లైఫ్ టర్నింగ్ టైం

-కె.రూపరుక్మిణి

అదో అందాల ప్రపంచం అందు తానో వెన్నెల దీపం ఆ తండ్రి కాపాడుకునే కంటిపాప ….తన కూతురి కోసం తన ఛాతిని పట్టుపరుపుగా మార్చుకునే అంత ప్రేమ తన పట్టుకొమ్మ కోరింది నెరవేర్చాలని ఆశ…. ఓ మధ్యతరగతి తండ్రిగా ఏ ఆవేదన తన కూతురిని అంటకుండా పెంచుకునే ఓ తండ్రి కి కూతురిగా గారాలపట్టి గా ఆఇంటి మహాలక్ష్మి గా పిలిచే వల్లి పేరుకు తగ్గట్టు గానే చక్కని రూపం చదువుల్లో ఆటల్లో అన్నింటా ముందేఉంటుంది.

తండ్రిని సంతోషంగా చూసుకోవడమే తన కర్తవ్యం అని చెప్పే తల్లి అంటే ఇంకా మక్కువ ….మన లక్కీ గర్ల్ వల్లి కి……చూస్తూ వుండగానే పద్దెనిమిది ప్రాయంలో కి అడుగు పెట్టింది…ఆ ముద్దుగుమ్మను చూసి ముచ్చటపడని వారు వుండరంటే అతిశయోక్తి కాదేమో అందానికి టాలెంట్ తోడైతే అందరి దృష్టి ఆకర్షించడం చాలా సహజం అంతే సహజంగా ఆడపిల్లను అంత చురుకుగా చూసి మనసు పారేసుకోని వారుండరు వయసుకు తోడైన అందం ఆ అమ్మాయి చుట్టూ తెలియకుండానే ఓ మాయ వల ఏర్పడిపోయింది ……ఆ వలయం ఎంత బలమైనదో అంత బలహీనతల్ని చేర్చుతుంది …..కాలంతో ప్రయాణిస్తున్న ఆ కుటుంబం  ఆడ మగ స్నేహాన్ని ఏనాడు అభ్యంతరం చెప్పలేదు కారణం తమ కూతురి పైన వారి నమ్మకమే అన్నింటికీ కారణం …..వల్లి తన స్నేహితులని ఇంటికి పిలుచుకోవడం వారితో జరిగే ప్రతి సంభాషణను తండ్రితో చర్చించడానికి ఏ మాత్రం సందేహించేది కాదు కాని ఒక రోజు తన కూతురు చెప్తున్న విషయం విని నిర్గాంత పోయాడు తండ్రి …

వల్లి చెప్తుంది తనతో కాలేజిలో చదివే ఫైనల్ ఇయర్ అబ్బాయ్ లవ్ ప్రపోజల్ పెట్టాడు అని …. అతను ఒక మంచి కుటుంబం నుండి వచ్చాడు పొలిటికల్ అండ్ బిజీనెస్ బాక్ గ్రౌండ్ వున్నవాడు అని …అందువల్లే అందుకు తనకి 6 మంత్స్ టైం ఇచ్చాను అని ఇప్పుడే ఒకే చెప్పను అని ఇంతలో ఆ అబ్బాయి తనకు సంబంధించి అన్ని విషయాలు తనతో షేర్ చేసుకోవాలి అని చెప్పినట్లు … వివరించింది ఇంకా ఇలా మరో 2 ప్రపోజల్స్ వచ్చాయి అని అందులో తనకు ఇది బెస్ట్ అనిపించింది అందుకే అతనితో లైఫ్ షేర్ చేసుకుంటాను అని చెప్పింది.

నిర్ఘాంతపోవడం తల్లితండ్రుల వంతైపోయింది ఇక్కడ

ఒక విషయం వాళ్ళకి అర్ధం అవలేదు ఓ ఫైనల్ ఇయర్ చదివే అబ్బాయి ఏమి నిరూపించుకోగలడు ఎలా నిరూపించుకో గలడు ….తన కూతురి దగ్గర ఎంత ఆలోచించిన ఆ తండ్రికి తట్టనే లేదు అదే విషయాన్ని అడగాలనుకొని అడగలేక మౌనం వహించారు…కానీ వల్లి ని అలా చూస్తూ వదిలివేయలేని తండ్రి తనకుతురుని ఆ అబ్బాయి ని పరిచయం చేయమని అడిగాడు…తడుముకోకుండా వల్లి రేపు వస్తాడులే నాన్న అని తన గదిలోకి వెళ్ళిపోయింది…కానీ హర్ష కి రాత్రంతా నిద్ర కరువై పోయింది తన కూతుర్ని ఎలా దారికి తెచ్చుకోవాలి తన గారభమే తనను ఇలా నిర్ణయించుకునే లా చేసిందా అని

