కంప్యూటర్ భాషగా తెలుగు 

-డా|| కె. గీత

 

ప్రపంచ భాషల్లో  కంప్యూటర్ పరంగా గొప్ప వృద్ధిని  సాధించిన భాషల దిక్కుగా తెలుగు భాష గత దశాబ్ది కాలంగా వేగంగా  ప్రయాణం సాగించడం చెప్పుకోదగిన విషయమే కాదు, తెలీనివారందరూ తెలుసుకోదగిన విషయం కూడా. సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని తెలుగులో కమ్యూనికేషను అందరికీ అవసరమైన యుగంలో ఉన్న మనకు తెలుగు భాష ని కంప్యూటరీకరించడం వెనుక దాగున్న అనేక ఆసక్తికర అంశాల్ని పరిచయం చేస్తే బావుణ్ణన్న చిన్న సంకల్పమే ఇది.   

ఇక నా గురించి చెప్పాలంటే విజ్ఞానం అత్యంత పరిణతి సాధించిన,  ముఖ్యంగా కంప్యూటర్ రంగం దినదినాభివృద్ధి పొంది, అందరికీ అందుబాటులోకి వచ్చిన 21 వ శతాబ్దం లో పుట్టడం నా అదృష్టం గా భావిస్తాను.  అంతే కాదు నేను పాత , కొత్త తరాల ప్రతినిధిని కూడా. అంటే రాత ప్రతులు, టైపు మిషన్లు , కంప్యూటర్ల వరకూ తెలుగు భాష చేసిన సుదీర్ఘమైన ప్రయాణంలో నేనూ భాగస్వామురాలిగా ప్రయాణించే అరుదైన అవకాశం  నాకు లభించింది. భాషా శాస్త్రం పట్ల నాకు మక్కువ కలగడానికి కారణం చిన్నతనం నించీ ఇతర భాషల పట్ల, లిపుల పట్లా ఉన్నా ఆసక్తీ, అభినివేశం అంకురార్పణ కాగా, తొంభైల దశకం నుండీ తెలుగు సాహిత్యం, భాషా శాస్త్రం రెండు కళ్లుగా సాగిన నా విద్యాభ్యాసం దోహదపడింది.  భాషా శాస్త్రంలో పరమ పట్ట భద్రురాలిగా, నిత్య విద్యార్థినిగా, కంప్యూటర్ రంగంలో ప్రపంచంలోనే మొదటి స్థానాల్లో ఉన్న కార్పొరేట్ కంపెనీలకు తెలుగు భాషా నిపుణురాలిగా నా ప్రస్థానం, నిత్య జీవితం “తెలుగు భాష- కంప్యూటరీకరణ” కు సంబంధించిన వ్యాసాలు రాయడానికి బలం, ప్రోద్బలం  కలిగిస్తున్నాయి.   

వచ్చే నెల నుండీ నెచ్చెలిలో నెల నెలా ఒక్కొక్క విభాగాన్ని వీలైనంత విశదంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. భాషా శాస్త్ర ప్రేమికులకు, తెలుగు కంప్యూటరు రంగంలో పనిచేస్తున్న వారికే కాకుండా, తెలుగు భాషలో ఉన్నత విద్యాభ్యాసం చేసి  ఉద్యోగావకాశాల కోసం ఎదురు చూస్తున్న ఎందరికో ఈ ప్రయత్నం ఉపయోగపడగలదని ఆశిస్తూ- 

-మీ 

కె.గీత

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *