
పూల పరిమళ స్నేహం
-కోడం పవన్ కుమార్
ఇన్నేళ్ళ మన స్నేహంఈ మధ్య కాలంలోనీ కళ్ళలో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రేమైక జీవనంఈ మధ్య కాలంలోనీ గుండె స్పందనలు లయ తప్పుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన పలకరింపుఈ మధ్య కాలంలోనీ పెదవులపైన మాటలు చిగురుటాకులా వణుకుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రతి కలయికలోఒక మొక్క జీవం పోసుకునేదిఒక ఆత్మీయత టీ కప్పును పంచుకునేదిఒక బాధ మేఘమై ఆకాశంలో పరుగులు పెట్టేదికాలం క్షణాల్లో కరిగికలుసుకున్న చోట తీపి గురుతును వదిలేదిమైదాన ప్రాంతాలను వదిలిమహానగరాలను దాటిమెరీనా తీరం వెంట అలలై దూకేవాళ్ళంఅలసి అలసి సముద్రమై నిలిచేవాళ్ళం స్నేహానికి దూరం లేదనిదూరంగా ఉన్న శరీరాలను మనస్సు కలిపికుటుంబ బాధల బరువును తప్పిస్తుందని నమ్మేవాళ్ళంనమ్ముతూ బతికేస్తున్న వాళ్ళం సమయమేం మించిపోలేదుమన కళ్ళలో జ్యోతులు వెలిగించుకోవాలిగుండె భాస్వరమై మండుతుండాలిపెదవులపై తేనే పలుకులు చిలుకుతుండాలివచ్చే కాలం మనదేనని చాటిచెప్పాలిస్నేహైక ప్రేమజీవనంలోని పలకరింపులుపరిమళించే పూలను పూస్తున్న మొక్కల్లాజీవితపు పెరటితోట నిండా ఎదుగుతుండాలి
*****

కవిత్వం జీవితం సమాంతరేఖలని విశ్వనించే నేను జర్నలిజం వృత్తిలో కొనసాగాను. ఈనాడు, వార్త, మన తెలంగాణ తదితర దినపత్రికలలో పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం ఫ్రీలెన్స్ జర్నలిస్టుగా కొనసాగుతున్నాను. 2014లో ’సగం సగం కలసి‘ కవితా సంపుటిని, 2020లో ’కరోనా@లాక్ డౌన్. 360 డిగ్రీస్‘ పేరుతో 59 వ్యాసాల సంపుటిని వెలువరించాను. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల వారిగా సాంఘిక, భౌగోళిక, రాజకీయ చరిత్రతో కూడిన పుస్తకాలను వెలువరిస్తుండటంలో భాగంగా ’అంబర్ పేట ః ఆకాశానికి పూసిన మందారం‘ పేరుతో 225 పేజీలతో కూడిన పుస్తకంను 2019 వెలువరించడం జరిగింది. ప్రస్తుతం ముషీరాబాద్ నియోజకవర్గంపై పని కొనసాగుతున్నది.
