పునాది రాళ్ళు

-డా||గోగు శ్యామల 

నా పీహెడీ టాపిక్ : “తెలంగాణ దళిత జీవిత చరిత్రల  ద్వారా కుల చరిత్రల అధ్యనం” ఈ పరిశోధనలో ఐదుగురు మహిళను ఎంపిక చేసుకున్నాను.  వీరి జీవితాలను కొన్ని సిద్దాoతాల వెలుగులో కొంత లోతుగా అధ్యయనం చేయాలనుకున్నాను.   ఈ అధ్యయనం ఇంకొంత విస్తృతo చేస్తూ ఇంకా కొంతమంది అణగారిన జాతుల, వర్గాల, ప్రాంతాల స్త్రీల జీవిత చరిత్రలను కూడా  రాసి ఇందులో చేర్చాలనుకుంటున్నాను.

ఇంకా, ఈ పరిశోధనలోని ఐదుగురు మహిళల అంశానికొస్తే-వీరు, వీరి నేపథ్యం:-

1. కొదురుపాక చిట్యాల చిన్న రాజవ్వ (–2016)దళిత మాదిగ,  ఎనుకటి కరీంనగర్ జిల్లా ఇప్పటికి సిరిసిల్ల జిల్లా. భూమి కోసం పోరాటం చేసిన చరిత్ర.

2. చందన్ కోటి హాజమ్మ(1977— )దళిత మాదిగ, ఈమె ఉట్కూరు గ్రామం, మహబూబ్ నగర్. జోగినీ వ్యవస్థ వ్యతిరేక పోరాట   చరిత్ర.

3). టి ఎన్ సదాలక్ష్మి (1928-2004) దళిత మెహతర్, రాజకీయ నిర్ణయాదికార విధాన ( పాలసీ మేకింగ్) క్రమంలో కులం జెoడర్ యొక్క ఆధిపత్య రాజకీయాలతో పోరాడిన చరిత్ర.

4).జెట్టి ఈశ్వరి బాయి (1918-1991) దళిత మాల. అంబేద్కర్ స్థాపించిన అల్ ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎం ఎల్ ఏ.  ఆంధ్రప్రదేశ్ లో ఏకైక అంబేదరై ట్ అనే పేరున్న నాయకురాలు ఈమె. అధికార రాజకీయాల్లో కుల పితృ స్వామ్య ప్రాంత ఆదిపత్యాలకు వ్వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఈమెది.

5). చిందు ఎల్లమ్మ (1914-2005) మేటి కళాకారినిగా సుదీర్ఘ కాలం కొనసాగిన క్రమంలో నిరంతరం చిందు కళా సంవాదం రూపం లో కుల పితృ భూస్వా మ్య అధిపత్యాలను వెతిరేకించిన చరిత్ర. 

 .– గ్రామీణ భూస్వామ్య గడి పెత్తనానికి  వ్యతిరేకంగా, భూమి పై హక్కు కోసం, మార్కిస్టు లెనినిస్ట్ పార్టీ యొక్క అనుబంధ రైతుకూలీ సంగం, మహిళా సంగం నాకురాలు.  దళితులు మరియూ ఊరు లోని అన్ని కులాల ప్రజలకోసం వారికీ భూమి పట్టా దాక్యూమెంట్స్ కోసం పోరాడింది రాజవ్వ. 

 –చిన్న వయసులో  బలవంతంగా జోగినీ చేయబడి    దౌర్భాగ్య పరిస్థితి ని ఎదుర్కొని  మాములుగా తాను వివాహం చేసుకోడానికి  పెద్ద యుద్ధం చేసింది. మిగితా స్త్రీ లు జోగినీ వ్యవస్థ నుండి విముక్తి కావడం కోసం కులం మతం పేరుతో దళిత స్త్రీలపై జరుగుతున్న లైoగిక దోపిడీ నిర్ములన కోసం నేటికీ  పోరాడుతూనే ఉన్నది. 

వీరి జీవిత చరిత్రలను  అధ్యయనం చేయడానికి కార్లో జీన్స్ బర్గ్  ప్రవేశ పెట్టిన మైక్రో థియరీ సూక్ష్మ సిద్ధాంతం,  కిమ్ బెరిలీ క్రింష్వా రూపొందించిన “ఇంటర్ సెక్స్ ణాలిటీ ” సిద్ధాంతంను,  షర్మిల రేగే రుపొoదించిన “దళిత్ విమెన్ స్టాండ్ పాయింట్ ” మరియూ డా. భీమ్ రావు  అంబేద్కర్ రూపొందించిన “గ్రేడెడ్ ఇన్ ఈ క్వాలిటీ ” సిద్ధాంతాలను ఈ పరిశోధనలో ఉపయోగించడమైంది.

ఈ సిద్ధాంతాల ప్రకారం వీళ్ళు ఓడి పోయిన బాధితులు కాదు అలాగని గెలిచిన విజేతలూ కాదు. కానీ తమకు ఏ యొక్క అవకాశం లేకపోయినా చీకటి ఇరుకు సందు జీవితాలతో నిరంతరం తమ జీవితపు చివరి రోజుల వరకు  పోరాడుతున్న దళిత మహిళలు వీరు. 

కావునా,  వీరిని ఆధునిక చరిత్ర నిర్మాతలు అని చెప్పవచ్చు. వీరి జీవితాతానుభవాల్లోని కులం  జండర్ అణిచివేత, అనుభవాలు, రాకీయాలతో పాటు వారి ప్రాంతం, కుటుంబం, కమ్మూనిటీ,  మరియు మొత్తం సమాజం నేపధ్యంను వివరణాత్మకంగా పొందుపర్చడమైంది.

చరిత్రను పునర్ నిర్మించడం లో  భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మహిళల జీవితాల ను “నెచ్చెలి” వెబ్ సంచికలో కాలం రాయడానికి  అవకాశాన్నిస్తున్న డా|| కె. గీత గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

*****

(వచ్చే సంచిక నుండి ప్ర్రారంభం)

Please follow and like us:

3 thoughts on “పునాది రాళ్ళు-1”

  1. చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు, శ్యామల గారు.
    సమాజం విభజన ప్రక్రియలో, పురోగమనం సాధించినా దాని ప్రయోజనం భావితరాలకు ఉపయోగం లేదు.
    అందరినీ కలుపుకొని సాధించే దిశగా ప్రయత్నం చేస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు.

    నెచ్చెలి లో share చేస్తున్నారు, చాలా సంతోషం.

  2. చదువుతాను తప్పకుండా

  3. ఈ విధంగా మీ ధీసిస్ ని చదివే అవకాశం కలిగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు డా. శ్యామల అక్క.

Leave a Reply to Dr. Suresh Kumar Digumarthi Cancel reply

Your email address will not be published.

Please follow and like us:

Leave a Reply to Dr. Suresh Kumar Digumarthi Cancel reply

Your email address will not be published.