image_print

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-4 కాలేజీ కథ

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 4. కాలేజీ కథ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత “కొమస్తాజ్?” స్పానిష్ లో “హౌ ఆర్యూ?” అంది మరియా. షాపు నించి వస్తూనే బైట వరండాలో వాళ్ల అమ్మతో బాటూ నిల్చుని కబుర్లు […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి వ్రజేశ్వర్ తెర తీసి అంతఃమందిరానికి వెళ్లాడు. అక్కడి వైభోగానికి విభ్రాంతితో కూడిన విస్మయ్యం పొందాడు. మందిరానికి అన్ని వైపులా దశావతారాలు, కైలాసం, వృందావనం మొదలగు అందమైన చిత్రపటాలు వున్నవి. కాలి క్రింది తివాచీ నాలుగంగుళాల మందంతో మెత్తగా వున్నది. ఎదుట చక్కని నగిషీలుతో కూడి, మెత్తని ముఖమలుతో పరిచి, అంతే విలువైన ముఖమలుతో చేసిన రంగు బాలీసులతో ఒక […]

Continue Reading
Posted On :

అనుసృజన – హరీశ్ చంద్ర పాండే

అనుసృజన హరీశ్ చంద్ర పాండే అనుసృజన: ఆర్ శాంతసుందరి (హిందీ కవి హరీష్ చంద్ర పాండే ఎన్నో కథా సంపుటాలూ , కవితా సంపుటాలూ , బాలసాహిత్యం రాసారు. 1952 లో ఉత్తరాఖండ్ లో పుట్టారు . సాహితీ పురస్కారాలు అందుకున్నారు . అలహాబాద్ లో సీనియర్ మోస్ట్ అకౌంటెంట్ గా పదవీ విరమణ చేసారు.) ప్రతిభ హంతకుణ్ణి కోర్టువారు సగౌరవంగా విడిపింపజేసేట్టు వాదించగల వకీలుదే ప్రతిభ రోగికి ఏమాత్రం తెలియనీయకుండా అతని శరీరం నుంచి మూత్రపిండాన్ని […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-57)

నడక దారిలో-57 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 57

నా జీవన యానంలో- రెండవభాగం- 57 -కె.వరలక్ష్మి ‘‘లోకులు తొందరగా నిందిస్తారు లేదా, తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్నుగురించి అనుకునే మాటలకు పెద్దగా విలువ ఇవ్వవద్దు.’’ ‘‘ఇవ్వడం నేర్చుకో – తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో – పెత్తనం కాదు.’’ అంటారు రామకృష్ణ పరమహంస. 2014 జనవరి 14 న సీనియర్ నటి, తెలుగువారి సీతాదేవి అంజలీదేవి మద్రాసు లో కాలం చేసారు. జనవరి 22న సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర్రావు కాలం చేసారు. ఇద్దరు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 34

వ్యాధితో పోరాటం-34 –కనకదుర్గ సర్జరీకి కావాల్సిన పరీక్షలు చేస్తున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వున్నాయా, లేవా అని చూస్తున్నారు. కానీ ప్రతి సారి అంతా బాగానే వుంది, స్టోన్స్ లేవు అనే చూపిస్తుంది. డాక్టర్స్ కి అనుమానం ఇంత జరుగుతున్నా గాల్ బ్లాడర్లో ఒక్క స్టోన్ కూడా లేకుండా ఎలా వుంటుంది అని. నా పరిస్థితిలో మార్పు లేదు. నా నొప్పి, డయేరియా, అప్పుడపుడు వాంతులు అవుతూనే వున్నాయి. నాలో ఒకరకమైన భయం, […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-30

నా అంతరంగ తరంగాలు-30 -మన్నెం శారద (ఆలస్యమైనా ఫరవాలేదు, దయచేసి చదివే స్పందించండి ) ————————————– రేపే గొప్ప ప్రారంభం… —————————– మా చిన్నప్పుడు కాకినాడలో కొత్త సినిమా రిలీజయినప్పుడు ఇలానే రాత్రి పూట పెట్రోమాక్స్ లైట్లతో ఊరేగింపు జరుపుతూ అరిచేవారు. నిజంగా ఎంత సంబరంగా ఉండేదో… చెప్పలేం. వరుసగా రకరకాల బళ్ళు పోస్టర్స్ తో వెళ్తుంటే సగం సినిమా చూసిన ఫీల్ వచ్చేసేది. ఆఁ రోజుల్లో పెద్దవాళ్ళు ఎప్పుడో జాలి తలచి ఏదో ఒక సినిమాకి […]

Continue Reading
Posted On :

నీలినీలి అలల ముంబయి

నీలినీలి అలల ముంబయి -డా.కందేపి రాణి ప్రసాద్ 2024వ సంవత్సరం సెప్టెంబరు 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ముంబయి లోని నెహ్రూ సైన్స్ ఆడిటోరియంలో ఎన్ఎన్ఎఫ్ వారి కాన్ఫరెన్స్ జరగుతున్నది. ఇవన్నీ పిల్లల డాక్టర్లకు సంబంధించిన సమావేశాలు. రాత్రి 8:15 కు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బయలుదేరి ముంబయి వెళ్ళాం. ఫైవ్ స్టార్ హెూటల్ ఆర్కిడ్ లోని రూం నెంబర్ 477లో దిగాము. ఈ హెూటల్ మధ్యలో ఆరు ఫ్లోర్ల పై నుంచి నీళ్ళు […]

Continue Reading

యాత్రాగీతం-71 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-6

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-6 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** లగేజీ ప్యాకింగు: ప్రయాణపు తేదీకి ముందు నాలుగైదు రోజుల పాటు లగేజీ ప్యాకింగుతో సరిపోయింది.  మా ముగ్గురికీ ఒక్కొక్కళ్ళకి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల తాబేళ్ళ కోరిక

పిల్ల తాబేళ్ళ కోరిక -కందేపి రాణి ప్రసాద్ సముద్రంలో ఉండే తాబేళ్ళు ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఒడ్డున ఉన్న ఇసుకలో తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇసుకలో తమ గుడ్లను పెట్టి వెళతాయి. గుడ్లు పగిలి పిల్లలైన తరువాత పిల్ల తాబేళ్ళు మరల సముద్రంలోకి వెళ్ళిపోతాయి. తాబేళ్ళు ఇసుక లోపలకు తవ్వి గుడ్లను పెట్టటం వలన కొన్ని పిల్లలు ఇసుకలో నుంచి బయటకు రాలేక చనిపోతుంటాయి. మరి కొన్ని మెల్లగా నడుస్తూ మనుష్యుల కాళ్ళ కింద పడి చనిపోతుంటాయి. […]

Continue Reading

పౌరాణిక గాథలు -32 – హంసడిభకులు (ఉపాయం కథ)

పౌరాణిక గాథలు -33 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి హంసడిభకులు (ఉపాయం కథ) సాళ్ళ్వదేశపు రాజు బ్రహ్మదత్తుడికి ఇద్దరు కొడుకులు౦డేవారు. ఒకడి పేరు “హ౦సుడు” , మరొకడి పేరు “ డిభకుడు” . వాళ్ళిద్దరు అన్నదమ్ములే కాదు, మ౦చి స్నేహితులు కూడ! హ౦సుడు, డిభకుడు ప్రాణస్నేహితులైతే వీళ్ళిద్దరికీ కలిసి ఇ౦కో స్నేహితుడు కూడా ఉ౦డేవాడు . అతడి పేరు “జరాస౦ధుడు”. ఒకసారి వీళ్ళు ముగ్గురు కలిసి మధురానగరానికి రాజైన శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళారు. సాక్షాత్తు శ్రీమహా విష్ణువైన […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)-3 డిపెండెంటు అమెరికా

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 3. డిపెండెంటు అమెరికా అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత సాయంత్రం ఏటవాలు కిరణాలతో దేదీప్యమానంగా మెరుస్తూంది. ఇంట్లో అద్దాలలోంచి చూస్తే బయట వెచ్చగా ఉన్నట్లు అనిపిస్తూంది. కానీ విసురు గాలి వీస్తూ అతి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి నాగతరి మీదకు ఎక్కిన తరువాత వ్రజేశ్వర్ రంగరాజుని అడిగాడు “నన్నెంత దూరం తీసుకువెళ్తారు? మీ రాణి ఎక్కడ వుంటుంది?” “అదిగో, ఆ కనపడుతున్నదే నావ, అదే మా రాణీవాసం.” “అబ్బో, అంత పెద్ద నావా? ఎవరో ఇంగ్లీషువాడు రంగాపురాన్ని లూటీ చెయ్యటా నికి అంత పెద్ద నావతో వచ్చారనుకున్నాను. సర్లే, ఇంత పెద్ద నావలో ఉంటుందేమిటి మీ రాణి!?” […]

Continue Reading
Posted On :

