కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)

                                                                –  ప్రొ|| కె. శ్రీదేవి

వీరలక్ష్మీదేవి

 

 “కొండఫలం మరికొన్ని కథలు” పేరుతో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ప్రచురించిన కథా సంపుటి  పుస్తకాన్ని స్త్రీ వాద చారిత్రక క్రమంలో Locate చేయాల్సిన అవసరం వుంది. అసలు ఏ రచననైన అమలులో వున్న సాహిత్యాన్ని, దానికి సంబంధించిన భావజాలాన్ని ప్రతిబింబించటంలోనూ, ముందుకు తీసుకుపోవటంలోనూ ఎంతవరకూ విజయవంతమైంది అనే దాన్ని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. మళ్ళీ చూసినప్పడు వాడ్రేపు వీరలక్ష్మీ దేవి  కథల్లో స్త్రీ వాదాన్ని అది ప్రతిపాదిస్తున్న భావాలను Reflect చేస్తుంది. 1980 ల తర్వాత స్త్రీవాదం, స్త్రీ రచన అప్రకటితంగా వున్న నిషేధాలను ధిక్కరించి సాహిత్యంలో ఎటువంటి సంకోచాలకి తావు లేకుండా స్త్రీలు తమకు సంబంధించిన ఎటువంటి సమస్యలను గురించయినా రాసే వాతావరణాన్ని ఏర్పరిచింది. ఇటువంటి భావ వాతావరణ కల్పనలో రంగనాయకమ్మ నుంచీ సత్యవతి, ఓల్గాల వరకు వున్న స్త్రీ రచయితలందరూ కృషి చేశారు. ఈ కృషికి కొనసాగింపుగా వెలువడిన కొత్త కథాసంపుటే వాడ్రేవు వీరలక్ష్మీదేవి “కొండఫలం”.

