్రీని ఆఫీస్ నుండి లంచ్ టైమ్ లో వచ్చి తినడానికి చాలా హెల్తీ తిండి చేసి పెట్టేవాడు. తను కూడా లంచ్ చేసి వెళ్ళేవాడు. నాకు పనంతా శ్రీని పైనే పడినందుకు చాలా బాధగా వుండేది. కానీ డాక్టర్స్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-29)

నడక దారిలో-29 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-4

నా అంతరంగ తరంగాలు-4 -మన్నెం శారద అమ్మమ్మ వూరికి  ప్రయాణం Co canada నా చిన్నతనంలో రెండు రైల్వేస్టేషన్లలో ఈ పేరే ఉండేది. cocanada.. town, cocanada.. Port అని. కెనడాలా ఉంటుందని బ్రిటిష్ వారు ఆఁ పేరు పెట్టారని  అంటుంటారు. కాకినాడ formed city అని కూడా అంటుంటారు. Rectangular road system, మెయిన్ రోడ్డుతో పాటూ అటూ ఇటూ ఫాలో అవుతుండే అరడజను రోడ్లు, సినిమా హాల్స్ అన్నీ ఒకే వీధిలో ఉండడం, కాకినాడ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -4 (యదార్థ గాథ)

జీవితం అంచున -4 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Every great dream begins with a dreamer.. ఎప్పుడో ఎక్కడో చదివిన కోట్. అవును. చిరకాల కల. నిశిరాతిరి నిద్దట్లో కల… వేకువజాము కల… పట్టపగటి కల… వేళ ఏదయినా కల ఒకటే. మనది కాని విదేశీయుల విశ్వవిద్యాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు మోపుతానా అని మనసు ఒకటే ఉవ్విళ్లూరుతోంది. నర్సింగ్ విద్యార్థి ఊహే నా వయసును అమాంతం రెండింతలు తగ్గించేసింది. మనలో […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 7

యాదోంకి బారాత్-7 -వారాల ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.కాలేజ్ డిగ్రీ చదువులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు           1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటి నుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 15

వ్యాధితో పోరాటం-15 –కనకదుర్గ నిన్నటిలాగే ఇన్సూలిన్ ఇస్తున్నారు. మంటలెక్కువగా వుంటే చల్లటి టవల్స్ ఇచ్చారు. చైతు, శ్రీని తల పైన, కళ్ళపైన, చేతులు, కాళ్ళపైన వేస్తూ వున్నారు. థాంక్స్  గివింగ్ డిన్నర్ నాలుగు గంటలకు స్పెషల్ వుంటుందన్నారు. మధ్యాహ్నం కాఫెటేరియాకి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తినేసి వచ్చారు. ఫాల్ సీజన్ మొదలయ్యింది. ఈ సారి స్నో చాలా త్వరగా పడింది. ఇప్పుడు బయట ఆకులు రంగులు మారాయి ఇప్పుడు. మొత్తానికి ఈ ట్రీట్మెంట్ వల్ల నొప్పులు రావడం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-28)

నడక దారిలో-28 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీలో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-3

నా అంతరంగ తరంగాలు-3 -మన్నెం శారద ఒక ఆర్టిస్ట్ గా ఇది నా అక్కసో, బాధో అని మీరు అనుకోవచ్చు. మా చిన్నతనంలో బొమ్మలు వేయాలంటే మాకు వడ్డాది పాపయ్యగారో, లేదా బాపు గారి బొమ్మలో శరణ్యమయ్యేయి. లేదా ఇంట్లో గోడలకి వున్న రవివర్మ పటాలు దిక్కయ్యేయి. వాటిని చూసే ప్రాక్టీస్ చేసే వాళ్ళం. ఇప్పటిలా గూగుల్ లో వెదకి పట్టుకునే పరిస్థితి మాకు అప్పుడు లేదు. సినిమా తారల ఫోటోలు పత్రికల మీద అందుబాటులో వున్నా […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -3 (యదార్థ గాథ)