అనుసృజన – మొగవాళ్ళ వాస్తు శాస్త్రం

అనుసృజన మొగవాళ్ళ వాస్తు శాస్త్రం మూలం: రంజనా జాయస్వాల్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక ఇల్లు దానికి కిటికీలు మాత్రమే ఉండాలి ఒక్క తలుపు కూడా ఉండకూడదు ఎంత విచిత్రం అలాంటి ఇంటి గురించి ఊహించడం! ఎవరు ఆలోచించగలరు – అలాoటి వంకర టింకర ఊహలు ఎవరికుంటాయి? మొగవాళ్ళ ఊహల్లోకి రాగలదా ఎప్పుడైనా ఇలాంటి ఇల్లు? మొగవాళ్ళు తలుపుల శిల్పులు వాళ్ళ వాస్తు శాస్త్రంలో కిటికీలు ఉండటం అశుభం! గాలులు బైటినుంచి లోపలకి రావడం అశుభం గాలులూ, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-56)

నడక దారిలో-56 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 56

నా జీవన యానంలో- రెండవభాగం- 56 -కె.వరలక్ష్మి 2013 జనవరి 20న మా గీత మూడవ కవితా సంపుటి శతాబ్ది వెన్నెల సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఎన్. గోపి, శివారెడ్డి, కొండేపూడి నిర్మల, శిఖామణి గీత పొయెట్రీ గురించి చాలా బాగా మాట్లాడేరు. చివర్లో గీత ప్రతిస్పందన అందర్నీ ఇంప్రెస్ చేసింది. గీత వాళ్లూ 31న తిరిగి వెళ్లేరు. బయలుదేరే ముందు గీతకు వీడ్కోలు చెప్తూ హగ్ చేసుకుంటే ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. మనుషులకివన్నీ ఉత్త ఎమోషన్సే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 33

వ్యాధితో పోరాటం-33 –కనకదుర్గ ఆ రోజు నేను పడిన బాధ ఇంతా అంతా కాదు. ఇంకా ఎన్నిరోజులు నేను ఈ ఆసుపత్రులల్లో పడి వుండాలి? అసలు నేనింక ఇంటికి వెళ్తానా? పిల్లలతో మనసారా సమయం గడుపుతానా? అసలు ఈ జబ్బు తగ్గుతుందా? నేను బ్రతుకుతానా? నేను లేకపోతే ఇద్దరు పిల్లలతో శ్రీనివాస్ ఎలా వుంటాడు? అసలు ఎందుకిలా అయి పోయింది నా బ్రతుకు? ఈ జబ్బు నాకెందుకు వచ్చింది? నాకేమన్నా అయితే అమ్మా, నాన్న ఎలా తట్టుకుంటారు? […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 32 (యదార్థ గాథ)

జీవితం అంచున -32 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి సభ జరిగిన వారం రోజులకనుకుంటా తెలియని నంబరు నుండి ఒక కాల్ వచ్చింది. ఆ నంబరు నుండి మూడు రోజుల క్రితం కూడా ఒక మిస్డ్ కాల్ వుండటం గమనించాను. ఎవరైవుంటారాని ఆలోచిస్తూ రెండోరింగ్కే ఎత్తాను. నేను‘హలో’అన్నా అవతలి నుండి జవాబు లేదు. రెండోసారి‘హలో’అన్నాను. “హలోఅండి, నాపే రు రామం. మీ పుస్తకావిష్కరణకివచ్చి, పుస్తకం తీసుకున్నాను. చాలాహృద్యంగా, ఆర్ద్రంగా మీ మనవరాలిపై ప్రేమను […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-29

నా అంతరంగ తరంగాలు-29 -మన్నెం శారద శ్రీరామ పట్టాభిషేకం పిదప ఆంజనేయస్వామి అయోధ్యని వీడి వెళుతున్న తరుణం అది! సీతమ్మని వెదకడం మొదలు, రాములవారికి ఆఁ వార్త అందించి రావణ సంహారం వరకు శ్రీరామ చంద్రులవారిని ఆంటిపెట్టుకుని వుండడమే కాక స్వామి వారి పట్టాభిషేకం కనులరా వీక్షించి తరించారు ఆంజనేయ స్వామి! ఇక తాను కిష్కంద కు బయలు దేరే తరుణమాసన్నమయ్యింది అక్కడ తనకు ఎన్నో బాధ్యతలు! స్వయానా సుగ్రీవులవారికి అమాత్యులాయే! తన స్వామిని వీడి వెళ్లడమంటే […]

Continue Reading
Posted On :

ఫెధర్ డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్

ఫెధర్ డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్ -డా.కందేపి రాణి ప్రసాద్ ఆస్ట్రేలియా ఖండం మొత్తం ఒక దేశంగా పరిగణిoపబడుతున్నది. గతవారం ఆస్ట్రేలియా దేశాన్ని చూడటానికి వెళ్ళాం. మాకు కేవలం నాలుగైదు రోజులే ఉండటం వల్ల సిడ్నీ నగరం మాత్రమే చూడాలని అనుకున్నాం. ఆస్ట్రేలియా ఖండం చుట్టూతా నీళ్ళతో ఆవరింపబడి ఉండటం వల్ల ఈ దేశం మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్నది. ఇక్కడ ఉండే జంతు, వృక్ష జాతులు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కేవలం ఈ ఖండంలో […]

Continue Reading

యాత్రాగీతం-70 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-5

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-5 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** వీసా పాట్లు & లోకల్ టూర్లు: శాన్ఫ్రాన్సిస్కోలో  ఫ్రాన్సు వీసా ఆఫీసు చుట్టుపక్కల గడ్డకట్టే చలిలో బయటెక్కడా గడిపే […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

అడవిలో అపార్టుమెంట్లు

అడవిలో అపార్టుమెంట్లు -కందేపి రాణి ప్రసాద్ మన మహారాజు సింహం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందరిని గుహ దగ్గర నున్న మైదానం వద్దకు రమ్మన్నారు అంటూ.. కాకి అందరికీ వినబడేలా గట్టిగా అరుస్తూ చెపుతోంది. ‘‘అబ్బా ఈ కాకి ఎంత కర్ణ కఠోరంగా అరుస్తుంది” అంటూ, బోరియలో నుంచి హడావిడిగా బయటికి వచ్చిన కుందేలు తన రెండు చెవులు మూసుకుంటూ అన్నది.           ‘‘కాకితో కబురు పంపిన మేము రాకపోదుమా’’ అనే […]

Continue Reading

పౌరాణిక గాథలు -32 – ఆషాఢభూతి కథ

పౌరాణిక గాథలు -32 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆషాఢభూతి కథ సన్యాసిపుర౦ అనే పేరుగల ఊళ్ళో దేవశర్మ అనే బ్రాహ్మణడు నివసిస్తూ౦డే వాడు. అతడు పరమ లోభి. ఎవరికీ ఏమీ పెట్టేవాడు కాదు…ఎవర్నీ నమ్మేవాడు కాదు…పని చేయి౦చుకుని డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. పెళ్ళి చేసుకు౦టే ఖర్చు అవుతు౦దని అది కూడా మానేశాడు. దేవశర్మకి ఒక అలవాటు ఉ౦డేది. తన దగ్గరున్న వస్తువుల్నిడబ్బు రూప౦గా మార్చి ఆ డబ్బుని బొంతలో పెట్టి కుట్టేసేవాడు. అ బొంతని ఎవరికీ […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)- 2 వర్క్ ఫ్రం హోం

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 2. వర్క్ ఫ్రం హోం అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత           సూర్య ఆఫీసు నుంచి పెందరాళే వస్తున్నాడు. వచ్చే సరికి నేను, పాప గుర్రు పెట్టి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-16 ఈ దేశంలో ఆడది

కాదేదీ కథకనర్హం-16  ఈ దేశంలో ఆడది -డి.కామేశ్వరి  జయంతి బస్సు దిగి గబగబ యింటివైపు అడుగులు వేయడం మొదలు పెట్టింది. ఈరోజు రోజూకంటే గంటాలశ్యం అయిపొయింది. కనుచీకటి పడిపోతుంది. అప్పుడే, పిల్లలు పాపం ఏం చేస్తున్నారో, యింకా రాలేదని బెంగ పడ్తున్నారేమో . మొదటి బస్సు తప్పిపోయింది, రెండో బస్సు వచ్చేసరికి అరగంట పట్టింది. యింటికి తొందరగా చేరాలన్న ఆరాటంతో పరిగెత్తినట్టే నడుస్తుంది జయంతి. పిల్లలు నాలుగున్నరకే రోజూ వస్తారు. ఆమె యిల్లు చేరేసరికి ఐదున్నర ఆరు […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ఇంతకు క్రితం చెప్పినట్లుగా నావకు ప్రక్కగా నున్న తీరం మీద ఒక పెద్ద చింత చెట్టు వున్నది. ఆ పెద్ద చింత చెట్టు చాటులో వున్న చిమ్మ చీకటి నీడలో ఒక పడవ వుంది. సన్నని పడవ, మూడడుగులు వెడల్పు, అరవై అడుగుల పొడవు వుంటుంది. ఆ నాగతరి పై చాలా మంది యోధులు నిద్ర పోతున్నారు. రంగరాజు […]

Continue Reading
Posted On :