         తెలుగులో చాలా మంది కథకులకి వస్తు సంబంధిత పరిమితి చాలా తక్కువ. అలాగే భావజాలాల ప్రభావమూ ఎక్కువే. ఈ రెండు అంశాలు వాళ్ళ రచనల్ని(వాళ్ళు శక్తివంతమయిన రచయితలు అయినప్పటికీ) పరిమితం చేశాయి. తెలుగులో ఈ పరిమితుల నుంచి బయటపడి కథలు, విమర్శ వ్యాసాలు రాస్తున్న రచయిత  వాడ్రేవు వీరలక్ష్మీ దేవి. Open- endedness అనేది అది జీవితానికి సంబంధించినదైనా, భావాలకు సంబంధించినదైనా ఈమె రచనల్లో ఒక ముఖ్య లక్షణం. ఆమె కొత్త కథాసంపుటి “ కొండఫలం మరికొన్ని కథలు” ఏ పుస్తకాన్నైనా దాని ప్రాసంగికతను  అంచనా వేయటానికి అది అమలులో వున్న అసమ విలువల్ని ఏస్థాయిలో ప్రశ్నిస్తుంది, ప్రత్యామ్నాయ విలువల్నిఎంతవరకూ ప్రతిపాదిస్తుంది అనేది చూడాల్సి వుంటుంది. వాడ్రేపు వీరలక్ష్మీ దేవి తానే చెప్పుకున్నట్లుగా స్త్రీ వాద రచయిత. 1980ల తర్వాత స్త్రీవాదం సాహిత్యంలో, కథాసాహిత్యంలో కూడా అమలులో వున్న అప్రకటిత వస్తు నిషేధాన్ని అధిగమించి, ఎటువంటి అనివార్యత లేకుండా కథలు రాయగలుగుతున్నారు. వీళ్ళ రచనల్లో ఎక్కడ ఎటువంటి  Inhibitions లేవు. అందువల్లే కొండఫలం లాంటి సాధారణ సామాజిక సమస్యల నుంచి అత్యంత రాడికల్ ఆలోచనలున్న ‘ దీపశిఖ’ లాంటి కథలు ఈమె రాయగలిగారు. దీపశిఖ కథను రాడికల్ స్త్రీ వాద కథ అన్నా పర్వాలేదు. అమలులో వున్న అసంబంధ విలువల్ని సమస్యాత్మకం చేయటం, అందులో Operate అయ్యే ద్వంద్వత్వాన్ని  బహిర్గతం చేయటం, తద్వారా కొత్త విలువల ఆవిర్భావానికి దోహదకారి కావటం అనేది కాల్పనిక సాహిత్యం చేయాల్సిన అనేకానేక పనుల్లో ఒకటి. ఆ పనిని  వీరలక్ష్మీ దేవి ’దీపశి” కథలో చాలా సమర్థవంతంగా, ఎటువంటి సంకోచాలూ లేకుండా చేయగలిగారు. దీపశిఖ కథలో ఉజ్వల తల్లి “………. ఒక విలువని జీవితంలో సాధించాలంటే హింస అనుభవించక తప్పదని నాకు తెలుసు” అంటుంది. కథలో ఉజ్వల తల్లి ప్రత్యక్ష్యంగా కాక పరోక్షంగా, వేరే పాత్రల సంభాషణలనుంచి చిత్రించబడిన పాత్ర. ఈపాత్ర జీవితాన్ని సైధ్ధాంతికంగా కాక ఆచరణాత్మకంగా అనుభవాత్మకంగా నిర్వచించుకున్న పాత్ర. స్త్రీవాదం మొదలై మూడు దశాబ్దాలు గడిచినా వస్తు స్వీకరణ విషయంలో ఇంకా విస్తృతి సాధించలేదు. అలాగే సంప్రదాయ పరిష్కారాలు కాక so called అభ్యుదయ పరిష్కారాలు దాటి వెళ్ళటం లేదు. ఈ నేపధ్యంలో వీరలక్ష్మీ దేవి ‘దీపశిఖను’ పరిశీలించాల్సి వుంటుంది. ఈ కథ ప్రధానంగా ఒక కెరీరిస్టు అయిన భర్తగా వున్న స్త్రీ తనకు పద్దెనిమిదేళ్ళ వయసులో తను ప్రేమించిన, తాను ప్రేమించిన వ్యక్తి, గొప్ప భావకుడు, ప్రేమికుడు, గాయకుడు, మధురభాషి అయిన వ్యక్తిని పెద్దల్ని ఎదిరించ లేక దూరంగా  వుండిపోయిన నేపధ్యంలో , ఆ వ్యక్తిని తన అక్క బావల సహకారంతో  దగ్గరయి అతనితో కూడా ఒక పిల్లని  కని ఆ బంధాన్ని, అతనిని కలవటం సంవత్సరానికి నాలుగైదు రోజులు మాత్రమే అయినా, ఆ సంబంధాన్ని అపురూపంగా చూసుకుంటుంది. ఈ పాత్రను మలచటంలో రచయిత చాలా లోతైన అవగాహనను ప్రదర్శించటం జరిగింది. అమలులో వున్న నైతికతలోనుంచి