జీవితం అంచున -3 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Future is always a mystery… మనిషి టెక్నాలజీ పరంగా ఎంత పురోగతి సాధించినా రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోలేడు కదా. రాత్రి కమ్మిన దిగులు మేఘాలకు ఎప్పుడో అపరాత్రికి పడుకున్నానేమో చాలా ఆలస్యంగా లేచాను. ఆ రోజు శనివారం సెలవు కావటం వలన అందరూ ఇంట్లోనే వున్నారు. అల్లుడు స్టడీ రూములో కూర్చుని కంప్యూటర్ నుండి ఏవో ప్రింట్ ఔట్స్ తీస్తున్నాడు. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 14

వ్యాధితో పోరాటం-14 –కనకదుర్గ పిల్లలకు ఎవ్వరికైనా జ్వరం వస్తే నాన్న ఒకోసారి సెలవు పెట్టి దగ్గరుండి చూసుకునేవారు. జ్వరం వల్ల నాలిక చేదుగా వుంటే డ్రై ప్లమ్స్ తెచ్చేవారు, అది నోట్లో పెట్టుకుంటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుండేది. జ్వరం వస్తే అన్నం తినకూడదని, బ్రెడ్, పాలల్లో వేసి తినిపించేవారు. నాన్న ఆఫీసుకెళ్తే అమ్మని మా దగ్గరే కూర్చోమని గోల చేసేవాళ్ళం. అమ్మ త్వరగా పని చేసుకుని వచ్చి మా దగ్గరే వుండేది. అమ్మ చేయి పట్టుకునే వుండేదాన్ని. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 6

యాదోంకి బారాత్-6 -వారాల ఆనంద్         నాటి నుంచి నేటి దాకా “జాతర” సామాన్యుని ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్ధిక వ్యక్తీకరణ వేదిక. ఇవ్వాల్టి సాంకేతికత, అభివృద్ది వెలుగు చూడని దశాబ్దాల క్రితం నుండి జాతర అనగానే సామాన్య ప్రజలు వందలు వేలుగా గుమిగూడేవారు. అదొక గొప్ప సామూహిక వ్యక్తీకరణ. తమ ఇష్ట  దైవాలకు మొక్కులు తీర్చుకునే సందర్భమది. తర్వాత అంతా సమిష్టిగా వినోదమూ, వ్యవహారమూ, వ్యాపారమూ నిర్వహించుకునే ఒక అద్భుత వేదిక జాతర. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-27)

నడక దారిలో-27 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతిపత్రిక లో  శీలా వీర్రాజుగారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభా వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, డిగ్రీ చదువు పూర్తిచేసుకుని […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -2 (యదార్థ గాథ)

జీవితం అంచున -2 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి తరువాతి మూడు రోజులు మూడు యుగాల్లా గడిచాయి. ఒకటే రెస్ట్లెస్ నెస్… రెస్ట్లెస్ నెస్ అంటే ఏమిటంటారా… నాకు అప్పుడప్పుడూ కలిగే కుదురుంచని ఒక అస్థిమిత భావన. అది కలిగినప్పుడు విసుగ్గా వుంటుంది… ఏ పని పైనా ధ్యాస వుండదు. మాట్లాడుతున్నా ఆ మాటలు నావి కావు. టీవీలో సినిమా చూస్తున్నా నా కళ్ళు దానిని గ్రహించవు. చదువుతున్నా తలకెక్కదు. తింటున్నా నాలుకకు […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-2

నా అంతరంగ తరంగాలు-2 -మన్నెం శారద  “Painting is just another way of keeping a diary.”……….Pobolo Picasso***           ఇంట్లో నేను పని దొంగనని పేరుంది గానీ నేను చాలానే పని చేసేదాన్ని. వంటపని అంటే మాత్రం నాకు గిట్టేది కాదు. (తర్వాత అన్నీ నేర్చుకున్నాననుకోండి ). అలానే మిషన్ మీద బట్టలు కుట్టడం కూడా .           పాతసినిమాల్లో బీదవాళ్లంతా మిషన్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-26)

నడక దారిలో-26 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో  శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో కలంస్నేహం, తదనంతరం బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 5

యాదోంకి బారాత్-5 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ ఇల్లు- నా బాల్యం ఎ దౌలత్ భి లేలో ఎ షౌరత్ భి లేలో భలే చీన్ లో ముఝ్ సే మేరీ జవానీ మగర్ ముఝ్ కో లౌటాదే బచ్ పన్ కా సాయా ఓ కాగజ్ కి కష్తి ఓ బారిష్ కా పానీ ..( సుదర్షన్ ఫకీర్)           ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ స్వరంలో ఎన్నిసార్లు విన్నానో […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 13

వ్యాధితో పోరాటం-13 –కనకదుర్గ ట్రీట్మెంట్ ఎంత త్వరగా మొదలుపెడితే అంత త్వరగా నొప్పులని ఆపొచ్చు, లోపల పాపకి కూడా స్ట్రెస్స్ తగ్గుతుంది అన్నారు. పాపం శ్రీని ఆ రోజే కొత్త జాబ్ లో జాయిన్అవ్వాల్సింది. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితి చెబితే లాప్ టాప్ తో స్టార్ట్ చేయొచ్చు, నీకు టైం దొరికినపుడు కాసేపు వర్క్ చేయమన్నారు. చైతు స్కూల్ కి వెళ్ళాడు. అప్పటికి అందరూ ఇండియన్ కొలీగ్స్ కుటుంబాలతో వెళ్ళిపోయారు. సుజాత అనేఒక తమిళ […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-1

నా అంతరంగ తరంగాలు-1 -మన్నెం శారద The purpose of our life is to be happy… Dalailama***          అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సారాలు. చదువు కొనసాగుతోంది . ఆ రోజు రాత్రి నన్ను పురజనులు ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తూ ఘనంగా సన్మానిస్తున్నట్లుగా కలొచ్చింది . మెలఁకువరాగానే “ఇది కలా ?” అని కొంత నిరుత్సాహ పడినా ఆ దీపాలు, వింజామరలు, జనసందోహం …కళ్ళలో కనిపిస్తుంటే ….పొంగిపోతూ మొహం […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -1 (యదార్థ గాథ)

జీవితం అంచున -1 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి   PROLOGUE  Life is taking up challenges  Life is achieving goals Life is being inspiration to others And age should not be a barrier for anything….           అనగనగా అప్పట్లో పంథొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఓ అమ్మాయి తెల్లని కోటు, చల్లని నవ్వుతో రోగుల గాయాలు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-25)

నడక దారిలో-25 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామాతో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 4

యాదోంకి బారాత్-4 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ – ఓ చరిత్ర ఓ జ్ఞాపకం కరీంనగర్ నా నేస్తం, కరీంనగర్ నా ప్రేయసి, కరీంనగర్ నా జీవితం, కరీంనగర్ నా ఊపిరి. కరీంనగర్ పోత్తిల్లల్లో పెరిగాను, వీధుల్లో తిరిగాను, ఒకటి కాదు రెండు కాదు ఆరు దశాబ్దాలకు పైగా ఈ వూరును నేను పెనవేసుకున్నాను. ఈ వూరు నన్ను తన చేతుల్లో పెంచింది.           వ్యక్తిగతంగా, […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 12

వ్యాధితో పోరాటం-12 –కనకదుర్గ 8వ నెలలో మళ్ళీ ఒక అటాక్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళారు. నొప్పి ప్రాణం పోతుందేమో అన్నంతగా వచ్చింది. నేను అంబులెన్స్ కి కాల్ చేయమంటే ఎందుకు నేను తీసుకెళ్తాను అంటాడు శ్రీని. మనమే కార్ లో వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాలి, ట్రాఫిక్ ఎక్కువగా వుంటే ఆగిపోతాము, ఇక నొప్పితో ఏం జరిగినా ఏం చేయడానికి వుండదు. అదే అంబులెన్స్ అయితే వాళ్ళకి ట్రాఫిక్ లో క్లియరెన్స్ వుంటుంది. అదీ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-24)

నడక దారిలో-24 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామాతో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 11

