image_print

గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే (కథ)

 గంగమ్మ కన్నంతా దున్నపోతు మిందే (కథ) -ఎండపల్లి భారతి ”మేయ్ ఇంటికోమనిసిని  బండమీదకు రమ్మన్నారు జాతర గురించి మాట్లాడాలంట నేను పోతాండ” అనేసి నిదర మొగాన నీల్లు సల్లు కొన్ని తువ్వాలి గుడ్డ బుజానేసుకుని  పన్లన్నీ నా మీద సూపడ ఏసి ఎలిపాయ నా మొగుడు  ! అత్త చెప్పిన పని చేయాలని ఇసురురాయి కాలి మింద తోసుకొని కుసున్నంట వొగాయమ్మ. అట్లా ఈ గంగజాతర  అయిపోయినంతవరకు ఇంట్లోపనులు బయటి  పనులు ఒగొటి గూడా జేయకుండా తప్పించుకుంటాడు నా మొగుడు .               […]

Continue Reading
Posted On :

అమ్మా (‘పరివ్యాప్త’ కవితలు)-8

అమ్మ (‘పరివ్యాప్త’ కవితలు)-8 -డొంకెన శ్రీశైలం ఒడిలో కూచుంటే అమ్మ ఉగ్గన్నం తినిపించింది తన జోలపాటలతో నేను నిదుర పోయాకే అమ్మ నిదురపోయేది నాకు సుస్తీ చేస్తే అమ్మ పస్తులుండి కనపడని దేవుళ్ళకు కానుకలిస్తానని మొక్కుకునేది ఓనమాలు నేర్పి బడికి పంపేది అమ్మ వేడన్నం నాకు సద్దిగట్టి సల్దిఅన్నం సర్దుకు తింటుంది అమ్మ ఆనవాలు లేక ఆస్తినంతా అమ్మేసి బతుకుబాట చూపి ఓ ఇంటివాన్ని చేసింది అమ్మ వరిచేను ధగ్గర అమ్మ వంట దగ్గర అమ్మ వడ్డించే […]

Continue Reading
Posted On :

మరో గుండమ్మ కథ

        మరో గుండమ్మ కథ -అక్షర గుండమ్మగారంటే ఎవరో కాదండీ, మా అత్తగారికి అత్తగారైన ఆదిలక్ష్మి అమ్మగారే. వయస్సు ఎనభై ప్లస్సు. మొత్తం ఇంటికి బాసు. ఏమంటారా? ఆ పరమాత్మ ఆనతి లేనిదే ఆకైనా కదులుతుందేమోకానీ ఈ ఆదిలక్ష్మిగారి అనుమతి లేనిదే మా ఇంట్లో మంచినీళ్లయినా పుట్టవు. అదేమంటారా? అది ఆవిడ అదృష్టం. మన ప్రాప్తం. ఏదేమైనా ఆవిడకు ఆఇంట్లో ఉన్న పవర్ చూసి, ఆవిడ ఆకారానికి తగ్గట్టుగా గుండమ్మ అని, బిగ్ బాస్ అని పేర్లు పెట్టాము. […]

Continue Reading
Posted On :

కలలు అలలు (కథ)

కలలు అలలు -శాంతి ప్రబోధ పాపాయి షో గ్రౌండ్స్ కి బయలుదేరింది. ఆ గ్రౌండ్స్ లో పిల్లలకోసం మంచి పార్క్ , రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి . బయట చల్లటి చలిగాలి వీస్తున్నది.  అందుకే వాళ్ళమ్మ పాపాయికి  చలికోటు , బూట్లు , సాక్స్ వేసింది. సాధారణంగా ప్రతి రోజూ  పాపాయి బయటికి వెళ్తుంది . అలా పార్కుకో, గ్రౌండ్స్ కో వెళ్లి అక్కడ కొంత సేపు గడపడం పాపాయికి చాలా ఇష్టం. ఆ పార్కుల్లో […]

Continue Reading
Posted On :

