పునాది రాళ్ళూ -6.

-డా|| గోగు శ్యామల 

 కుదురుపాక రాజవ్వ కథ

కుదురుపాక ఊరు దొర గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిందే. తనకున్న రాజకీయ ధనస్వామ్యాన్ని, అన్యాక్రాంతంగా పొందిన భూబలంతో తిరుగు

లేని ఆధిపత్యాన్ని నడిపేవాడు . ఆ రకంగా కుదురుపాక గ్రామంలో తలెత్తే ప్రతి  చిన్న వివాదాన్ని నిర్వహిస్తూ అక్రమ వసూళ్లు భూకబ్జా చేసెవాడు. ఆ విధంగా ఊరు లోని వివిధ కులాల మధ్య, అన్నతమ్ములు మధ్య, భర్త భార్యల మధ్య తలెత్తే వివాధాలను పరిష్కరించే పేరుతో డబ్బులు వసూల్  చేసేవాడు. ఈ వివాదాలు ఎక్కువగా భూమి కోసం తలెత్తేవి. కనుకనే 150 ఎకరాల సన్న కారు రైతుల భూమిని అక్రమoగా దొర తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతేకాక సబ్బండ వృత్తి కులాలకై కేటాయించిన మోటలబాయికాడి గుడ్డం అనే పేరుతో ఉన్న కామన్ ల్యాండ్ ను కూడా ఆక్రమించాడు. దీనితో  ఊరులోని పనిబాట కులాలకు బతకడానికి ఉన్న చిన్నఆధారం పోయింది. అనేది ఈ పేర్లను చుస్తే తెలుస్తుంది. ఇందులోనే శిఖం భూములు, పంచరాయ్, పోరంబోకు, గుడి భూములు, పద్మశాలి గుట్టలు, గొల్ల మందల భూములు.

ఈ భూమిలోనే మాల మాదిగలతో  బలవంతంగా వెట్టి చాకిరీ చేయించాడు కూడా. ఇదే రీతిగా వేరే దొరలు వేరే గ్రామాలల్లో నడిపించారు.  

ఈ నేపథ్యంలో కొదురుపాక  గ్రామం యొక్క నక్ష నిర్మాణాన్ని సాంఘీక ఆర్థిక భౌతిక కోణాల్లో చూడాల్సిన  అవసరముంది. ఇక్కడ సాంఘీక నక్షని ప్రత్యేకంగా పరిశీలిస్తే. దేశంలో ఎన్నో మార్పులు జరిగినప్పటికీ ఈ గ్రామము నిర్మాణంలో ఏ మార్పు జరగలేదని చెప్పాలి. సమాజంలో నిచ్చెన మెట్ల కుల అంతరాలను అన్ని గ్రామాల లాగానే  కుదురుపాక గ్రామానిర్మాణంలో చూడవచ్చు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఈ గ్రామం 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వివిధ కులాలు మరియు కమ్యూనిటీలు చాతుర్వర్ణాశ్రమ ధర్మ నిర్మాణంతో మిళితమై ఉన్నాయి. అన్నీ గ్రామాలలాగానే ఇక్కడ కూడా మొదటి మెట్టు  అంతరం ప్రారంభమయ్యేది బ్రాహ్మణులు నివసించే అగ్రహారం నుండే. ఆ తరువాత మెట్టుగా వందలాది ఎకరాల భూములు కలిగి ఉన్నరెడ్డి, వెలమ కులాఉన్నాయి. తరువాత వ్యాపారం వృత్తిగా ఉన్న వైష్యుల ఇండ్లున్నాయి. తరువాత మెట్టుగా వృతి నైపుణ్యం కలిగిన పనిపాట కమ్మూనిటీస్ఐన చేనేతలు, విశ్వకర్మ పంచదాయిలు,  ముదిరాజ్ ( అడవి నుండి దుంపలు పళ్ళు శేకరించే వారు ) కుమ్మరి, గొల్ల కూర్మ, మంగలి, చాకలిలు నివాసాలున్నాయి. మాల, మాదిగ, మరియు వీటి బంధు బలగాలు ఉప కులాలు చివరి అడుగు మెట్టున ఉన్నాయి. ఊరు అవతల వెలి వాడనే నీలోజి పల్లె పేరుతో కుదురుపాక ఊరుకు అనుబంధ పంచాయత్ గా కొనసాగుతుంది. ఇక్కడే రాజవ్వ నివాసం ఉంది. సాంఘీక నిర్మాణం ఇలా ఉంటె  కుదురుపాక భౌగోళిక స్వరూపం మరోవిధంగా ఉంది , సాంఘీక నిర్మాణానికి భిన్నంగా, ఎంతో ఆసక్తికరంగా ఉంది. ,పంటపొలాల పచ్చదనం ఊరును చుట్టేసినట్లు అందంగా ఉంటుంది. మధ్యమానేరు నది వాడకి ఆనుకోని పక్కపోoటి ప్రవహిస్తుంది. నీలోజిపల్లి వాడ కంఠానికి నగను అలంకరించినట్లు పారుతుంది. ఊరుకు పడమర వైపున ఉన్న బ్రాహ్మణ వాడకు మానేరు నది అనుకోని ప్రవహిస్తూనే అక్కడ నుండి కాస్త ఎడంగా జరిగినట్లు ప్రవహిస్తూ  ప్రవహిస్తూ తూర్పు చివరన ఉన్న మాదిగ వాడ వద్ద కు వచ్చి తాకుతూ ప్రవహిస్తుంది. గ్రామ కంఠానికి నగ చుట్టినట్లు అందంగా ఉంటుంది. ప్రకృతి వనరు అయిన నది అగ్రహారాన్ని మాదిగ వాడను కలిపిoది. మానేరు నది ఊరు వాడ యొక్క భౌగోళిక స్వభావానికి గొప్ప అందాన్నిచ్చింది. కానీ దీనికి భిన్నంగా సాంఘీక అంతరాల నిర్మాణం మాదిగ మాలలను తీవ్రమైన అణిచివేతల్లో ముంచింది. మా.మా. ప్రజలు వెలి వాడలో బతుకుతున్నప్పటికీ వారి వారి జీవితాలు ఆసాంతం గడి దొర నియంత్రణలో ఉంటాయని గమనించాలి. కుటుంబంలో పురుషులు పెద్ద జీతగాళ్లుగా  ఉంటె, స్రీలు వెట్టి పని ఆడోళ్ళుగా చాకిరి చేసుడు, పిల్లలు బాల వెట్టి జీతగాళ్ళు గా నియంత్రణతో కేటాయించ బడుతారు. వాడ సర్వ జీవితం అగ్ర కుల భూస్వామ్య దొర తనం చేతిలో ఉండడం కొనసాగింది. అంటరాని తనం ఒక్కటి మినహాయిస్తే సబ్బండ కళా నైపుణ్య ఉత్పత్తి కమ్యూనిటీల జీవన స్థితి కూడా అంతే. అస్పృస్యులు ఊరవతల ఎందుకు జీవిస్తారు ? అని వెలివాడ మీద అంబెడ్కర్ తన రచనలో ఇచ్చిన ఆసక్తికరమైన వివరణను ప్రశ్నలను చూడవచ్చు. ‘ అస్పృస్యులు ఊరవతల ఎందుకు జీవిస్తున్నారు ? ‘ వారు ఊరు నుండి విడగొట్టబడ్డారా ?’ వెలి వాడలు ఊరు అసమానతకు ప్రతీక అవుతుందా ?’  ” ప్రత్యేక నియమిత నివాసాలు వెలి వాడలుగా ఎందుకు ఎలా మారిపోయినాయి?” అన్నది వివరించాడు. చెరిత్రలోని కులవిభజన మను వాద రాజకీయాలను మరియూ అస్పృస్యుల పుట్టు పుర్వోతరాల చరిత్రను వెలుగులోకి తెచ్చాడు. స్వాతంత్య్రం తరువాత, నేటికీ వెలివాడలోని దళితులూ గ్రామాల్లోని వీధుల్లో నడవలేని స్థితే కొనసాగుతున్నది.      