అనుసృజన – అన్నిటికన్నా ప్రమాదకరం …

అనుసృజన అన్నిటికన్నా ప్రమాదకరం … మూలం: అవతార్ సింగ్ సంధూ “పాశ్” అనుసృజన: ఆర్ శాంతసుందరి అన్నిటికన్నా ప్రమాదకరం శ్రమ దోపిడీ కాదు పోలీసుల లాఠీ దెబ్బలు కావు దేశద్రోహం లంచగొండితనం కావు నేరం చేయకుండా పట్టుబడడం విషాదమే భయంతో నోరు మూసుకోవడం తప్పే కానీ అవేవీ అన్నిటికన్నా ప్రమాదకరం కావు మోసాల హోరులో నిజాయితీ గొంతు అణిగిపోవడం అన్యాయమే మిణుగురుల వెలుతురులో చదువుకోవడం తప్పే పిడికిళ్ళు బిగించి కాలం గడిపేయడం సరికాదు కానీ అన్నిటికన్నా ప్రమాదకరం […]

Continue Reading
Posted On :

ఆరాధన-12 (ధారావాహిక నవల) (ఆఖరి భాగం)

ఆరాధన-12 (ధారావాహిక నవల) (ఆఖరి భాగం) -కోసూరి ఉమాభారతి ‘కెరటం నాకు ఆదర్శం .. పడినా కూడా లేస్తున్నందుకు!’ -స్వామి వివేకానంద           మరో నాలుగు రోజులు అమ్మానాన్నలతో హాయిగా గడిపాను. ఓ రోజు పొద్దుటే, అందరం కలిసి టిఫిన్ చేస్తుండగా.. నన్ను ఉద్దేశించి “చూడమ్మా ఉమా, నృత్యంలో నీవు ఇన్నాళ్లగా కృషి చేసి, ఎంతో సాధించావు. ఇప్పుడు వీలు చేసుకుని, సాహిత్య రంగం కృషి చేయడం మొదలుపెట్టు.” అనడంతో నేను, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-55)

నడక దారిలో-55 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 55

నా జీవన యానంలో- రెండవభాగం- 55 -కె.వరలక్ష్మి 2011 ఆగష్టు 6 నుంచీ 8 వరకూ సాహిత్య అకాడమీ సభలు బొమ్మూరు తెలుగు యూనివర్సిటీలో జరిగాయి. మా ఊళ్లో ఉదయం 8 కి బస్సెక్కి డైరెక్ట్ గా యూనివర్సిటీకి చేరుకున్నాను. ముందు రోజే వచ్చి రాజమండ్రి సూర్యాహోటల్లో ఉన్న అంపశయ్య నవీన్, ఆయన భార్య అనసూయ, అబ్బూరి ఛాయాదేవి, కె.బి.లక్ష్మి, శలాక రఘునాథ శర్మగార్లు సభప్రారంభ సమయానికి వచ్చారు. పుట్ల హేమలత, కోడూరి శ్రీరామమూర్తి గారు ముందే […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 31 (యదార్థ గాథ)

జీవితం అంచున -31 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఎయిర్పోర్ట్ కి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కారులో కాశి కూడా వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. బహూశా కాశి నాకు దొరికడం నా అదృష్టమే. నాకు వయసు మీద పడటం వలననో, అమ్మ మానసిక అస్వస్థత కారణంగానో తెలియదు కాని నాలో ఇదివరకెన్నడూ లేని డిపెండెన్సీ ఎక్కువయిపోయింది. ప్రతీ చిన్న పనికీ కాశి పైన ఆధారపడటం అలవాటయిపోయింది. అమ్మను మెడికల్ చెకప్ […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-28

నా అంతరంగ తరంగాలు-28 -మన్నెం శారద ఒకనాటి జ్ఞాపకం…. చిన్నతనం నుండి మా  నాన్నగారి  ఉద్యోగ రీత్యా  మేము అనేక ప్రాంతాలు  తిరిగాం. అలా అనుకోకుండా అనేకమంది ప్రముఖ వ్యక్తులని చాలా దగ్గరగా  చూడటం జరిగింది. ప్రముఖ నటి  భానుమతిగారినయినా, మధుబాల గారినయినా, సావిత్రి గారినయినా, వాణిశ్రీగారినయినా, అనంతనాగ్  గారినయినా …. ఇలా చాలా మంది   ప్రముఖుల పరిచయం నాకు లభించింది. చాలా చిన్నతనం నుండీ  రాస్తున్నాను. రాయడం, బొమ్మలు వేయడం డాన్స్ చేయడం నాకు passion. […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-69 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-4

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-4 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** వీసా-2 యూకే వీసా వచ్చిన తరువాత మరో నెల్లాళ్ళకి ఫ్రాన్సు వీసా కోసం శాన్ఫ్రాన్సిస్కోలో వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కాకి బంగారం

కాకి బంగారం -కందేపి రాణి ప్రసాద్ గ్రామ శివారులో ఒక అడవి ఉన్నది. అక్కడ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఊడలు దింపుకుని ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తు న్నాయి. ఈ మర్రి చెట్లకు ప్రక్కనే ఒక పెద్ద చెరువు, మైదానం ఉన్నాయి. దూరంగా కొండలు కనిపిస్తూ, ప్రకృతి ఆహ్లాదం తాండవిస్తుంది. అందమైన అడవి అంటే సరియైన నిర్వచనంలా కనిపిస్తున్నది.           ఒక పెద్ద మర్రి […]

Continue Reading

పౌరాణిక గాథలు -31 – అజామిళుడు కథ

పౌరాణిక గాథలు -31 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అజామిళుడు కథ ఒక ఊళ్ళో అజామిళుడు అనే పేరుగల బ్రాహ్మణుడు౦డేవాడు. వేదశాస్త్రాలన్నీ త౦డ్రి దగ్గరే నేర్చుకున్నాడు. అడవికి వెళ్ళి కట్టెలు, పువ్వులు తెస్తూ త౦డ్రికి చేదోడు వాదోడుగా ఉ౦డేవాడు. రోజూ అడవికి వెళ్ళి వస్తు౦డడ౦ వల్ల అతడికి కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. చిన్నతన౦లో మ౦చికి, చెడుకి బేధ౦ తెలియక ఏది ఇష్టమనిపిస్తే అటే వెళ్ళిపోతు౦ది మనస్సు. దానికే అలవాటు పడిపోతారు పిల్లలు. పెద్దవాళ్ళకి తెలిస్తే ద౦డి౦చి మ౦చి మార్గ౦లో […]

Continue Reading

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు)- 1 స్పానిష్షూ- ఉష్షూ

సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 1. స్పానిష్షూ- ఉష్షూ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ-పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత           అమెరికా వచ్చి వారం రోజులైంది. సూర్య ఆఫీసుకి పొద్దుటే బాక్సు తీసుకుని వెళ్లి, సాయంత్రం ఆరు గంటలకు […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-10 (చివరి భాగం)

సస్య-10 – రావుల కిరణ్మయి సంతోషం (జరిగిన కథ : సస్య శ్రావణ్ ప్రోత్సాహంతో ప్రిపరేషన్ మొదలు పెట్టింది. ఆ తర్వాత…) ***           కాలం గాయాలను మార్చుతుంది అనడానికి నిదర్శనంలా సస్య , భార్గవ్ సార్ పట్ల ఏర్పరుచుకున్న అభిప్రాయాన్ని మార్చుకుంది. అపార్థాలకు తావులేని స్వచ్ఛమైన స్నేహ బంధానికి పునాది చేసింది. కానీ అనూహ్యంగా సస్య డిప్యుటేషన్ రద్దు చేయబడి తన ఒరిజినల్ స్కూల్ కి వచ్చేసింది. ఇప్పుడు భార్గవ్ […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-15 అమెరికన్ అల్లుడు

కాదేదీ కథకనర్హం-15 అమెరికన్ అల్లుడు -డి.కామేశ్వరి  కాత్యాయిని ఈ ఏడాది ఎలాగన్నా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా వుంది. ప్రతీక్ష ఎం.బి.బి.ఎస్. పరీక్షలయి వస్తుంది. మళ్ళీ యింటర్నల్ షిప్ మొదలయ్యే లోగా ఇండియా వెళ్ళి పెళ్ళి చేసి తీసుకు రావాలని ఆరాట పడ్తోంది. కూతురి పెళ్ళి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి. ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు. ఏనాడో యింటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు అయన. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి వర్ష ఋతువు. రాత్రి వేళ. అయితే ఈ రాత్రి వర్షం లేదు. పౌర్ణమి వెన్నెల, మరీ అంత ప్రకాశవంతమైన వెన్నెల కాదు. సన్నని పొగ మంచుతో కూడిన స్వప్నలోకాన్ని తలపించే ఒక చక్కని చల్లని వెన్నెల రాత్రి. దూరాన వున్న కొండల పైన కురిసిన వర్షంతో నది వరద స్థాయికి చేరుకుని నిండుగా ప్రవహిస్తోంది. ఆ నదీ తరంగాల […]

Continue Reading
Posted On :

అనుసృజన – అద్దం

అనుసృజన అద్దం మూలం: సిల్వీయ ప్లెత్ అనుసృజన: ఆర్ శాంతసుందరి నాది వెండి రూపం నిజాన్ని చూపిస్తాను ముందస్తు అభిప్రాయాలు లేవు నాకు నాకు కనిపించే వాటన్నిటినీ మింగేస్తాను ఉన్నవి ఉన్నట్టుగానే – రాగద్వేషాల మంచు తెర కప్పదు నన్ను కాని హృదయం లేని పాషాణాన్ని కాను నిజం చెప్పానంతే – చతుర్భుజాల పసి దేవత కంటిని నేను ఎదురుగా ఉన్న గోడని చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటాను ఎప్పుడూ – గులాబీ రంగుతో మచ్చలున్న ఆ […]