నిన్ను చూడకుంటే నాకు బెంగ (కథ)

నిన్ను చూడకుంటే నాకు బెంగ -జానకీ చామర్తి తలుపు తీయంగానే విసురుగా తాకిన హేమంతగాలికి కట్టుకున్న నూలు చీర ఆపలేక వణికింది విజయ. అమ్మ చీర , రాత్రి రాగానే పెట్లోంచి తీసి కట్టేసుకుంది .. చూసుకు నవ్వుకుంది, పెద్దవాళ్ళచీరలా ఉందని.నీళ్ళ పొయ్యి ముందుకు వచ్చి , మోకాళ్ళు మునగదీసుకు కూచుని , అరచేతులు చాపి మంట వేడికి వెచ్చపెట్టి చెంపలకు తాకించుకుంటోంది. నీళ్ళకాగులో నీళ్ళు కాగే కళపెళా చప్పుడు వింటూ కేకెట్టింది, “ నీళ్ళు కాగాయి, ఎవరు పోసుకుంటారు “ […]

Continue Reading
Posted On :

ఖాళీ (కవిత)

    ఖాళీ -డా.సి.భవానీదేవి ఇప్పుడంతా ఖాళీయేఇల్లు..మనసు..కలల ఖజానా ఎన్నో దశాబ్దాలుగా సేకరించి పెట్టుకున్నఅక్షర హాలికుల సేద్య ఫలాలు…. స్వర శిఖర సంభావిత సంపూజ్యరాగమాంత్రికుల మధుర గళ మధురిమలు సాహితీ ప్రకాండుల సభా సందర్భాలనుమనోనేత్రంలో  చిర చిత్రణ చేసిన జ్ఞాపికలు బాల్యం తాగించిన అమ్మ నాన్నల అనంతామృత ధారల ప్రేమ ఉయ్యాలలు చదువు..సంస్కారం ప్రసరించినగురువుల ప్రశంసల ఆశీస్సులు బాల్యంలో హత్తుకున్న కలం ప్రకటించినఅనేకానేక రచనల సమాహారాలు చిన్నప్పటి నుండి నా ఆశల స్వప్నాల్నీనా కన్నీటి తడిని చదివిన వంటపాత్రలు దూరమయిన రక్తబంధాల ఆనవాళ్ళుదగ్గరయిన ఆత్మబంధువుల ఆప్యాయతలు జీవితంలో ప్రతి క్షణం ..వెలుగు నీడలుమనసుగదిలో […]

Continue Reading
Posted On :

ప్రేమ (కవిత)

  ప్రేమ -డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె ఏదైనా చేయగలగడమంటే కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో భార్యగా బాధ్యతగా బ్రతకడమే- బదులిచ్చాడతడు విరామమే మరిచి అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ సరస సల్లాపాల డోలలాడించగల మోహిని ముందు మోకరిల్లాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో తల్లిగా రక్త మాంసాలను ధారపోయడమే- బదులిచ్చాడతడు జీవితాన్నే ధారపోసిందామె రెక్కలొచ్చిన పక్షి తన గూటిని వెతుక్కుంది మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా? అడిగిందామె అది అన్ కండీషనల్ ప్రేమించడమే నీ వంతు సమాధానమిచ్చారు ముగ్గురూ! **** డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీరి కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

Continue Reading
Posted On :

దినచర్య (కవిత)

దినచర్య -పద్మావతి రాంభక్త బహుశా మీరనుకుంటారేమో నా ఖాళీ సమయాలన్నీ అక్షరాలుగా తర్జుమా అవుతుంటాయని ఉదయం లేచీ లేవగానే నా మెదడు నిండా అంటుకున్న కలల శకలాలను దులిపి వాస్తవాన్ని కౌగిలించుకున్నప్పుడు నిన్నటి జ్ఞాపకమేదో నా మనసులోకి వద్దన్నా జొరబడి వంటింట్లోని  పోపుగింజలా అక్షరమై చిటపటలాడుతుంది లోపల వర్షం బయట వర్షంతో జతగూడినపుడు నేను తడిమేఘమై కురిసిపోతుంటాను కిటికీలోనుండి ప్రవేశిస్తున్న రవికిరణాలలోని వెచ్చదనాన్ని కట్టగట్టినపుడు ఒక నులివెచ్చని వాక్యమై వాలిపోతాను గడ్డకట్టిన కాలం కన్నీటి సంతకాలతో తుపానులతో […]