వ్యాధితో పోరాటం-11 –కనకదుర్గ శ్రీని లోపల పని చేసుకుంటున్నాడు. వంట చేస్తున్నట్టున్నాడు. “నీకు ఇడ్లీ పెట్టనా ఈ రోజుకి?” అని అడిగాడు కిచెన్ నుండి. “సరే,”అన్నాను. పాపని చాలా మిస్ అయ్యాను. దాన్నే చూస్తూ కూర్చున్నాను. నా తల్లి ఎంత ముద్దుగా వుందో? ఎంత కావాలనుకుని కన్నాను కానీ అది కడుపులో వున్నపుడు చిన్ని ప్రాణాన్ని ఎంత బాధ పెడ్తున్నాను కదా, నా కిచ్చే మందులు దానికి వెళ్ళేవి, పాపం నార్మల్ గా, ఆరోగ్యంగా పెరగాల్సిన పిల్ల […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 3

యాదోంకి బారాత్-3 -వారాల ఆనంద్ వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపన- దృశ్య చైతన్యం           ఉత్తమ సినిమాల్ని ప్రజలకు చేరువ చేసే క్రమంలో నేను గత నాలుగు  దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో కృషి చేసాను. ఆ పని 23 ఆగస్ట్ 1981 రోజున ఆరంభమయింది. ఆ రోజు అప్పటికి మామూలు గ్రామమయిన వేములవాడలో ఫిలిం సొసైటీని ప్రారంభించాం. ఇక అప్పటి నుంచి అర్థవంతమయిన సినిమాల్ని చూడడం అధ్యయనం చేయడం, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-23)

నడక దారిలో-23 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సులోనే తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా అంచెలంచెలుగా సాగిన డిగ్రీ చదువు. ఖాళీ సమయాలను సాహిత్యం , సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామాతో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 10

వ్యాధితో పోరాటం-10 –కనకదుర్గ నాకు ప్రెగ్నెంసీ అని తెలిసేటప్పటికి శ్రీని ఇండియన్ కొలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు. కొంత మంది ఇండియాకెళ్ళారు, కొంత మంది అమెరికాలోనే వుండాలని నిర్ణయించుకుని పర్మనెంట్ ఉద్యోగాలు చూసుకొని వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పోయారు. జోన్ అంటుండేది, “నీ డెలివరీ అయ్యాక మీకెప్పుడైనా అవసరమొస్తే అపుడు నేను బేబిసిట్ చేస్తాను.” అని. డా. రిచర్డ్ ఈ.ఆర్. సి.పి కి రమ్మంటే జోన్ ని టెస్ట్ అయ్యి వచ్చేదాక పాపని చూసుకుంటావా అని అడిగితే, […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 2

యాదోంకి బారాత్-2 -వారాల ఆనంద్ వేములవాడ-కొన్ని వెంటాడే దృశ్యాలు           అయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆటవిడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు ముందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మా వూరు కరీంనగర్. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్-1 (ఈ నెల నుండి ప్రారంభం)

యాదోంకి బారాత్-1 -వారాల ఆనంద్ కళానికేతన్= కవితా చిత్ర ప్రదర్శన            ఇటీవల మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఇవ్వాళ ఈ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటున్నాను. ***           మా వూరు కరీంనగర్ అయినా చిన్నప్పుడు బడికి సెలవులోస్తే అమ్మగారింటికి చెక్కేయడం, స్వేచ్చా గాలుల్ని […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-22)

నడక దారిలో-22 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లోనే తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం , సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజుపేరు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 9

వ్యాధితో పోరాటం-9 –కనకదుర్గ సాయంత్రం పిల్లల్ని తీసుకుని శ్రీని వచ్చాడు. పాప ఆ రోజు సరిగ్గా పడుకోలేదు, అందుకే కొంచెం చికాగ్గా వుంది. ఏడుస్తుంది. అందరూ వూరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. “ఇది హాస్పిటలా, ఇల్లా? ఇక్కడ పేషంట్లకి రెస్ట్ అవసరం అని తెలీదా? ఇపుడే నిద్ర పట్టింది? ఇక్కడ సరిగ్గా పడుకోవడానికి కూడా లేదా?” అని గట్టిగా అరిచింది పక్క పేషంట్. నర్స్ బెల్ ఆగకుండా నొక్కుతూనే వుంది. జూన్ పరిగెత్తుకొచ్చింది. పాపని చూసి,” హాయ్ స్వీటీ! వాట్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-21)