Continue Reading
Posted On :

ఆరాధన-11 (ధారావాహిక నవల)

ఆరాధన-11 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి జీవితం తిరిగే రంగులరాట్నము           న్యూయార్క్ నుండి హూస్టన్ చేరి,  యధావిధి పనుల్లో మునిగిపోయాను. మెడిసిన్ చదువుతున్న మా అబ్బాయి సందీప్, తన స్నేహితురాలు కామినితో కలిసి హూస్టన్ కి వస్తున్నానని తెలియజేశాడు. బహుశా తనకి నచ్చిన అమ్మాయిని మాకు చూపించడా నికే’ అని సంతోషంగా అనిపించింది.  కాలేజీ రెండో సంవత్సరం చదువుతున్న అమ్మాయి శిల్ప కూడా సెలవలకి ఒకరోజు ముందే రానుంది. *** […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-54)

నడక దారిలో-54 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం , సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 54

నా జీవన యానంలో- రెండవభాగం- 54 -కె.వరలక్ష్మి ఆ మే నెలలో పిల్లల సెలవులు సందర్భంగా మా అబ్బాయి వాళ్లూ మళ్లీ కారులో ఇంకో ట్రావెల్ ట్రిప్ పెట్టుకున్నారు. రాజమండ్రిలో ఉన్న మా అబ్బాయి ఫ్రెండ్ సుకుమార్ కుటుంబంతో కలిసి మారేడుమిల్లి అడవులు చూసి జగ్గంపేట వచ్చారు. దారిలో ఒక్కొక్క ఊరూ చూసుకుంటూ కోనసీమ వెళ్లాలని ప్లాన్. మర్నాడు ఉయదాన్నే బయలుదేరి వెళ్తూ కట్టమూరు ఊరు పక్కనే ఉన్నా ఎప్పుడూ చూడలేదని రోడ్డు దిగి వెళ్లి చూసాం. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 32

వ్యాధితో పోరాటం-32 –కనకదుర్గ “ప్లీజ్ సంబడీ హెల్ప్ మీ! ఇట్స్ హారబుల్ పేయిన్. ఓహ్! గాడ్ ప్లీజ్ టేక్ మి అవే యాజ్ సూన్ యాజ్ పాజిబుల్! ఐ కాన్ట్ టేక్ దిస్ పేయిన్ ఎనీమోర్!” గట్టిగా ఏడుపు వినిపించింది. నాకు పరిగెత్తుకెళ్ళి ఆమెని దగ్గరకు తీసుకుని వీపు పైన రాస్తూ, “ఐ నో సిస్టర్, ఇట్స్ వెరీ బ్యాడ్ పేయిన్, ఐ విష్ ఐ కేన్ హెల్ప్ టు మేక్ దిస్ పేయిన్ గో అవే…” […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 30 (యదార్థ గాథ)

జీవితం అంచున -30 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి చిత్రంగా తల నొప్పికి గుండెకు సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. అమ్మ ECG అస్తవ్యస్తంగా చూపించింది. కొన్ని పరీక్షల అనంతరం ఆన్జియోగ్రాం చేసారు. ఎయోర్టిక్వాల్వ్ మూసుకుపోయిందని కొత్త వాల్వ్ఇంప్లాంట్ చేయాలని చెప్పారు. రెండు ఆప్షన్లు ఇచ్చారు. మొదటిది ఓపన్ హార్ట్ సర్జరీ రెండవది TAVI. ఓపన్ హార్ట్ సర్జరీకి అమ్మ వయసు ఎంతవరకూ సహకరిస్తుందో తెలియదు. పైగా రికవరీకి చాలా సమయం పడుతుంది. […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-27

నా అంతరంగ తరంగాలు-27 -మన్నెం శారద అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా…. నేను చిన్నతనంలో అంతగా భక్తురాలిని కాను. కానీ పండుగలంటే మాత్రం బహు సరదా! ముఖ్యం గా వినాయకచవితి, దసరా అంటే మరీ.. నా చిన్నతనంలో మాచర్లలో అమ్మ ‘పాములు, తేళ్ళు ఉంటాయి ‘వెళ్లొద్దన్నా నేను ఏమాత్రం లెక్కపెట్టకుండా మాయింటికెదురుగా వున్న మండాది రోడ్డులోని పొలాల్లో పడి బోల్డు పత్రి, తంగేడు పూలు తెచ్చేదాన్ని. ఇంటింటికెళ్లడం, గుంజిళ్ళు తియ్యడం, […]

Continue Reading
Posted On :

ద్వీపకల్పం నుంచి ద్వీపం దాకా- న్యూజిలాండ్ & ఆస్ట్రేలియా

ద్వీపకల్పం నుంచి ద్వీపం దాకా- న్యూజిలాండ్ & ఆస్ట్రేలియా -డా.కందేపి రాణి ప్రసాద్ మా స్నేహితుల కుటుంబాలంతా కలిసి టూరుకు వెళ్లి చాలా రోజులైంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో ఎవరికీ ఊళ్లు తిరగాలన్పించలేదు. 2017 లో మా డాక్టర్ స్నేహితులంతా కలసి దక్షిణ ఆఫ్రికా పర్యటనకు వెళ్ళాం. ఆ తర్వాత మరల ఇప్పుడు ఈ 2025 లో న్యూజిలాండ్, అస్ట్రేలియా దేశాలు వెళ్ళాలని అనుకున్నాం. దాదాపు ముప్పై మంది కలసి ఈ ట్రిప్ కు బయల్దేరాం, […]

Continue Reading

యాత్రాగీతం-68 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-3

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-3 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** వీసా: ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ ప్యాకేజీని ఎంచుకుని, ఫ్లైట్లు, హోటలు టిక్కెట్లు కొన్నాకా వీసా అప్లికేషన్ల కుస్తీ […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -30 – కనీస ధర్మము – శ్వేతుడు కథ

పౌరాణిక గాథలు -30 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి కనీస ధర్మము – శ్వేతుడు కథ పూర్వ౦ విదర్భ రాజ్యాన్ని ‘సుదేవుడనే’ పేరుగల రాజు పాలిస్తూ ఉ౦డేవాడు. అతడికి ఒక కొడుకు ఉన్నాడు. పేరు ‘శ్వేతుడు’. అతడు తపస్స౦పన్నుడు, జ్ఞానశీలి. చాలా స౦వత్సరాలు రాజ్యపాలన చేశాడు. తపస్సు ఫలి౦చి దైవత్వాన్ని కూడా పొ౦దాడు. కొ౦తకాల౦ గడిచాక శ్వేతుడు మరణి౦చాడు. దైవభక్తి గలవాడు, తపశ్శక్తి కలవాడు కనుక అతణ్ని విష్ణు భక్తులు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ శ్వేతుడు భోగభాగ్యాలు […]

Continue Reading
ravula kiranmaye

సస్య-9

సస్య-9 – రావుల కిరణ్మయి ప్రతిఘటన (జరిగిన కథ : శ్రావణ్ , సస్యతో గతంను చెప్పగా సస్య ఆలోచనలో పడింది. ఆ తర్వాత..) ***           సస్యలో ఘనీభవించిన  ఆవేదనామేఘం కన్నీటి జల్లై కురిసింది. ఎంతలా అంటే  తుఫాను వరదకు పొంగి గట్టు తెగిన జలప్రవాహంగా మారిన ఆమెను ఓదార్చడాని కన్నట్టుగా తలపై చేయి వేశాడు శ్రావణ్. సస్య  భరింపరాని దుఃఖంతో శ్రావణ్ ను గట్టిగా హత్తుకొని ఎదపై తలవాల్చి  […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి

కాదేదీ కథకనర్హం-14 మళ్ళీ పెళ్ళి -డి.కామేశ్వరి  సుగుణ , భాస్కరరావులు ఆరోజు రిజిష్టరు ఆఫీసులో పెళ్ళి చేసుకున్నారు! తరువాత ఓ దేవాలయంలో సుగుణ మెడలో మంగళ సూత్రం కూడా కట్టాడు భాస్కరరావు లాంచనంగా. రోజూ ఎన్ని వేలమందో పెళ్ళి చేసుకుంటున్నారు. అందులో సుగుణా భాస్కర రావులు ఒకరు. అందులో ఏం వింత వుందని ఎవరన్నా అనుకోవచ్చు? పెళ్ళి చేసుకోడం వింత విషయం కాదు. ఎటొచ్చి వింత అల్లా వితంతువుని అందులో పిల్లాడి తల్లిని భాస్కరరావు పెళ్ళాడడం వింతేగా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-24

