
IN SEARCH OF
Telugu Original: Rupa Rukmini
English Translation: Cv Suresh
1Some souls are ensnared so natural..In the undivided KnotsHammocked with love stringThat love …Is meant for neither jesting nor to abandon!! 2It incites you…Who hidden in the inner souls Some common confide subjectIn both of us…Make you to move.. either as a word or act…As soon as it owned by me.the shadow ,of first love memory, Which is marked some time in your inner soul,And the timeWhich left you uninformed You gestured happy to feelOf searching those things…In someone who met you!! ..3you beg pardon as if it is loveSome uncertainty hold you thereMy ego covers youAs why should I run after those thingWhich is not mine!! The soul,Again search for newness , which was darkened From the light ..4 Here,It’s a solo journey of oneself .Unending journeys ..Without love destiny.Those are inner sufferings Incites each other…Those are the replicas Of love seeking for!!! ………. Original poem || Rupa Rukmini ||#అన్వీక్షణం ~~~~~~~ ౧కొందరి మనసులంతే విడిపడని ముడులమధ్య చిక్కుకొంటాయి…. ప్రేమ దారానికి ఊయలలూగుతాయి ఆ ప్రేమ పరిహాసానికో పరిత్యజించటానికో కాదు!!2అది మనసు లోతులలో ఎక్కడో దాగిన నిన్ను ప్రేరేపిస్తుంది….నీలో నాలో ఎదో నచ్చిన అంశం నాది అనుకునే మాటగానో చేతగానో నిన్ను కదిలిస్తుంది.౩ఎప్పుడో నీ అంతరంగంలో ముద్రలుగా వేయబడిన తొలిప్రేమ జ్ఞాపకాల నీడ నీకు తెలియకుండానే నిన్ను వదిలి వెళ్లిన కాలాన్ని నీకు తారసపడ్డవారిలో ఎక్కడైనా కనిపిస్తుందేమో అని వెతుకుతూ ఆ భావానికి ముగ్దుడవై పోతావు…అదే ప్రేమగా మన్నింపుకోరుతావుఅక్కడ ఏదో అస్థిరత నిన్ను చేరదీస్తుందినాది కానీ దాని కోసం నా పరుగేందుకు అని నీ అహం నిన్ను కప్పివేస్తుందివెలుతురు నుండి చీకటి కమ్మిన మనసు మళ్ళీ కొత్తదనాన్ని అన్వేషిస్తుంది౪ఇక్కడ ఎవరికి వారే ఒంటరి పయనాలేప్రేమ గమ్యాలు తెలియని అంతంలేని ప్రయాణాలేఒకరిని ఒకరు ప్రేరేపించుకునేఅంతః మధఃనాలే ప్రేమాన్వేషణకు ప్రతి రూపాలే
*****

సి.వి. సురేష్ : కడప జిల్లా, ప్రొద్దుటూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. సాహితీ ప్రేమికులు. 2013 నుంచి సాహిత్య వ్యాసంగంలో ఉన్నారు. చారిత్రక ప్రతీకలు అరుదైన సిమిలీలతో సాగే వీరి కవితలు పాఠకహృదయాల ఆదరణ పొందాయి. అనుసృజనలు వీరి ప్రత్యేకత. ఇప్పటివరకూ డెబ్భై కు పైగా కవితలు తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి.. ఎనభై పై చిలుకు కవితలు ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువదించారు. అందులో క్లిష్టమైన సూఫీ పోయెట్రీ సంగం పోయెట్రీ కూడా ఉన్నాయి. కవిసంగమం ఫేస్బుక్ గ్రూప్ లో ప్రతి బుధవారం “కవిత్వానువాదం” శీర్షిక, ప్రజాపాలన పత్రిక ‘విభిన్న’ సాహిత్య పేజీల నిర్వహణ, రస్తా మరియు సారంగ వంటి ప్రముఖ వెబ్ మేగజైన్స్ లో కాలమ్స్ నిర్వహిస్తున్నారు.

అనువాదం కవితలు👌👌.గా ఉన్నాయి.ధన్యవాదాలు C.V.suresh sir,💐 English రాని, మాలాంటి వారికి, తెలుగు లో మంచి కవిత, అనువాదం చేసినందుకు❤️🙏. రచయిత్రి కి, మా,అభివందనాలు💐.