నడక దారిలో-21 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 8

వ్యాధితో పోరాటం-8 –కనకదుర్గ బాగా అలసటగా వుంది. పొద్దున్నుండి నొప్పికి ఇంజెక్షన్ తీసుకోలేదు. టీలో కొన్ని సాల్టీన్ బిస్కెట్లు (ఉప్పుగా, నూనె లేకుండా డ్రైగా వుంటాయి) నంచుకుని తిన్నాను. టీ చల్లారి పోతే నర్స్ బటన్ నొక్కితే టెక్ వచ్చి టీ తీసుకెళ్ళి వేడి చేసి తీసు కొచ్చింది. వేడి టీ త్రాగాను మెల్లిగా. ప్రక్క పేషంట్ ని చూడడానికి డాక్టర్లు వచ్చి వెళ్ళారు. ఫోన్ లో ఇంట్లో వాళ్ళకి ఏమేం తీసుకురావాలో గట్టిగా చెబుతుంది. “నా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-20)

నడక దారిలో-20 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 7

వ్యాధితో పోరాటం-7 –కనకదుర్గ మోరా ఇంజెక్షన్ తీసుకొచ్చింది.  “హే స్వీటీ, వాట్ హ్యాపెన్డ్? కమాన్, ఇట్స్ ఓకే డియర్!” ఇంజెక్షన్ పక్కన పెట్టి నా తల నిమురుతూ వుండిపోయింది. “మోరా కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యాంటి యాంగ్జయిటీ మెడిసన్ ప్లీజ్! ఈ రోజు తీసుకోలేదు ఒక్కసారి కూడా.” “ఓకే హనీ నో ప్రాబ్లెం. ఫస్ట్ టేక్ యువర్ పెయిన్ ఇంజెక్షన్. దెన్ ఐ విల్ గెట్ యువర్ అదర్ మెడిసన్.” అని ఇంజెక్షన్ ఇచ్చి. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-19)

నడక దారిలో-19 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 6

వ్యాధితో పోరాటం-6 –కనకదుర్గ “హాయ్ డియర్! ఐ హావ్ టు టేక్ వైటల్ సైన్స్,” అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. కొత్త టెక్నిషియన్ వచ్చింది. రాత్రి పదకొండు దాటుతుంది. మళ్ళీ నర్సులు, టెక్స్ మార్తారు. కానీ మోరా 7 గంటల నుండి పొద్దున 7 వరకు రెండు షిఫ్ట్స్ కలిపి చేస్తున్నానని చెప్పింది. బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, పల్స్, అన్నీ చెక్ చేసి నోట్ చేసుకుని వెళ్ళిపోయింది టెక్. ఇంటి నుండి ఫోన్ వచ్చింది. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-18)

నడక దారిలో-18 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 5

వ్యాధితో పోరాటం-5 –కనకదుర్గ ఆయన ఈ రాత్రికి అమెరికా వెళ్తున్నందుకేమో పేషంట్స్ ఎవ్వరూ లేరు. కొన్ని చేయాల్సిన పనులు చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. “అయిపోయాడు ఈ రోజు ఆ పిఏ. పాపం అతని పేరు చెప్పకుండా వుండాల్సింది.” అన్నాను. అయిదు నిమిషాల్లో వచ్చారు డాక్టర్ గారు. వచ్చి తన సీట్లో కూర్చున్నారు. “బ్లడ్ వర్క్ లో పాన్ క్రియాటైటిస్ అని వచ్చింది. డా. రమేష్, నేను నిన్న అదే అనుకున్నాము.” “అంటే సీరియస్ ప్రాబ్లమా? ఇపుడు ఏం చేయాలి?” […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 4

వ్యాధితో పోరాటం-4 –కనకదుర్గ ఒక కొబ్బరి బొండాం తీసుకుని ఆటోలో వెళ్తుండగా కొద్ది కొద్దిగా సిప్ చేయసాగాను. చైతుని ఎపుడూ వదిలి పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు మేము, సినిమాలకి వెళ్ళడం మానేసాము వాడు పుట్టినప్పట్నుండి. వాడిని తీసుకుని పార్క్ లకు వెళ్ళడం, అత్తగారింటికి, అమ్మ వాళ్ళింటికి వెళ్ళినా, అక్క, అన్నయ్య వాళ్ళింటికి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కల్సి వెళ్ళడమే అలవాటు. చాలా మంది అనేవారు, ‘సినిమాలు మానేయడం ఎందుకు? వాడికి ఏ బొమ్మొ, లేకపోతే తినడానికి ఏ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-17)