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 24 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు వైవాహిక జీవితములోకి అడుగు పెట్టి ఆరు నెలలు అయింది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, జీవితంలో ఎదురవుతున్న ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆస్ట్రేలియా లో స్థిరవాసులుగా నివాసులుగా వచ్చి, వారి ప్రణయ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ***           జీవితంలో ప్రతి దశలోను మనిషి తన గమ్యాన్ని చేరుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఒక స్థితి నుంచి, మరో ఉన్నతస్థితికి […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – రెండవ భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (రెండవ భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ప్రఫుల్లని బంజారాది, దాన్ని ఇంట్లోనుంచి తరిమెయ్యండి అని హరివల్లభ బాబు ఆజ్ఞాపించి పది సంవత్సరాలు గడిచింది. ఈ కాలమేమీ హరివల్లభ బాబుకి కలసి రాలేదు. బ్రిటిష్ గవర్నర్ Warren Hastings దేవీ సింగ్ అనేవాడిని ఇజారిదారుగా నియ మించి వాడికి జమీందారుల దగ్గర పన్నులు వసూలు చేసే బాధ్యతను అప్పగించాడు. ఆ దేవీ సింగ్ క్రూరాతి  క్రూరుడు. దేవీ […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వం – 2 సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ […]

Continue Reading
Posted On :

ఆరాధన-10 (ధారావాహిక నవల)

ఆరాధన-10 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి కృషితో నాస్తి దుర్భిక్షం           గడచిన పన్నెండేళ్ళల్లో…‘దేవి స్తోత్ర మాలిక’, ‘ఆలయనాదాలు’ అన్న ప్రత్యేక నృత్య నాటికలతో అమెరికాలోని ముప్పైకి పైగా ఆలయ నిర్మాణ నిధులకు స్వచ్ఛందంగా ప్రదర్శనలు చేయడం ఒకెత్తయితే.. అమెరికాలో జరిగే ఆటా, తానా ప్రపంచ తెలుగు సభల్లో వరసగా పాల్గొని, మూడు మార్లు  ‘అత్యుత్తమ ప్రదర్శన’ (Outstanding Performance) అవార్డు అందుకోవడం మరొకటి. మా నృత్యనాటికలకి నేను రాసే కథావస్తువుకి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-53)

నడక దారిలో-53 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువు తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,కొంత అనారోగ్యం. నేను […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 53

నా జీవన యానంలో- రెండవభాగం- 53 -కె.వరలక్ష్మి           ఇప్పుడు ప్రయాణం వెనక్కి, తూర్పువైపు కదా! జర్మన్ టైం ప్రకారం 10.15 AM కి ఫ్లైట్ ఫ్రాంక్ ఫర్ట్ చేరుకుంది, ఫ్లైట్ లో వాళ్లిచ్చిన పాస్తా తినలేక ఫ్రూట్స్ అడిగితే పేపర్లో ఒక పెద్ద అరటిపండు, ఒక పెద్ద గ్రీన్ యాపిల్, కొన్ని స్ట్రాబెరీస్, ఆరు ద్రాక్షపళ్లు ఇచ్చింది ఎయిర్ హోస్టెస్. యాపిల్ తప్ప అన్నీ తిని రాత్రి ఆకలి తీర్చుకున్నాను. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 31

వ్యాధితో పోరాటం-31 –కనకదుర్గ అంబులెన్స్ లో ఫిలడెల్ఫియా సిటీలో వున్న యునివర్సిటీ ఆఫ్ జెఫర్సన్స్ హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. వెళ్తున్నంత సేపు భయమే. ఆ హాస్పిటల్ మా ఇంటికి దగ్గరగా ఉండేది కాబట్టి రోజూ పిల్లల్ని తీసుకొచ్చి చూపించేవాడు శ్రీని. ఇపుడు అలా కుదరదు. తను రోజు రావడానికి కూడా కుదుర్తుందో లేదో చూడాలి. నాకు చాలా బెంగగా అనిపించింది. వార్డ్ లోకి తీసుకువెళ్తుంటే కొంతమంది పేషంట్స్ బైటికి తొంగిచూసారు ఎవరో కొత్త పేషంట్ వచ్చారని. అక్కడ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 29 (యదార్థ గాథ)

జీవితం అంచున -29 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి           రెండు వారాల ప్లేస్మెంట్ ఎన్నెన్ని అనుభవాలను ఇచ్చిందో.            రూము నంబరు 219 లో ఫ్రాన్సిస్ అనే అందమైన ఆజానుబాహుడైన వృద్ధుడు వేరే ఏ నర్సింగ్ స్టూడెంట్ అతనిని అటెండ్ చేసినా అంగీకరించేవాడు కాడు. జెంసీని పిలవమనేవాడు. నా మాట మాత్రమే వినేవాడు. ప్రతిరోజూ అతని భార్య అతని కోసం […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-26

నా అంతరంగ తరంగాలు-26 -మన్నెం శారద ( మొన్నటి భీభత్స మయిన తుపాను చూసి ఇది రాస్తున్నాను ) కాళ రాత్రిలో మా ప్రయాణం! 1977నవంబర్ 19, శనివారం! అంతకముందే హైదరాబాద్ వచ్చాం, పొట్ట, పెట్టె పట్టుకుని. ఉద్యోగం అంటే అంతేకదా! ఉద్యోగికి దూరభూమి లేదన్నారు కదా! ఊరు కొత్త! భాష కొత్త! మనుషులూ కొత్త! ఆఫీస్ కి వెళ్లి రావడమేగానీ పెద్దగా స్నేహాలు లేవు. అందరూ ఉర్దూ నే మాట్లాడుతున్నారు. డ్రైవర్ ఉధరో, రోఖోలు అర్థం […]

Continue Reading
Posted On :

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా

ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా -డా.కందేపి రాణి ప్రసాద్ ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కొనుక్కొని రైల్లో ప్రయాణిస్తున్న మహాత్మాగాంధీ బ్రిటిషర్స్ చేత రైల్లోంచి గెంటివేయబడి సత్యాగ్రహానికి పూనుకున్న దర్బన్ ఘటన, స్వాతంత్య్రం కోసం పోరాడి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి నోబెల్ శాంతి బహుమతి పొందిన దక్షిణాఫ్రికా తొలి దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం, ఎగరలేని అతి పెద్ద పక్షులకు పుట్టినిల్లైన దేశం, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఎగుమతి చేసే దేశాలలో ఒకటి, ప్రపంచంలో అత్యధిక […]

Continue Reading

యాత్రాగీతం-67 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-2 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* ***           చూడాల్సిన ప్రదేశాల దగ్గర్నించి, ఎప్పుడు వెళ్లాలి అనేదాకా తర్జన భర్జనలు తప్పలేదు. […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

కోడి ఉబలాటం

కోడి ఉబలాటం -కందేపి రాణి ప్రసాద్ అదొక కోళ్ళ ఫారమ్. వందల కోళ్ళు గుంపులుగా బతుకుతున్నాయి. పగలు, రాత్రి తేడా లేకుండా లైట్ల వెలుతురుతోనే ఉంటాయి. ఇనుప తీగలు అల్లిన జాలీలలో ఒక దాని మీద ఒకటి మీద పడేలా ఉంటున్నాయి. చిన్న జాలీలో రెండు మూడు కోళ్ళు ఉంటాయి. ఒక కోడి రెక్కలు విప్పు కుందామంటే ఖాళీ ఉండదు. అటొక అడుగు కదపాలన్నా కదప లేవు. ఒక రకంగా చెప్పాలంటే జైలు జీవితమే. కోళ్ళు రాత్రింబవళ్ళూ […]

Continue Reading

పౌరాణిక గాథలు -29 – ప్రాసాద ప్రసాదం – శ్రీరాముని తీర్పు కథ

పౌరాణిక గాథలు -29 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ప్రాసాద ప్రసాదం – శ్రీరాముని తీర్పు కథ అయొధ్యా నగరానికి రాజు దశరథమహారాజు. ఆయన తరువాత శ్రీరామచ౦ద్రుడు ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఇ౦త వరకు మనకు తెలిసిన కథే!! ఎవరేనా “ నేను బాధ పడుతున్నాను!” అని చెప్తే స్వయ౦గా వాళ్ళ బాధ పోగొట్టే వాడు రాముడు. ఒకనాడు శ్రీరాముడు ని౦డు సభలో కొలువు తీరి రాజ్యానికి స౦బ౦ధి౦ చిన కార్యకలాపాల్లో మునిగిఉన్నాడు. లక్ష్మణుణ్ని పిలిచి “ “లక్ష్మణా! […]

Continue Reading

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -9 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 9 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద నాకు తెలుసు నేనిచ్చే ఈ నివేదిక ఎవరికీ సరిపడదు. ఈ కేస్ ఆకలి చావేనని నేను ధృవీకరిస్తే ప్రతిపక్షాలు పండగ చేసుకుంటారు. అది ఆకలి చావు కానే కాదని నేను నొక్కి చెప్తే రూలింగ్ పార్టీ ఆనందపడుతుంది. దాదాపు ఒక ఏడాదిగా ప్రేమశిల తిండి లేక మాడుతోందని చెప్పడం అతిశయోక్తి కాదు. […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-8

సస్య-8 – రావుల కిరణ్మయి చాలెంజ్ (జరిగిన కథ : సస్య తల్లి తీసుకున్న డబ్బులకు న్యాయం చేయమని చెప్పడంతో శ్రావణ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్ళింది. అప్పుడు అక్కడ…..) *** పరోపకారాయ ఫలన్తి వృక్షాః పరోపకారాయ వహన్తి సద్యః పరోపకారాయ దుహన్తి గావః పరోపకారార్థ మిదం శరీరం పరోపకారము కొరకే వృక్షములు ఫలముల నిచ్చుచున్నవి. పరోపకారము కొరకు నదులు ప్రవహించు చున్నవి. పరోపకారము కొరకే గోవులు పాలనిచ్చుచున్నవి. కాబట్టి వాటిచే వృద్ధిపొందిన ఈ శరీరము కూడా […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-13 ఈడపిల్లే!

