పునాది రాళ్లు-12

-డా|| గోగు శ్యామల 

కుదురుపాక రాజవ్వ కథ

 చిట్యాల చిన రాజవ్వ చెప్పిన  భూమి కోసం నడిచిన వేదన కథ ఇది .  నడిపించిన భూమి పోరాట కథకు ముగిపింకా పలుక లేదు.   కానీ, ముగింపు పలికెలోపే కథ చాలా మలుపులు తిరిగింది.  భూమిని తమ ఆదీనం లో బిగపట్టుకున్న వెలమ భూస్వాములే ఈ మలుపులకు, విద్వాంసాలకు అసలు కారకులు. ఈ నేపథ్యంలో, నాటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి విధానాలను కుదురుపాక  గ్రామం నేపథ్యంలో చూడాల్సి ఉంది. నిజాం కాలం నుండి ‘ఇనాం భూములు  ‘ పేరుతో ఉన్న భూములు కుదురుపాకలోని మాదిగ మాల,  ప్రజల సాగులో ఉండాల్సింది పోయి దొర కబ్జాలో ఉన్నాయి . ఆ భూముల్లోనే వీరు వెట్టి గాయిదా పని చేస్తున్నారు. తమ సొంత భూముల్లోనే తాము   వెట్టి గాయిదలుగా,  పూట కూలి బానిసలుగా, పొట్ట గంజి జీతగాళ్లుగా  చేస్తున్నారని బుద్ది జీవులకు ఎవ్వరికైనా ఇట్టే అర్థమౌతుంది.  భూమి- పట్టా- ధాన్య ఉత్పత్తి – ఆహార భద్రత- శ్రమ – దొర తనం అనే అంశాలన్నింటితో కులం ఎట్లా ముడిపడి ఉందో  కుదురుపాక గ్రామా ఎస్సీల  స్థితిని  బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే మాదిగ మాలోళ్లకు హక్కులు స్వతంత్రం అనే పరిజ్ఞానం చైతన్యం అలవడింది. కనుకనే  ‘మాభూములను మేము దున్నుకుంటాం’ అని స్పష్టంగా నిలబడ్డారు.  దొరలు ఎంత బలవంతులైనప్పటికీ వారు అన్యాయస్తులే. తాము భూమిని కోరడమే న్యాయం. అందుకోసం గట్టిగా నిలబడాలనుకున్నారు. సమయం కోసం దాదాపు చూశారు. ఆ రకంగా అన్నల   మద్దతు తీసుకునే అవకాశం వారికొచ్చింది. అన్నల పార్టీతో అనుబంధ సంఘాలతో కలిసి భూమికోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. భూమికోసమే కాకుండా కుల వివక్షకు అత్యాచారాలకు వ్యతిరేకంగా గ్రామంలోను చుట్టుపక్కల గ్రామాలలోనూ కార్యక్రమాలను   నిర్వహించారు, పాల్గొన్నారు.  ఈ పోరాటం మొత్తం కూడా ఊరులోని ప్రతి ఎస్సీ తొమ్మిది కుంటల భూమికి పట్టాదారు కావాలనీ, ఆ భూమిలో గౌరవంగా వ్యవసాయం చేసుకోవాలని, తమ పిల్లలకు  మూడుపూటలు తిండి కడుపునిండా తిండి పెట్టుకోవాలని,  బడికి పంపించుకోవాలని ఎస్సీలు , వీరితో పాటు మిగితా  బీసీ ఉత్పత్తి కమ్యూనిటీల వారు కూడా అన్నలతో కలిసి వివిధ రూపాల పోరాటం చేశారు.  ఎం ఎల్ పార్టీ మాత్రం ఈ   పోరాటాలన్నీ విప్లవం కోసం జరుగుతూ ఉన్నాయి, జరిగాయని ప్రధానంగా నిర్వచించింది. ఇదిలా ఉంటె, అసలు నక్సలైట్ పార్టీ కుదురుపాక గ్రామానికి ఎట్లా పరిచయం అయింది ? ఎవరు  గ్రామానికి అన్నలను తీసుకొచ్చారు. ? అనే ప్రశ్నలకు జవాబులు చాలా ఆశ్ఛర్యoగాను,   ఆసక్తికరంగాను ఉన్నాయి. రాజవ్వ పెద్దకొడుకు దుర్గ మల్లయ్య  చెప్పిన ప్రకారం ” మొట్ట మొదట కుదురుపాక గ్రామానికి అన్నలను తీసుక వచ్చింది భాస్కరరావు అనే వెలమ దొర. ఈయన వెంకట్రావు అధీనంలో  ఉన్న ఎస్సీల భూమిని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు.” అని వివరించాడు.   ఈ భూమిని ఎస్సీలకు పంచడానికి నాకు  సహకరించాలని  ఎం ఎల్ పార్టీని  ఆశ్రయించాడు. ఇంకో వైపు ‘ మీకు భూమి దక్కడానికి నేను మీకు సహయం  చేస్తాను’ అని ఎస్సీలకు హామీ ఇచ్చాడు. ఆ రకంగా  ఎస్సీల భూమిని,  అదే భూమిలో (అంతకు ముందు  వెంటరావు దొర దగ్గర వెట్టి చేసినట్లే)  వెట్టిచేయడానికి  మాదిగ మాలలను తన అధీనంలోకి తెచ్చుకొని ఊరు దొరతనం తన వైపు తిప్పుకోవాలనుకున్నాడు భాస్కరరావు.  అట్లా ఎం ఎల్ పార్టీ ఎస్సీ ల భూమి డిమాండ్ కు   మద్దతునిచ్చింది. భాస్కరరావు దొర కూడా ఎస్సీలకు మద్దతునిచ్చిండు. వీరిరువురి మద్దతు కారణంగా ఎస్సీలు  పోరాట తీవ్రతను కొంచెం  పెంచారు.  దీనిని ససేమిరా ఒప్పుకోలేని వెంకటరావు దొర  తోటి దొరను  పక్కకు పెట్టి , తన దొర తనాన్ని నిలుపుకోడానికి ఎస్సీలఫై పగబట్టి తీవ్రమైన దాడులు చేయించాడు. ఈ దాడులు చేయడానికి ప్రభత్వ యంత్రంగాన్ని, పోలిష్ వ్యవస్థను సంపూర్ణoగా   ఉపయోగించాడు.  ఇంతటితో ఆగలేదు.  కరీంనగర్ తో సహా  ఉత్తర తెలంగాణాలోని అగ్రకుల  దొర తనాన్ని,