Continue Reading
Posted On :

స్వేచ్ఛ (కవిత)

స్వేచ్ఛ -పి.సుష్మ వాళ్లంతా భద్రత అనే బంగారు పంజరంలో బందీలు రెక్కల క్రింద స్వేచ్ఛను కట్టేసుకొని అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటారు ఎగిరే కొద్దీ వెనక్కిలాగే వాళ్ళు కొందరు స్వేచ్ఛ ఇచ్చామని అంటూనే రెక్కలు విరిచేస్తూ ఉంటారు ఇంకొందరు విరిగిపోయిన రెక్కలు ఈకలై ఎగిరిపోవడం చూసే ఉంటావు అది ఎవరికీ భయపడని స్వేచ్ఛ ఈకలన్ని చదివే ఉంటాయి ఆకతాయి గాలి చేష్టలు అయ్యో అంటూ అక్కున చేర్చుకున్న బండరాయి సందులో కొన్ని ముళ్ళకంపలో కొన్ని ఇలా అక్కడక్కడా […]

Continue Reading
Posted On :
sailaja kalluri

మచ్చలు (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ

మచ్చలు -డా.కాళ్ళకూరి శైలజ ఎండ సోకిన చోట నలుపు,బట్ట దాపున తెలుపు,  ఒంటి మీద కష్టసుఖాల జాడలుమచ్చలై ముచ్చట్లు చెపుతాయి. సొమ్ములు సాగి సాగి వేలాడే కండలౌతాయి .శతమానాల ముద్దర ఎద మీద ఒత్తుకుంటుంటే , నాలి తాడు ఆనవాలు మెడ చుట్టూ చేరి తాకట్టుకెళ్ళి తిరిగి రాని ఊసులు చెపుతుంది.పాలు చీకిన ముచ్చికలు,పసి అంగుడి కోసిన పగుళ్ళతోఉసూరు మంటాయి.      రోకళ్ళు,చీపుర్లు కదుము కట్టిన చేతులుఎగుడు దిగుడు గుట్టలు.గుండిగలు తోమి మకిలి ఇంకిన వేళ్ళు  పంట కొడవలి గంట్లకి రెల్లు గడ్డిలా […]

Continue Reading
Posted On :

నైజం (కవిత)

నైజం -గిరి ప్రసాద్ చెల మల్లు అమ్మున్నంత కాలం ఎగబడ్డాయి పక్షులు అమ్మ పోయింది పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి  అమ్మ వున్నప్పుడు ఎంగిలిచేతిని విదిలించని ఇళ్ళపై వాలుతున్న పక్షులు విదిలిస్తారని ఆశతో ఈసడించిన చేతులవైపు  అమ్మ పోపుగింజల్లో డబ్బు సైతంముక్కున కర్సుకుపోయిన  పక్షులు మరోవైపు  అమ్మ చేతి వంట తిన్న పక్షులు మర్చి మరబొమ్మల్లాతారాడుతున్నాయి  బెల్లమున్నప్పుడే ఈగలుఅమ్మ చెబుతుండేదెప్పుడూ కాని అమ్మే గుర్తెరగలేదనేది నేడు కన్పిస్తుంది కళ్ళముందు  గూటిపక్షులువలస పక్షులు అన్నీ అవే కోవలోఇసుమంతైనా తేడా లేదు సుమీ ! ముసిముసినవ్వుల వెనుక దాగిన మర్మం విషం గడపలో ఓ కుక్క విశ్వాసంగా అప్పుడూ ఇప్పుడూ **** పుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష […]

Continue Reading
Posted On :