కుల, మతాల …పోకడలు తెలియని వయసు ఎలా అనుకుంటూ వేదనలో ఉండి భార్యను అడుగుతున్నాడు నేనేమైన తప్పుచేసానా ?? అని అలా అనాలోచితంగానే భార్యను తీసుకొని తన తల్లి దగ్గరికి వెళ్ళాడు ….అన్నీ విన్న ఆ మాతృమూర్తి కొడుకుని దగ్గరగా తీసుకుని హర్ష నీవు ఈ మారుతున్న సమాజంలో నీవు నీ కూతురికి కావలసిన స్వేచ్ఛను ఇచ్చావని అనుకుంటున్నావు …కానీ ఇప్పటి వరకు నీవు నీ కూతురికి ఇచ్చింది ఓ బాధ్యత కల్గిన ప్రతి తండ్రి ఇచ్చిందే …వల్లి కి ఇప్పుడు నీ అవసరం ఉంది తనకు తన జీవితాన్ని నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలి అలాగే తన భవిష్యత్తుకు భరోసాని ఓ తండ్రిగా ఇవ్వగల్గాలి మంచి చెడు ల తారతమ్యాలని గమనించే ధైర్యం ఇవ్వాలి అప్పుడు నీవు ఇన్ని సంవత్సరాలుగా ఆదర్శంగా పెంచుకుంటున్న అనే నీ అభిప్రాయానికి విలువ ఇచ్చిన వాడివి అవుతావు….అని అతని తల నిమిరి బాధ్యతలకు భరోసాని అందించింది ఆ తల్లి మనసు….

హర్ష తెల్లవారుతుండగానే వల్లిని తీసుకొని బయలుదేరాడు…వల్లి అడుగుతూనే ఉంది దారి పొడవునా ఎక్కడికి నాన్న మన ప్రయాణం అని అందుకు హర్ష మౌనమే సమాధానం గా ప్రశాంతం గా వుండు తల్లి నిన్ను ఒక వ్యక్తి దగ్గరకు తీసుకెళ్తాను అని అక్కడ నుండి వచ్చాక నువ్వే చెప్పుదువు.

కానీ ఆ సమాధానం నచ్చని వల్లి చిరాకును ప్రదర్శించింది ….ఇంతలో కారు ఓ ఇంటి ముందు ఆగింది …ఆ ఇల్లు  చూడడానికి చాలా హుందాగా ఉంది ఆ ఇంటిలోకి ప్రవేశించడానికి తన తండ్రి చాలా సేపు ఎదురు చూడవలసి వచ్చింది ఆ ఇంటి మనుషులు తన తండ్రిని చీదరించుకోవడం వల్లి దృష్టిని వీడి పోలేదు…దాదాపు గంట సమయం తరువాత పెద్ద వయసు ఉన్న ఆరోగ్యంగా హుందాగా ఉన్న వ్యక్తి వచ్చి ఎరా ఇన్ని రోజులకి నా అవసరం గుర్తుకు వచ్చిందా నీకు అంటూ తన తండ్రిని ఓ గదిలోకి తీసుకెళ్లాడు వెనుకే వల్లి ని కూడా పిలిచాడు హర్ష …ఆ గది నిండా నిశ్శబ్దాన్ని గంబిరంగా మోస్తున్న శబ్దం

ఆ పెద్ద మనిషి అడుగుతున్నాడు ఎలా ఉన్నారు ..ఇన్నాళ్ల తరువాత ఇక్కడకు రావలసిన స్థితి ఏమిటి.?  అని..నా నీడ కూడా పడకూడదు అని వెళ్లిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు అంటూ ప్రశ్నించాడు… వల్లి ఆశ్చర్యంగా భయం గా చూస్తుంది అక్కడి వాతావరణం ఆమెకు భయాన్ని కలుగ చేస్తుంది ఆ మాట తీరుకు ….చిన్నగా హర్ష అసహన మైన గొంతుతో నా కూతురికి నా జీవితం లోని ఇంకో కోణం పరిచయం చేయాలని వచ్చాను …అన్నాడు అప్పుడు చూసాడు ఆ వ్యక్తి తేరిపారా వల్లిని చూస్తూ మీ అమ్మలాగే ఉంది లక్షణంగా  …అన్న అతని వైపు ఆశ్ఛర్యం గా చూసింది వల్లి అవును అమ్మలాగే ఉంది నా కూతురు ఇప్పుడు నా భయం కూడా అదే అని హర్ష కూతురికి దగ్గరగా వచ్చి రా అమ్మ ఇతను నీకు తాతగారు నాకు తండ్రి ….నాకు 4 ఏళ్ల వయసులో మీ నానమ్మను నన్ను వదిలి వెళ్ళిన పెద్దమనిషి ప్రభాకర్ గారు అంటూ పరిచయం చేశాడు …దానికి ఆ పెద్ద మనిషి హర్షకి  తండ్రి స్తానం లో ఉన్న ప్రభాకర్ కి ఒళ్ళు మండిపోయింది ..అవును నా అవసరం లేదని వెళ్లిన వాళ్ళు నా నీడకూడా తాకకూడదు అనుకున్న వాళ్ళు ఇప్పుడెందుకు ఈ పరిచయాలు అని గట్టిగానే అన్నాడు… నా కూతురికి నిన్ను పరిచయం చేయాలని తీసుకు వచ్చాను అంతే మరింకేమి లేదు…అని అక్కడ నుండి వల్లిని  తీసుకుని వచ్చేశాడు హర్ష…..వల్లి కి ఏమి అర్ధం కాకుండా ఉంది ఎందుకు ఇన్నిరోజులు తాతగారు దూరం గా వున్నాడు … నానమ్మతో ఎందుకు లేడు అని…ఎప్పుడు తనని చూడడానికి కూడా ఎందుకు రాలేదు..!! ఇలా రక రకాల ప్రశ్నలు నిండిపోయింది వల్లి మనసు కానీ కందిపోయిన తండ్రి మొహం చూసి అడిగే ధైర్యం లేక మౌనం వహించింది