కాదేదీ కథకనర్హం-13  ఈడపిల్లే! -డి.కామేశ్వరి  కష్టాల్ని భరిస్తూనే కట్టుకున్నవాని కనుసన్నలలోనే కడతేరాలని సోకాల్డ్ పాతివ్రత్య భావన నుంచి క్రొత్త జీవితానికి ద్వారాలు తెరిచిన కధ. గాడాంధకారం …..ఆ చీకట్లో పాపని ఎత్తుకుని వగరుస్తూ పరిగెడ్తోంది రేణుక. “అమ్మా! ….అమ్మా!’ అంటూ చేతులు చాచి పిలుస్తుంది…..’అయ్యో, రేణూ , ఏం జరిగిం దమ్మా … ఎందుకలా అరుస్తున్నావు….” కన్నపేగు…..పేగు తెంచుకుని వస్తున్నకేక! సావిత్రికి ఒళ్ళంతా చెమట పట్టింది భయంతో. చటుక్కున మెలుకవ వచ్చింది. చుట్టూ చీకటి. ఒక్క క్షణం […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి భవానీ పాఠక్ ప్రఫుల్లతో “నీ ఐదు సంవత్సారాల శిక్షణ పూర్తి అయ్యింది. ఇప్పుడు నీ ధనం తీసుకుని నీ ఇష్టం వచ్చినట్లు వాడుకోవచ్చు, నేనేమీ అడ్డు చెప్పను. నేను ఒక మార్గదర్శకుడిని మాత్రమే. నేను చూపిన మార్గం నీకు సమ్మతం అవవచ్చు, కాక పోవచ్చు. అది నీ ఇష్టం. ఇప్పటి నుంచీ నీ అన్నవసతులూ కట్టుబట్టలూ నీ బాధ్యతే. […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వం – 2 సూఫీ కవిత్వంలో – భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి,  వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు -అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు. కొంతమంది ప్రముఖ […]

Continue Reading
Posted On :

ఆరాధన-9 (ధారావాహిక నవల)

ఆరాధన-9 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి ఆత్మీయ కలయిక           ఏంజెల్, శైలజల ఆహ్వానం పై  సోమవారం నాడు వారింటికి బయలుదేరాను. నలభై నిముషాల డ్రైవ్ తరువాత భవంతిలా ఉన్న వారి నివాసంగేటులోనికి వెళ్ళి, పోర్టికోలో కారు పార్క్ చేసి, ఇంటివైపు నడిచాను. బయట సిట్-అవుట్ లో కూర్చును న్నారు శైలజ, ఏంజెల్. నన్ను చూస్తూనే పరిగెత్తుకుని వచ్చి, నన్ను వాటేసుకుంది ఏంజెల్. నవ్వుతూ నన్ను లోనికి ఆహ్వానించింది శైలజ. సుందరమైన […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-52)

నడక దారిలో-52 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ చేసారు.కొంత […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 52

నా జీవన యానంలో- రెండవభాగం- 52 -కె.వరలక్ష్మి           అక్టోబర్ లో ఒకరోజు హిమబిందు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడింది. భీమవరంలో అజో-విభో సభలో చూసిందట. అక్కడికి 80 మైళ్ల దూరంలో ఉన్నారట. వీలుచూసుకుని వాళ్లింటికి రమ్మని పిలిచింది.           ఒకరోజు జి.వి.బి. ఫోన్ చేసినప్పుడు చెప్పేడు, నిడదవోలు జవ్వాది రామారావుగారు నెలక్రితం కాలం చేసాడట. ‘అయ్యో’ అని దుఃఖంగా అన్పించింది. అతనికి నాపైన ఎనలేని […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 28 (యదార్థ గాథ)

జీవితం అంచున -28 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి నా ప్లేస్మెంట్స్ నోటిఫికేషన్ వచ్చింది. మొదటి వారం AM షిఫ్టు, రెండో వారం PM షిఫ్టు వేసారు. AM షిఫ్టు ఉదయం ఆరుకి ప్రారంభమయి మధ్యాహ్నం రెండుకి ముగుస్తుంది. తరువాతి షిఫ్టు నర్సుకి హ్యాండోవర్ చేసేసరికి దాదాపు మూడవుతుంది. PM షిఫ్టు మధ్యాహ్నం రెండు నుండి రాత్రి పది వరకు. ట్రైనింగ్ అవుతున్న విద్యార్థులకు నైట్ షిఫ్టులు లేవు. ఈ ప్లేస్మెంట్స్ పూర్తయితే […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-25

నా అంతరంగ తరంగాలు-25 -మన్నెం శారద నా పేరు నాకిష్టం ! ఆమాటకొస్తే  ఎవరిపేరు ఎవరిష్టం ఉండదు చెప్పండి ! అయితే ముఖ్యంగా చదువులతల్లి సరస్వతి పేరు కావడం అందుకు కారణం . మేము నలుగురు ఆడపిల్లలం. మా అక్కపేరు హేమలత. ఆ పేరంటే మా నాన్నగారికి ఇష్టం  అట. అక్కకు ఆయనే పెట్టారట. ఇక మిగతా ముగ్గురికి అమ్మే పేర్లు పెట్టారు. వరుసగా లక్ష్మి ,సరస్వతి ,పార్వతి  ఇల్లంతా నడయాడాలని  నాకు శారద. మా మిగతా […]

Continue Reading
Posted On :

కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని

కాళిదాస్ కన్న నేల ఉజ్జయిని -డా.కందేపి రాణి ప్రసాద్ మేము మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం జనవరి 2014లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ కు వెళ్ళాము. అక్కడి సాయాజీ గ్రాండ్ హెూటల్ లో దిగాము. ఇండోర్ లో చాలా చిన్న ఎయిర్పోర్టు. దాని పేరు ‘దేవి అహల్యాబాయి హెూల్కర్ విమానాశ్రయం’. ఈ మాల్వా ప్రాంతమంతా హెూల్కర్ రాజ వంశస్థుల పాలనలో అభివృద్ధి చెందింది. ఇండోర్ తో మా కాన్షరెన్స్ అయాక చుట్టు ప్రక్కల ప్రాంతాలైన ఉజ్జయిని. ఓం కారేశ్వర్, […]

Continue Reading

యాత్రాగీతం-66 అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-1

యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-1 -డా||కె.గీత మనం చిన్నప్పటినించీ ఎన్నో కలలు కంటూ ఉంటాం. కానీ కొన్ని కలలు మాత్రమే సాకారమవుతాయి. కాదు కాదు సాకారం చేసుకునే దిశగా ప్రయాణిస్తాం. అలా నిజం చేసుకున్న ఒక అద్భుతమైన కల ఈ యూరప్ యాత్ర. యూరప్ వెళ్లాలి- లండన్, ప్యారిస్, రోమ్, వెనీస్ మొదలైన ప్రదేశాలను చూసి రావాలి అనేది చిన్ననాటి కల. ప్రత్యేకించి  “లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

బాడీ షేమింగ్

బాడీ షేమింగ్ -కందేపి రాణి ప్రసాద్ “అమ్మా మన వీపుమీద మూటలా ఇదేమిటి? చాలా అసహ్యంగా ఉన్నది ఏమీ బాగా లేదు. గుర్రాలు చాలా అందంగా ఉన్నాయి.  మనమలా లేము ఎందుకమ్మా” పిల్ల ఒంటె తల్లిని భాధగా అడిగింది.            అక్కడొక బీచ్ ఉన్నది.  బీచ్ ఒడ్డున ఒంటెలు తిప్పేవాడు మనుష్యులను ఎక్కించు కుని తిప్పుతూ ఉంటాడు. నాలుగు ఒంటెలున్నాయి వాడి దగ్గర ఉన్న ఒంటెలతో పిల్లలను పెద్దలను ఎక్కించుకుని అటు ఇటు […]

Continue Reading

పౌరాణిక గాథలు -28 – గర్వభంగము – విశ్వామిత్రుడు కథ

పౌరాణిక గాథలు -28 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి గర్వభంగము – విశ్వామిత్రుడు కథ పూర్వం గాధి కొడుకు విశ్వామిత్రుడు కన్యకుబ్జానికి రాజు. అతడు గొప్ప పరాక్రమవంతుడు. అతణ్ని ఎదిరించి నిలబడ గలిగిన రాజు భూమండలంలో లేడు. అందువల్ల నిర్భయంగా రాజ్య పాలన చేస్తూ ఉండేవాడు. తను క్షత్రియుడవడం, తనను ఎదిరించే రాజు మరొకడు లేకపోవడం వల్ల క్షాత్రియుడి బలమే బలమని అనుకుంటూ గర్వపడుతూ ఉండేవాడు. బ్రాహ్మణుల్నిగాని వారి తపశ్శక్తినిగాని కొంచెమైనా గౌరవించేవాడు కాదు. చాలా అహంకారంతో జీవించేవాడు. […]