 భూస్వామ్య విధానాన్ని నిలపడానికి నాటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభూత్వం  పూనుకున్నది. అందుకోసం 1979సం.లో  అక్టోబర్ 10 వ తేదీ నాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కల్లోలిత చట్టాన్ని రూపొందించింది.  అప్పటి వరకు పోరాడిన దొర గడీల బాధిత ప్రజలనందరిని పిల్లా జల్లా  ఆడ మగ తేడా లేకుండా ఫై చట్టం కింద అరెస్టు  చేసి జైల్లో పడేశారు. అదేకాలంలో పంచవర్ష ప్రణాళికలు , గరీబీ హటావో వంటి  అభివృద్ధిని ఎజెండాగా నాటి కాంగ్రెస్ ప్రకటించిందని గుర్తించుకోవాలి. కానీ,  కరీంనగర్ కుదురుపాక గ్రామ  ప్రజల ఆర్థిక సామాజిక దైనందిన సమస్యలను ఏమాత్రం పట్టించుకోకుండా దొరలనందరినీ, దొర తనాన్ని, కుల వ్యవస్థను  ఆసాంతం కాపాడి ప్రజల నందరినీ జైల్లో పెట్టింది. వెంటరావు దొర ఎజెండా ఈ రకంగా నెరవేరింది.  ఇక ఎంఎల్ పార్టీ ఎజెండా విషయానికొస్తే, ఎస్సీ బీసీ ల ఇనాం భూములకై పోరాటం, ప్రజలెదుర్కొంటున్న మిగితా సమస్యలు  వెట్టి చాకిరి, అత్యాచారాలకు వ్యతి రేకంగా చేయవలసిన  పోరాటాలు చేయడం  అప్రధానమైనమైంది. నూతన ప్రజాస్వామిక విప్లవ  కోసం ప్రజలను సైనికులుగా తయారు చేయడంలో భాగంగా దళాలను తయారు చేయడం మొదలు పెట్టింది. ఆరకంగా  చాలామంది చిన్న పిల్లలను యువతను  దళా ల్లోకి రిక్రూట్  చేసే పని ప్రధానంగా చేసింది. ఫలితంగా వేలాది మంది ప్రజలు ఎన్ కౌoటర్ల పేరుతో చనిపోయారు, జైళ్లు కేసుల పాలైయ్యారు.  ఈ కోవకు చెందిన చావులూ కేసులు తెలంగాణా ప్రాంతంలోని జిల్లాల నుండి చాలా  గ్రామాలకు విస్తరించాయి. ఇంకా ఎంఎల్ పార్టీ బాస్కరరావుల విషయానికొస్తే  పెద్ద దొరను ఢీ కొనాలంటే చిన్నదొరతో జతకట్టాలి. లేదా ఇద్దరు శత్రువుల మధ్య ఉన్న వైరుధ్యాన్ని వాడుకోవాలనే వైరుద్యపు సిద్ధాంతంతో కలిపేసి సరిపెట్టుకుంది. ఇంకా భాస్కరావు ఎజెండా విషయానికొస్తే,  అటు ఎంఎల్ పార్టీ ఇటు ప్రజల ‘శ్రేయోభిలాషి ‘అనే పేరును సంపాదించి తన దొరతనాన్ని ఇంకొంచెం పెంచుకొని వెంకటరావు దొరను కొంత బయపెట్ట గలిగాడు. చివరగా కుదురుపాక గ్రామ ప్రజల, ప్రత్యేకంగా ఎస్సీ  ఎజెండా విషయానికొస్తే;   భూమికోసం, వెట్టి చాకిరీ  నిర్ములన  కోసం,  రోజువారి వేతనాల  పెంపుదలకోసం వీరి పోరాటం మొదలైoది.  చాలా కాలానికి వేతనాలు కొంతవరకు పెరిగాయి. వెట్టి చాకిరీ కొంత వరకు తగ్గింది. చాలా కాలం దూరప్రాంతాలకు పారిపోయారు .   కానీ భూములు మాత్రం దక్కలేదు. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.