హర్ష  చెప్తున్నాడు మీ నానమ్మ  మెడిసిన్ లో టాప్ ర్యాంక్ సాధించి హైదరాబాద్ లోనే  జాయిన్ అయ్యింది  అక్కడే తనకు పరిచయం అయిన ప్రభాకర్ని పెళ్లిచేసుకుంది  లైఫ్ లో చదువు పూర్తికాకుండానే ఇద్దరు ఒకరిని ఒకరు కావలనుకొని చేసుకున్న పెళ్లికి పేద్దల అంగీకారం లేక పోవడం వలన కులాల అంతరాలతో వాళ్ళని ఎవరూ ఆదరించలేదు.   ఇద్దరు ప్రయివేటు ఉద్యోగంలో పనిచేసినా గడవని స్థితి ఈ లోపు నేను (హర్ష) పుట్టడం ఆర్ధికంగా నిలదొక్కుకోలేకపోవడం సామాజిక  ఒంటరితనాన్ని భరించలేక ప్రభాకర్ కుటుంబ సభ్యుల ప్రోద్భలంతో తన మేనమామ కూతురిని పెళ్లిచేసుకొని స్థిరపడడానికి  సిద్ధపడి మీ నానమ్మని ఒప్పించాలని ప్రయత్నించాడు కానీ ఆత్మాభిమానన్ని చంపుకోలేక అతనిని వదిలి వచ్చేసింది….

కానీ

ఎప్పుడూ ప్రభాకర్ కొడుకు కోసం గాని భార్య కోసం కానీ రాకపోవడంతో….ఒంటరి స్త్రీగా తన తల్లి ఎన్ని సమస్యలు ఎదురైనా హర్ష ని చదివించుకొని జీవితాన్ని ఎలా ఓడి గెలిచిందో వ్యక్తిత్వాన్ని ఎలా నిలుపుకుంది వల్లి కి చెప్తుంటే కన్నీటి పర్యంతం అయిందివల్లి…

హర్ష చెప్తూనే వున్నాడు వల్లితో ఇంకోమాట తల్లి *ఇక్కడ నేను ఎవరిని తప్పుపట్టడం లేదు ఎవరి స్థితికి వారు న్యాయంగానే వున్నారు కానీ *పరిస్థితులు అనుకూలించని కాలంలో కూడా తొడునిలబడేవాడే నిజమైన తోడు* నీకు రావాలని నాఆశ* అర్ధం చేసుకుంటావానుకుంటున్న అని ముగించాడు

ఇప్పుడు వల్లికి ఒక్కో విషయం అర్ధమవుతుంది తాను ఎంత పిచ్చి పని చేయబోయానో అర్ధమైంది  లైఫ్ లో స్థిరపడకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తనకు కుటుంబం అవసరం ఎంత ముఖ్యమో తనకు నానమ్మ జీవితమే పెద్ద ఉదాహరణగా చూపించిన తండ్రి ని గర్వంగా చూసుకుంది  తాను పుట్టి పెరిగిన మనుషుల మద్య ప్రేమను మాత్రమే చూసిన తనకు తన తండ్రిగా ఓ కొడుకుగా ఓ భార్యకు భర్తగా   అతను అందించే  ప్రేమకు పునాది ఒకనాటి నానమ్మ జీవితమే అని తెలుసుకోలేక పోయిన తన అమాయకత్వానికి నవ్వుకుంది…..

ఆ నవ్వుని చూసిన హర్ష కి  ఊపిరి పీల్చుకున్నట్లుగా ఉంది తన కూతురు ఏ తప్పు నిర్ణయం తీసుకొదు. అలాగే తానే నిర్ణయం తీసుకున్నా అది తనకు సమ్మతమే అని…ఓ ఆడపిల్ల తండ్రిగానే కాదు బాధ్యతలను తెలుసుకున్న బిడ్డకి తండ్రిగా గుండెల్లో ధైర్యం చిరు మందహసమై మెరిసింది.

వల్లికి కూడా లైఫ్ టర్నింగ్ టైం లో మనసునిండా తండ్రి అందించిన భరోసాతో ఉప్పొంగిపోయింది.

****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.