Continue Reading

నడక దారిలో(భాగం-51)

నడక దారిలో-51 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి అధ్వర్యంలో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. తర్వాత రెండో పాప, బాబు అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, నేను ఆర్టీసి హైస్కూల్ లో చేరాను. వీర్రాజుగారు స్వచ్ఛంద […]

Continue Reading

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -8 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 8 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద 2000, డిసెంబర్ 1 న  దాదాపు మధ్యాన్నం మూడుగంటలకు ప్రేమశిల చివరి శ్వాస తీసుకుంది. అప్పుడు హృదానంద చిన్న గమడాలో టీ షాప్ లో ఉన్నాడు. వార్త చేరాక మూడున్నరకల్లా వచ్చాడు. హృదానంద అయిదయేసరికి చితికి నిప్పుపెట్టాడు. ప్రేమశిల పార్ధివ దేహానికి అంత్యక్రియలు ముగిసాయి. ఆమె చావుకు రెండు గంటల ముందు, […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-7

సస్య-7 – రావుల కిరణ్మయి ఎవరు           తను వెళ్ళేసరికి ఇళ్ళంతా శుభ్రంగా సర్ధబడి ఉంది. నమస్తే మేడమ్ ! అంది అక్కడ కూర్చుని శ్రావణ్ వాళ్ళ అమ్మకు పాదాలు మసాజ్ చేస్తున్న తనంత వయసున్న అమ్మాయి. నమస్తే ! మీరు…? నా పేరు … అని ఆమె చెప్తుండగానే… మానసా…! ఒక్క నిమషం ఇలా వచ్చిపో. అని లోపల నుండి. శ్రావణ్ పిలవడంతో ఆమె వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన ఆమె […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-12 ఈ తరం అమ్మాయిలు

కాదేదీ కథకనర్హం-12  ఈ తరం అమ్మాయిలు -డి.కామేశ్వరి  “డోంట్ బి సిల్లీ మమ్మీ” రోజుకి పదిసార్లు తల్లితో అనే ఆ మాట ఆ రోజూ అంది ప్రీతి. డ్రస్సింగ్ టేబిల్ ముందు నిల్చుని ఆఖరి నిమిషంలో మేకప్ టచ్ చేసుకుంటూ. రోజులా వోరుకోలేకపోయింది సుజాత. కోపంగా చూస్తూ ఏమిటే ఊరుకుంటున్న కొద్దీ మరీ ఎక్కువవుతుంది. ప్రతీదానికి డోంట్ బి సిల్లీ అంటావు. ఏమిటా మాటలకి అర్ధం, ఇంగ్లీషు నీకా కాదు వచ్చు! నీవేం చేస్తున్నా వూరుకుంటే సిల్లీ […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-23

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 23 – విజయ గొల్లపూడి జరిగినకథ:విశాల, విష్ణుసాయి పర్మెనెంట్ రెసిడెంట్ వీసా తో ఆస్ట్రేలియా సిడ్నీలో అడుగు పెట్టారు. అక్కడ జీవన విధానానికి మెల్లిగా అలవాటు పడుతున్నారు. విశాల టేఫ్ కాలేజ్ లో వర్క్ ఎక్స్ పీరియన్స్ పూర్తి చేసింది. విష్ణు నైట్ షిఫ్ట్ పర్మెనెంట్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. విశాల ఖాళీగా ఉండకుండా, వచ్చిన అవకాశాలను  ఉపయోగించు కుంటూ, మైక్రోసాఫ్ట్ అడ్వాన్స్ డ్ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ పూర్తి చేసింది. […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి అక్కడ ప్రఫుల్లకి శిక్షణ మొదలయ్యింది. నిశికి అక్షర జ్ఞానం వుంది. అంతకు క్రితమే తనను దొంగలు రాజుకి అమ్మివేసినప్పుడు, అంతఃపురంలో కొంత నేర్పించారు. తరువాత భవానీ పాఠక్ నేర్పించాడు. ఇప్పుడు నిశి ప్రఫుల్లకు అక్షరమాల, రాయటం చదవటం నేర్పించింది.  వ్యాకరణం భవానీ పాఠక్ వచ్చి నేర్పించసాగాడు. ఒక ఆకలిగొన్న పులి వలె, ప్రఫుల్ల విద్యాభ్యాసాన్ని కొనసాగించింది. ప్రఫుల్ల పట్టుదల, […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్)

అనుసృజన సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్) అనుసృజన: ఆర్ శాంతసుందరి ప్రతి ఒక్క వాక్యం ఎంతో అర్ధవంతం. వేదాంత భరితం. సూఫీల నిరంతర అన్వేషణ సంఘర్షణానంతరం వారి మనసులో నిలిచిన భావ సంపద. ఇది మతాతీత మైన అనుభవసారం. 1. నాకు కావాలనుకున్న దాని వెంట నేను పరిగెత్తేటప్పుడు రోజులు ఒత్తిడితో, ఆత్రుత పడుతూ గడిచినట్టనిపిస్తుంది. కానీ నేను సహనం వహించి కదలకుండా కూర్చుంటే, నాకు కావాల్సింది ఏ బాధా లేకుండా నా దగ్గరకు ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని […]

Continue Reading
Posted On :

ఆరాధన-8 (ధారావాహిక నవల)

ఆరాధన-8 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి కళాత్మకం           మళ్ళీ ఆదివారం నేను హూస్టన్ స్టూడియోకి వెళ్ళేప్పటికే మాధవ్ తో పాటు అతని తల్లి వరలక్ష్మి, మరదలు కాత్యాయని ఆఫీసులో నా కోసం వేచి ఉన్నారు. మాధవ్ వారిని పరిచయం చేశాడు. అతని తల్లి ఆప్యాయంగా పలకరించి, నాకు ధన్యవాదాలు తెలిపింది. కాత్యాయని చాలా అందమైన అమ్మాయి. సొగసైన కన్నులతో, చిరు మందహాసంతో ఓ కిన్నెరలా నాజూకుగా అనిపించింది. నా వద్దకి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 51

నా జీవన యానంలో- రెండవభాగం- 51 -కె.వరలక్ష్మి           అకిరా కురసోవా గొప్పగా పిక్చరైజ్ చేసిన ‘తెర్సు ఉజాలా’ మూవీ చూస్తే ఏ సినిమా కైనా కథే ప్రాణం, ఏ కథకైనా నిజాయితీయే ప్రాణం అన్పించింది నాకు.           ఒక రోజు సి.బి. రావుగారు ఫోన్ చేసి ‘‘మీ అతడు – నేను కథలు చదివేను. నాకు చాలా నచ్చాయి. ‘ఈ మాట’ కోసం రివ్యూరాసాను’’ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 30

వ్యాధితో పోరాటం-30 –కనకదుర్గ పాపం శ్రీని ఏం సుఖపడ్డాడు నన్ను చేసుకుని. పెళ్ళయిన 4 ఏళ్ళకే ఈ రోగం తగులుకుంది. ఇక్కడికొచ్చాక కొంచెం బాగున్నాం అనుకుంటే ఇప్పుడు ఇలా బాధపడ్తు న్నాం. ఒక్కడే ఇద్దరు పిల్లల్ని అందులో ఒక పసికందుని చూసుకుంటూ, ఆఫీసుకి వెళ్తూ నన్ను చూడడానికి వస్తూ కష్టపడ్తున్నాడు. ఆర్ధిక విషయాలు నాతో అసలు మాట్లాడడు. నేను ఎన్నిసార్లు అడిగినా దానికి బదులేం చెప్పడు. “నేను చూసుకుంటాను కదా! నీకెందుకు మరొక ఆలోచన? ఇప్పటికే నొప్పితో, […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 27 (యదార్థ గాథ)

జీవితం అంచున -27 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి క్వశ్చనేర్ పూర్తయ్యాక మొట్టమొదటగా విద్యార్థులను డోనింగ్ అండ్ డోఫింగ్ చేసి చూపమన్నారు. డోనింగ్ ఆఫ్ PPE అంటే హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను ధరించే వరుస క్రమం అలాగే డోఫింగ్ ఆఫ్ PPE అంటే మళ్ళీ హ్యాండ్ వాష్ తో ప్రారంభo చేసి PPE ను విసర్జించే వరుస క్రమం. మనం చేసే డెమోలో డోనింగ్ మరియు డోఫింగ్ల […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-24

నా అంతరంగ తరంగాలు-24 -మన్నెం శారద నేను చూసిన మొదటి సినీ నటి అప్పుడు మా నాన్న గారు గురజాలలో పోస్టుమాస్టర్ గా చేస్తున్నారు. మాచర్ల నుండి ట్రాన్ఫర్ అయి గురజాల వచ్చాం. గవర్నమెంట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ అన్నీ అక్కడ సౌరయ్య కాంపౌండ్ లోనే ఉండేవి. ఆయనకు బస్ సర్వీస్ కూడా ఉండేది. మా ఇల్లు సరేసరి.. ముందు పోస్ట్ ఆఫీస్… వెనుక రెండు గదులు, వంటగది, బ్యాక్ యార్డ్, పైన బెడ్ రూమ్స్, పెద్ద ఓపెన్ టెర్రస్ […]