కాని అదే ఊరులో  చచ్చిన పశువులను తీసేయడానికి,  మరుగుదొడ్లను సుబ్రం చేయడానికి దళితులే ప్రవేశించాలి.  కేవలం మరుగుదొడ్లు కడగాలనే వృత్తి కట్టడి మోపబడిన మెహతర్ దళిత  కమ్యూనిటీ ఊరి అగ్రకులాల మరుగు దొడ్లు సాపు చేయ ప్రతి ఇంటిలోకి వెళుతారు కానీ ప్రధాన ద్వారం ద్వారా కాకుండా ప్రత్యేకంగా నిర్మించిన దిడ్డి దర్వాజా ద్వారం ద్వారా మెహతర్  దళితులు గడి, బంగ్లా, ఇల్లులోకి వెళ్లి శుభ్రం చెయ్యాల్సిన విధానం నడిచింది. ఈ విధానం ఒక్క తెలంగాణా, ఆంద్ర ప్రదేశ్ లోనే కాదు భారత దేశం మొత్తం ఇదే విధానం నిరాటంకంగా కొనసాగుతుంది.   ఇక తెలంగాణ గడీలలో కొట్టొచ్చినట్లు కనిపించేది దిడ్డి దర్వాజా, ఇది గడి నక్షాలో వృత్తి కట్టడిని గడి గోడల ని ర్మాణంలో భాగంగా రూపొందించబడింది. వర్ణ కుల (ఆర్క్నటెక్చర్) ఊరు వాడ గడి దిడ్డి దర్వాజ మరుగు దొడ్లు నిర్మాణంలో భాగంగా రూపొందిందనే చెప్పాలి. ఈ నిర్మాణానికి కుదురుపాక గ్రామం  ఓ సజీవ ప్రతీకగా నిలుస్తుంది. దీనికి తోడు కులమడి శుచి అశుచి ఆధిపత్యకుల దురహంకారాలు కొనసాగుతాయి. ఫై విధానాలతో మిళితమైన ఆలోచనా విధానం, ప్రవర్తన అన్నీ కలసి ఓ భయంకరమైన ఆధిపత్యాన్ని, అంటరానితనాన్ని వెలివాడపై ప్రయోగిస్థాయి. అవి దొర, దొరసాని,పటేల్, పటేల్ సాని, కర్ణం, పోలిష్ పటేల్ రూపంలో ఉండి అంటరానితనాన్ని ఆధిపత్యాన్ని నెరిపారు. అలాంటి కథలే ఇవి. నల్ల జాతీయుల కథల కన్నా దీనమైనవి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.