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు)

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు) -అమ్మంగి కృష్ణారావు ఇది ఒక జీవన రంగస్థలి పక్షులు గూళ్ళు చేరుకుంటున్నాయి అచ్చం అమ్మ ఒడిలోకి చేరుకున్నట్లు కోడి పిల్లలను డేగ కన్ను నుండి కాపాడుకుంటుంది ఎగిరెగిరి ఎదిరించి పోరాడే పటిమతో గంతులేస్తున్న లేగదూడకు తల్లిఆవుపొదుగు పాలిస్తుంది లాలించి తాగించి నట్టుగా పుడమి తల్లిలా నేలంతా పచ్చదనాన్ని పులుముకుంటుంది జగమంతా తనదే అన్నట్లుగా అంతా అమ్మ తత్వమే అమ్మా భూమ్మీద పడగానే ఎంత ఆనందించావో నాకు ఊహ తెలియకముందే వెళ్ళిపోయావు కదమ్మా […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-17)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం మాకు ముగ్గురు మాంచేగోలతో మంచి దోస్తీ కలిసింది. వాళ్ళు వస్తూనే “మా కివాళ మీ ఇంట్లోనే భోజనం. మాకు ఇవాళ సెలవు. ఎక్కడికీ పోలేం” అనే వాళ్ళు. మేం బయటి పరిస్థితులను గురించి కూడా మాట్లాడుకునే వాళ్లం. మేం అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబాల్ని కూడా పిలిచేవాళ్ళం. మాంచెగోలకూ, రేంజర్లకూ ఉన్న తేడా ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ప్రతి […]

Continue Reading
Posted On :

కొడుకు-కూతురు (కథ)

కొడుకు-కూతురు -జి.అనంతలక్ష్మి ఆడపిల్ల పుట్టింది అనగానే ఆడ  పిల్ల అంటారు. ఏందుకు? పెళ్ళి అయి అత్తవారింటికి వెళి పోతుంది అని. ఈనాడే కాదు ఆనాడు మగపిల్లాడు పుట్టి ఏమి వుద్దరించాడు? ఆ మాటంటే ఇంట్లో అందరు యుద్ధానికి వచ్చేస్తారు.  మగపిల్లాడు నెత్తిన పెట్టే రాయి ఏమిటి? ఆడపిల్ల నిజంగా రాయి పెట్టకపోవచ్చు. తల్లిదండ్రుల కష్టాలలోను చివరి పరిస్థితుల్లోను వెన్నంటి కాపాడేది ఆడపిల్లే. కాని చివరకి ఆ తల్లిదండ్రులకు కూడ ఆడపిల్ల పనికిరానిదవుథోందా! ఏందుకు?  ఇలా ఆలోచిస్తూ తల్లి […]

Continue Reading
Posted On :

సన్న జాజులోయ్ (కథ)

సన్న జాజులోయ్ -ఎన్నెల పెళ్ళప్పుడు మా అమ్మ నన్ను అప్పగిస్తూ మా వారితో…’ అమ్మాయి సెవెన్ జాస్మిన్ హయిటు నాయనా, జాగర్త గా చూసుకో ‘ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. మా వాళ్ళందరూ అయోమయం గా మొహం పెట్టి,” పాపం బాధలో ఏదో మాట్లాడుతోందిలే పిచ్చి తల్లి” అని సర్దుకున్నా, తర్వాత చుట్టూ చేరి, ” మీ అమ్మ గారు ఏమన్నారు ఇందాకా అప్పగింతలప్పుడూ” అని నన్నడిగారు.”అదా….సెవెన్ జాస్మిన్స్ హయిటు అనగా ‘ఏడు మల్లెల […]

Continue Reading
Posted On :
P.Satyavathi

ఇట్లు మీ స్వర్ణ (కథ)

