చిత్రం-3

-గణేశ్వరరావు 

ప్రకృతి దృశ్యాలు చూస్తూ న్యూ ఇంగ్లండ్ లో పెరిగిన గ్రేస్ మెరిట్ వాటి నుంచి స్ఫూర్తి చెందడంలో ఆశ్చర్యం లేదు, ఆమె చిన్ననాటి అనుభవాలే ఆమెని ఒక ఫైన్ ఆర్ట్ ఫోటోగ్రాఫర్ ని చేసాయి. జీవితం అన్నాక ఎవరికైనా ఒడుదుడుకులు ఉండకుండా పోవు . గ్రేస్ కూడా వాటి నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే ఆమె సృజనాత్మక శక్తి , కష్టాలనుంచి ఆమెను త్వరగా కోలుకునేలా చేసింది, ఆమె కెమెరాకన్ను ఎప్పుడూ రూప నిర్మాణంపైనే వుంటుంది, అదే ఆమెను కళా ప్రక్రియ దిశగా నడిపించింది. డిజిటల్ ఫోటోలు, డిజిటల్,మొబైల్ ఫోటో ఎడిటింగ్, pigmented prints ద్వారా ఆమె స్థలం, ప్రాతం, వస్తువులకి సంబంధించిన తన నైపుణ్యానికి  దార్శనికతను కనబరుస్తూ వచ్చింది . అది చూపరులకు ఆనందాన్ని కలగజేస్తుంది , వారిని తన ఊహాలోకాల్లోకి తీసుకొని వెళ్తుంది. వివరాలకూ, భావాలకూ ప్రాధాన్యమిచ్చే బ్రెస్సన్ కళా శైలిని అనుసరిస్తుంది. ఒక వస్తువు పడుతూన్న వెలుగు నీడల ప్రభావాన్ని అవగాహన చేసుకునేందుకు తన ఫోన్ కెమెరానే ఎక్కువగా వాడుతుంది. దృశ్యాలపై ప్రాధమికంగా ఫోకస్ చేసాక, పోస్ట్ ప్రొడక్షన్ లో వాటిని రసాత్మకంగా తీర్చి దిద్దుతుంది. కళా సృజన, పరామర్శ, ప్రశంసలు అందించే అనుభవం – కళాకారులకే కాక పరిశీలకులకు కూడా ఎంతో అవసరం, లాభదాయకం!

విల్లర్డ్ బీచ్ ప్రాంతంలో గ్రేస్ తీసిన ఫోటో ఇది.  ఈ బీచ్ కి ఉన్న ప్రత్యేకత – మన బీచ్ లలో కనిపించే ఇసుకలో ఆడుకునే పిల్లలు..ప్రేమ జంటలు ..పల్లీలు ఆమ్మే వాళ్ళు .. సందడి లేకపోవడం!  విశాలంగా పరచుకున్న సముద్రం .. .. అలలు లేకుండా నిలిచి వున్న నీరు .., మత్స్యకారుల ఇళ్ళు.. చేత్తో సంచీతో ఇంటికి వెళ్తూన్న ఒంటరి వ్యక్తీ .. .. ఫోటోలో పరుచుకున్న  నీలి- లేత ఆకుపచ్చ రంగుల మిశ్రమం .. వెలుగు నీడలు.. మధ్యలో కాంతి వలయం .. అసమానంగా అమరాయి . ఎప్పుడూ మారుతూ వస్తూండే దృశ్యాలలోని – ఒక క్షణం కనిపించిన దృశ్యాన్ని – గ్రేస్ ఒడిసి పట్టుకొని, ఇందులో నిలిపింది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.