Continue Reading
Posted On :

బన్నారుగట్ట జూ పార్కు

బన్నారుగట్ట జూ పార్కు -డా.కందేపి రాణి ప్రసాద్ బన్నారుగట్ట నేషనల్ పార్క్ ను నేను దాదపుగా పాతికేళ్ళ క్రితం చూశాను. ఇది కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఉన్నది. అప్పట్లో మేము నెలకోసారి రిలాక్సేషన్ కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. పేషెంట్ల అనారోగ్య వాతావరణాల మధ్యనుండి చల్లని చెట్ల గాలుల కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. అప్పుడు మా పిల్లలు మూడు, నాలుగేళ్ళ వయసుల వాళ్ళు. కాబట్టి వాళ్ళ సరదా పడాలంటే జూపార్కులే కదా మా ఫ్రెండు వాళ్ళ ప్యామిలీతో కలసి బన్నారుగట్ట నేషనల్ పార్కుకు వెళ్ళాం.   […]

Continue Reading

యాత్రాగీతం-65 హవాయి- ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం)

యాత్రాగీతం హవాయి దీవులు – ఒవాహూ ద్వీపం – హనోలూలూ (చివరి భాగం) -డా||కె.గీత మర్నాడు మా హవాయి యాత్రలో చివరి రోజు. ఆ ఉదయం సత్య, వరు మార్నింగ్ కామ్ అడ్వెంచర్ టూరు (Morning Calm Cruise adventure tour) కి వెళ్లారు. ఉదయం 7.30 నించి 11.30 వరకు సాగే ఈ టూర్ లో పడవ మీద సముద్రంలో కొంత దూరం వెళ్లి అక్కడ స్నోర్కిలింగ్ చెయ్యడం ప్రధానం. ఒక్కొక్కళ్ళకి దాదాపు $200 టిక్కెట్టు. […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

ఆహారం విలువ

ఆహారం విలువ -కందేపి రాణి ప్రసాద్ చిక్కటి ఆడవి. చెట్లన్నీ ఎత్తుగా పెరిగి ఉన్నాయి అడవిలో జంతువులన్నీ పనులు చేసుకునే వేళ వారి వారి పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. కొన్ని కోతి పిల్లలు చెట్ల తీగల మీద ఉయ్యాలలు ఊగుతూ ఆడుతున్నాయి. తీగల్ని పట్టుకుని కిందకి జారుతూ మళ్ళీ చెట్ల మానుల నుంచి ఎగబాకుతూ జారుడుబల్ల ఆటలు ఆడుతున్నాయి. మధ్య మధ్యలో ఒకదాని నొకటి వెక్కిరించుకుంటూ ఉన్నాయి. తాడు పట్టుకొని ఊగుతూ ఆగి తలను గోక్కుంటున్నాయి. ఇంతలో […]

Continue Reading

పౌరాణిక గాథలు -27 – వినయస్వభావము – ప్రహ్లాదుడు కథ

పౌరాణిక గాథలు -27 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వినయస్వభావము – ప్రహ్లాదుడు కథ ప్రహ్లాదుడు ఒక చక్రవర్తి కొడుకు. అతడు ప్రేమ, అంకితభావం కలిగినవాడు. కాని అతడి తండ్రి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడికి పూర్తి వ్యతిరేక భావాలు కలవాడు. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడికి తన కొడుకు భగవంతుణ్ని స్మరించుకోడం అంటే ఇష్టముండేది కాదు. ఎందుకంటే, అతడు భగవంతుడి కంటే తనే గొప్పవాడినని అనుకుంటూ ఉండేవాడు. తన కొడుకు కూడా తనలాగే ఉండాలని కోరుకునేవాడు. ప్రహ్లాదుణ్ని తన మార్గంలోనే నడవమని […]

Continue Reading

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -7 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 7 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద నవంబర్ 26 న బీ డీ ఓ , ఒకే డాక్టర్ ఆసుపత్రి డాక్టర్, సీపీడీఓ గమడాకు వచ్చి ప్రేమశిలను చూసారు. డాక్టర్ తన మోటర్ బైక్ మీద వచ్చాడు. తనతో బాటు ఒక సెలైన్ బాటిల్ కూడా తెచ్చాడు. ఆమె ఇంట్లో ఒక వాసానికి తగిలించి ఆమెకు డ్రిప్ పెట్టాడు. […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-6

సస్య-6 – రావుల కిరణ్మయి డిప్యుటేషన్ ఇవ్వబడిన పాఠశాలకు చేరుకుంది. ఆ పాఠశాల పరిసరాలు తనను ఆకట్టుకున్నాయి. తనొక్కతే ఉపాధ్యాయిని, అందరూ ఉపాధ్యాయులే. పరిచయాల తరువాత తరగతి గదిలోకి వెళ్ళింది. ఆ గది విజ్ఞానపు కర్మాగారంలా కాక కారాగారంలా తోచింది. అంతా బలవంతంగా బంధించబడిన పక్షుల్లా కనిపించారు. ఏ ఒక్కరిలోను ఉత్సాహం లేదు. ఆర్యభట్ట గనుక ఇప్పుడు ఉంటే ఖచ్చితంగా ఈ తరగతి గది శూన్యతను చూసి సున్నాను కనిపెట్టేసేవాడు అనిపించింది. నవ్వుతూ విష్ చేసింది. ఎటువంటి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-11 జనరేషన్ గ్యాప్

కాదేదీ కథకనర్హం-11 జనరేషన్ గ్యాప్ -డి.కామేశ్వరి  “డోంట్ బి సిల్లీ మమ్మీ హౌ డు యు ఎక్స్ పెక్ట్ మీ టు మేరీ ఎన్ అన్ నొన్ గై” నందిత అద్దం ముందు నిలబడి జుత్తు బ్రష్ చేసుకుంటూ. చేత్తో కర్ల్స్ తిప్పుతూ. అద్దంలో అన్ని యాంగిల్స్ నించి అందం చూసుకుంటూ తల్లి వంక చూడనైన చూడకుండా నిర్లక్ష్యంగా కొట్టి పారేసింది. కూతురి ధోరణి మాధవికి కోపం తెప్పించినా కోపం చూపితే యీ కాలం పిల్లలు అందులో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-25 శ్రీమతి కొమ్మూరి ఉషారాణి కథ “అభ్యుదయం”

కథామధురం  ఆ‘పాత’ కథామృతం-25 శ్రీమతి కొమ్మూరి ఉషారాణి కథ “అభ్యుదయం”  -డా. సిహెచ్. సుశీల ప్రేమ, కాదల్, ఇష్క్, లవ్ … ఏ పేరుతో పిలిచిన “ప్రేమ” అన్న భావనే మధుర మైనది. యుక్త వయసులో ఉన్నవారు భవిష్యత్తులో తమ ప్రేమ ఎంత అందంగా, ఆహ్లాదకరంగా పరిణమించబోతుందో అని మధురంగా ఊహించుకొని మురిసిపోతారు. వయసు అయిపోయిన వృద్ధులు కూడా ప్రేమ అన్న పదం వినగానే తమ గతాన్ని తలుచుకొని, తమ ప్రేమ కథల్ని, ప్రేమ భావనల్ని జ్ఞప్తికి […]

Continue Reading

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి దుర్లబ్ ప్రఫుల్లను ఎత్తుకుపోయిన రాత్రే వ్రజేశ్వర్ ప్రఫుల్ల ఇంటికి చేరుకున్నాడని ఇదివరకే చెప్పుకున్నాం కదా. ప్రఫుల్ల వుండే పూరింటిలోకి వెళ్లి చూస్తే, లోపల ఏ జాడా లేదు. ఇరుగూపొరుగుని అడుగుదామంటే అర్థరాత్రి, చుట్టూ అంధకారం. అంతకు కొన్ని క్షణాల క్రితమే ప్రఫుల్లని ఎత్తుకుపోయిన విషయం వ్రజేశ్వర్కి తెలియదు. ఒకవేళ ఎవరైనా బంధువుల ఇంటిలో పడుకోవటానికి వెళ్లి వుంటుంది అని […]

Continue Reading
Posted On :

అనుసృజన- సూఫీ కవిత్వం

అనుసృజన సూఫీ కవిత్వం అనుసృజన: ఆర్ శాంతసుందరి సూఫీ కవిత్వంలో భగవంతుడితో కలయిక, ప్రేమ, మానవ చైతన్యంలోని అతి లోతైన భావాలు కవుల హృదయాలలో నుంచి పొంగి పొరలి, వారి కలాలలో నుంచి కవితలుగా జాలువారాయి. ఈ కవితలు పర్షియన్, టర్కిష్ భాషలలో మొదట రాసేవారు. కాని, ఈ రోజుల్లో ఉర్దూ, హిందీ భాషలలోనూ రాస్తున్నారు – అవి అనువాదాలుగా కూడా దొరుకు తాయి. ఆంగ్లంలో కూడా సూఫీ కవితలు రాస్తున్నారు.           […]

Continue Reading
Posted On :