ఇట్లు మీ స్వర్ణ -పి సత్యవతి పొద్దున్న లేచి, పాలు తెచ్చి, టీ కాచి మంచినీళ్ళు పట్టి తెచ్చి, ఇల్లూడ్చి  వంటింటి పనులు  అందుకుని తమ్ముడుకి తనకీ  బాక్సులు కట్టి షాపుకి తయారైంది స్వర్ణ. , ఎర్ర చుడీ, దానిమీదకి రంరంగుల పువ్వుల కుర్తీ ,పలచని ఎర్ర చున్నీ, వేసుకుంటే జడ లేకపోతె ‘పోనీ’ కట్టుకోవాలి  కానీ జుట్టు వదిలెయ్య కూడదు ‘పోనీ’ కోసం కాస్త జుట్టు కత్తిరించుకుంటానంటే అమ్మ చంపేస్తుంది.చచ్చి నట్టు చిక్కులు తీసుకుని జడ […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-16)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం జరగబోయే సంఘటనలపట్ల కొందరు వ్యాకులపడ్డారు. ఏం జరగబోతోందో తెలియని అమోయమంలో ఎన్నెన్ని ఘోరాలు జరిగాయని! కటావి సంఘటన వింటే గుండె చెరువవుతుంది. సెలవులు గనుక భర్త ఎటో ప్రయాణమయి వెళ్ళిపోయాడు. కాల్పులూ, ఘర్షణలూ – ఈ గందరగోళమంతా చూసి భార్య తన పిల్లల్ని మంచంకింద దాచింది. మా దగ్గర ఇది ఒక అలవాటు. కాల్పులు జరిగేటప్పుడు పిల్లల్ని […]

Continue Reading
Posted On :

కెథారసిస్ (కథ)

కెథారసిస్ –సునీత పొత్తూరి చటుక్కున కళ్లు విప్పి చూసింది సునంద. ఏదో కల. అది కలా అనే స్పృహ కలిగినా, కల మిగిల్చిన చిన్న అసౌకర్యం మస్తిష్కాన్ని అంటిపెట్టుకునే వుంది. సునంద వచ్చిన కల ఓ క్రమంలో గుర్తు తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తోంది.    పైగా కల కూడా అస్పష్టంగా, తెగిన సాలిగూడు లా.. అన్నీ   పొంతన లేని దృశ్యాలు! ఎవరో గొంతు నులిమేస్తున్నట్టు.. అరుద్దామంటే తన నోరు పెగలడం లేదు. అరుపూ బయటకు రావడం లేదు.  అదీ […]

Continue Reading
Posted On :

లైఫ్ టర్నింగ్ టైం (కథ)

లైఫ్ టర్నింగ్ టైం -కె.రూపరుక్మిణి అదో అందాల ప్రపంచం అందు తానో వెన్నెల దీపం ఆ తండ్రి కాపాడుకునే కంటిపాప ….తన కూతురి కోసం తన ఛాతిని పట్టుపరుపుగా మార్చుకునే అంత ప్రేమ తన పట్టుకొమ్మ కోరింది నెరవేర్చాలని ఆశ…. ఓ మధ్యతరగతి తండ్రిగా ఏ ఆవేదన తన కూతురిని అంటకుండా పెంచుకునే ఓ తండ్రి కి కూతురిగా గారాలపట్టి గా ఆఇంటి మహాలక్ష్మి గా పిలిచే వల్లి పేరుకు తగ్గట్టు గానే చక్కని రూపం చదువుల్లో […]

Continue Reading
Posted On :

చదువువిలువ (కథ)

చదువువిలువ -రమాదేవి బాలబోయిన రోజూ ఐదింటికే లేచి ఇల్లు వాకిలి ఊకి సానుపు జల్లి ముగ్గులేసే కోడలు ఇయ్యాల సూరీడు తూరుపు కొండ మీద నిలుచున్నా లేత్తలేదు…ఎందుకో…అని మనుసుల్నే అనుకుంటా కొడుకు పడకగదిలోకి తొంగిచూసింది నర్సమ్మ కొడుకు లేచి పళ్ళల్ల పలుగర్రేసినట్లున్నడు…బయట సప్పుడు ఇనాత్తాంది గనీ…కోడలీ ఉలుకూలేదు పలుకూ లేదు నిన్న రాత్రి ఏందో గడబిడైతే ఇనబడ్డది వాళ్ళరూముల…కాని…ఏమైందో ఏమోనని…నర్సమ్మ పాణం కల్లెపెల్లళ్ళాడుతాంది “శీనయ్యా…ఓ శీనయ్యా….ఏం జేత్తానవ్ బిడ్డా..” అని కొడుకును పిలిచుకుంట…బయట కొడుకున్న కాడికి నిమ్మళంగ […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

విముక్త (కథ)

విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలివచ్చిన ఆఫీసు, హైదరాబాదు నించి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన, అన్నివసతులూఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనెప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా, కాస్త […]

Continue Reading
Posted On :

ముందడుగు (కథ)

ముందడుగు -రోహిణి వంజారి పిల్లలిద్దరూ రంగు పెన్సిళ్ళతో కాగితాలమీద బొమ్మలేవో వేసుకుంటున్నారు.  సోఫాలో కూర్చుని కూర్చుని నడుం నొప్పి పుడుతోంది.  ఐదు నిముషాలు టీవీ లో వార్త చానెల్స్, మరో ఐదు నిముషాలు సెల్ ఫోన్లో  ఫేస్బుక్, వాట్సాప్ లు  మార్చి మార్చి గంట  నుంచి చూస్తున్నాను.  అన్ని చోట్లా ఇపుడు ఒకటే వార్తలు.  కరోనా వ్యాధి గురించి. కరోనా ఏ దేశంలో ఎంత శాతం ప్రజలకు  అంటుకుంది. కరోనా రాకుండా నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు, ఇదే […]

Continue Reading
Posted On :

మిణుగురులు (కథ)

మిణుగురులు -శ్రీసుధ మోదుగు సాయంత్రం బుగ్గ వాగు  దగ్గరికి నడుస్తున్నారు ఇద్దరూ, దూరంగా చిన్న కొండలు వర్షాకాలంలో ఆకుపచ్చగా, ఎండాకాలంలో పసుపచ్చగా మారిపోతాయి. ఎలా చూసినా అందంగానే ఉంటాయి. “బుగ్గ వాగులో నీళ్లు లోతు లేనట్లు కనిపిస్తాయ్, కానీ లోతెక్కువ. ఎప్పుడూ వాగులో దిగకు. శివా! వింటున్నావా?” “ఆ … కాక.”   “శివ! మీ అమ్మ వచ్చి పిలిస్తే వెళ్ళిపోతావా?”  “కాక! అమ్మ మంచిది కాదా?”  “మంచిది శివ.”  “పున్నమ్మ చెప్పింది అమ్మ మంచిది కాదు, వచ్చి […]

Continue Reading
Posted On :

అతడు (కథ)

అతడు –పద్మావతి రాంభక్త కొందరంతే అందమైన అట్టున్న పుస్తకాలను కొత్తమోజుతో కాలక్షేపానికి కాసేపు తిరగేసి బోరు కొట్టగానే అవతల విసివేస్తారు.ఇతడూ అంతే.అయినా నేను అతడిలా ఎందుకు ఉండలేక పోతున్నాను.అతడు నా పక్కన ఉంటే చాలనిపిస్తుంటుంది.అతడి సమక్షంలో ఉంటే చాలు, నా మనసంతా వెన్నెల కురుస్తుంది.ఒక సుతిమెత్తని పరిమళమేదో చుట్టుముడుతుంది.ఆలోచనలలో పడి సమయమే  తెలియట్లేదు.బండి చప్పుడైంది. గడియారం వైపు చూస్తే అర్ధరాత్రి పన్నెండు కొడుతోంది. ఊగుతూ తూగుతూ అతడు ఇంట్లోకి వచ్చాడు.ఇప్పుడిక ఇదివరలోలా గోల చెయ్యడం మానేసాను. నెమ్మదిగా […]

Continue Reading
Posted On :