
అంతా నీటి మీద రాతలే
(కవిత)
-కందేపి రాణి ప్రసాద్
ఆకాశం లో నువ్వు సగం అంటారు
అంతా వాళ్ళే దోచుకు పోతారు
ఆకాశమే నీ హద్దు అంటారు
అంగుళం కూడా ఎదగనివ్వరు
నువ్వెంతయిన చదువుకో అంటారు
అబ్బాయిని మాత్రం మించకు అంటారు
నిన్ను ఎక్కడికైనా పంపిస్తాం అంటారు
పక్కింటికైన తోడు లేనిదే పంపించరు.
వరుడిని ఎంచుకునే హక్కుంది అంటారు
ఎంచుకుని తీసుకెళ్తే ఇంట్లోంచి గెంటేస్తారు
సమాన హక్కులు ఇచ్చాం అంటారు
ఎప్పుడు వెనక వరసే మిగులుస్తారు
నీ దాహం తీర్చుకో అంటారు
అక్కడ మురికి నీళ్ళే మిగులుతాయి
నీ కడుపు నిండా తిను అంటారు
అక్కడ ఎంగిలి విస్తరి కనిపిస్తుంది
ఇంకెక్కడి ప్రగతి,ఇంకెక్కడి సాధికారత
వేసే ప్రతి అడుగులోనూ వివక్షే ముందు
రిజర్వేషన్ల పదవులు కట్టబెడతారు
పెత్తనం లేనికుర్చీలు వెక్కిరిస్తూ ఉంటాయి
ఇదే మహిళా భారతం ఇదే మహిళా సాధికారం
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.

అవునండీ,వచ్చేదాకా పోరాడాలి కదా.
రోజులు మారుతున్నాయి,సగంసగం సమానమొస్తోంది,నెమ్మదిగా