నడక దారిలో-17 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను.స్వాతిపత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. నేనని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 3

వ్యాధితో పోరాటం-3 –కనకదుర్గ మోరా వెళ్ళిపోయాక నాకు ఇండియాలో నొప్పి ఎలా వచ్చింది, అక్కడ డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నీ గుర్తు రాసాగాయి. నొప్పి వచ్చిన రోజు శ్రీని ఇంటికి వచ్చాక జరిగిన సంగతి తెల్సుకుని, మన డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుందాము అని వెంటనే బయల్దేరారు. కైనెటిక్ హోండా స్కూటర్ పై వెళ్ళేపుడు పొద్దున వెళ్ళిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు కొంచెం బాగానే వుందని చెబితే టెస్ట్స్ చేయించుకుని రమ్మని చెప్పింది. అలాగే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-16)

నడక దారిలో-16 -శీలా సుభద్రా దేవి ఇద్దరి మధ్యా లేఖలు పావురాలై ఎగరటం మొదలై ఆరునెలల పైనే అయ్యింది. కొత్త ఏడాది కొత్త ఊహలను ప్రోది చేసుకుంటూ అడుగు పెట్టింది. ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో ఎన్నెన్ని మార్పులనో తీసుకువచ్చేలానే అనిపించింది. ఎన్నెన్ని  కొత్త అనుభవాలనో తొలి అడుగులోనే రుచి చూపిస్తూ కొంగ్రొత్త మలుపులను తీసుకు వచ్చేలానే ఉంది. అవి నాకు శుభసంతోషాలనే ఇస్తుందో , కష్టాల కడగండ్లు పాదాల ముందు పరుస్తుందో. అన్నింటినీ ఎదుర్కోగలిగే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-15)

నడక దారిలో-15 -శీలా సుభద్రా దేవి నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.          అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు.          ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది.            మర్నాడు టిఫిన్లు చేసి […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 2

వ్యాధితో పోరాటం-2 –కనకదుర్గ కడుపులో భయంకరంగా నొప్పి మళ్ళీ మొదలయ్యింది. గతంలోనుండి బయటపడి నర్స్ బటన్ నొక్కాను. సాయంత్రం 7 అవుతుంది. నర్సులు డ్యూటీలు మారుతున్నట్టున్నారు. కానీ నొప్పి భరించడం కష్టం అయిపోయింది. నర్స్ బటన్ నొక్కుతూనే వున్నాను. నర్స్ మోరా, ” ఐ యామ్ కమింగ్ డియర్, ఐ నో యు మస్ట్ బి ఇన్ పెయిన్,” అని ’డెమొరాల్,’ అనే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తో వచ్చి నడుం దగ్గర ఇచ్చి వెళ్ళింది.  మొదట్లో […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-14)

నడక దారిలో-14 -శీలా సుభద్రా దేవి  జూన్ నెల 1970 లో ఒకరోజు మాచిన్నన్నయ్య కొత్తగా విడుదల అయిన స్వాతి మాసపత్రిక ప్రారంభ సంచిక తీసుకు వచ్చాడు.అంతకు ముందు జ్యోతి,యువ మాసపత్రిక  మాదిరిగా అదే సైజు లో అందమైన బాపు ముఖచిత్రంతో ఆకర్షణీయంగా ఉంది. తర్వాత ఆ చిత్రాన్నే స్వాతి లోగో లా వాడుతున్నారు.అందులో అప్పట్లోని సాహితీ ప్రముఖులరచనలతో సాహిత్యం పట్ల ఇష్టం ఉన్న వారికి ఆనందం కలిగించి హృదయానికి హత్తుకోవాలనిపించే రచనలు ఉన్నాయి.      కుమారీ వాళ్ళఅన్నయ్య  […]

Continue Reading
Posted On :