చూసినప్పుడు ఆమె చేసిన పని అనైతికం. అది అవ్యక్త సంబంధం. వివాహేతర సంబంధం. నైతిక చట్రాలు వ్యక్తి అస్తిత్వానికి ముప్పుగా పరిణమించినప్పుడు దాన్ని అధిగమించటం అనేది అన్ని సమాజాలలో అమలయ్యేదే, ఆమోదింపబడేదే అయినప్పటికీ , ఈ అతిక్రమణం లైంగిక విషయాలకు సంబందించినదయినప్పుడు, మరీ ముఖ్యంగా ఆ అతిక్రమణ స్త్రీ చేసినప్పుడు ఆమెను తప్పు పట్టడం, నిలదీయటం పురుష కేంద్రక సమాజంలో సర్వసాదారణమై పోయింది. ఈ స్థితిలో స్త్రీలు తమ చర్యలను తాత్వికంగా సాధికారికంగా సమర్ధించుకోవటం అసాధ్యమైపోయింది. పురుషుడి ద్వంద్వ నీతి ఇక్కడ కూడా అమలవుతోంది. అందువల్ల స్త్రీలు ఈఅంశాలను అణచివేసి వుంచుకోవటం, నిజాయితీ ప్రదర్శించలేకపోవటం జరుగుతుంది. ఈకథలో ఉజ్వల అమ్మ ఇందుకు భిన్నంగా కన్పిస్తుంది. ఆమెకు ఎటువంటి సిధ్ధాంతమూ లేకపోయినప్పటికీ ఆమె ఆలోచన, ఆచరణ అనుభవ కేంద్రకం. ఆమె గురించి తన కూతురు ఉజ్వల అన్న మాటల్లో ఆమె స్వభావం తెలుస్తుంది. ఉజ్వల ఇలా అంటుంది “ మా అమ్మకి నువ్వు చెప్పే హక్కుల గురించి, సిధ్ధ్దాంతాల గురించీ తెలియదు. తన ప్రేమతో తాదాత్మ్యం చెందటం, దాని పట్ల గౌరవం కల్గి వుండటం మాత్రమే తెలుసు. ధైర్యస్థురాలు, నిజాయితీపరురాలు. ఈనిజాయితే ఆమెను ఎటువంటి భయ సంకోచాలు లేకుండా తన సంబంధం గురించి కూతురుతోనే కాక భర్తతో కూడా చెప్పేసింది. ఎవ్వరి ఇష్టా ఇష్టాలతో ప్రసక్తి లేకుండా తను చేయదల్చుకున్న పని నిజాయితీతోనే చేసింది. నిజానికి ఆమె తన పెళ్ళి తరువాత సమాధానపడి ఇంట్లో అన్ని ధర్మాలూ చేసింది, అన్ని భాధ్యతలూ మోసింది. అయితే ఆమెలో పాదుకున్న ప్రేమ భావనను చాలా మందిలాగా చంపుకోలేక పోయింది. దాన్ని శాశ్వతం చేసుకునే లక్ష్యంతోనే అతనితో కూతుర్ని కనింది. అతని ప్రేమ ఆమెను అధ్బుత చర్యలకు పురికొల్పింది. ఆమె మాటల్లోనే చెప్పాలంటే, ఆమెకు ప్రపంచాన్ని ఇంకా ప్రేమించాలనీ, తను మనిషిగా గొప్ప విలువని సాధించాలని భావించింది. అయితే కూతురి పుట్టుక గురించిన రహస్యం మాత్రం, కూతురితో మాత్రమే చెప్పింది. కపట లోకం ముందు తాను నిజాయితీ చూపాల్సిన అవసరం లేదని భావించింది. ఈసందర్భంలో  Kay Leiger Hagan అన్న మాటలు ఉదహరించటం అవసరం,

         “To survive in a misoqunaist  environment, a woman must learn how to protect innate female  power fun a society designed to destroy her it. After she learns to recognize and avoid male violence in its many forms, a woman’s capacity for her self. Love blossoms, and her female power begins to thrine: Creativity, vitality and confidence emerge, along with a refusal to subordinate herself to male power.”       Kay Leigher  

 

చెప్పినట్లుగా స్త్రీద్వేష సమాజంలో స్త్రీ తన సహజ శక్తి కాపాడుకోగల్గటం అవసరం. స్త్రీని, ఆమె అనుభవాన్ని నియంత్రిస్తున్న అనేకానేక సామాజిక నిర్మాణాలలో కుటుంబం ఒకటి. ఇది స్త్రీ సహజాతాలను, ప్రేమతో సహా అన్నింటినీ ద్వంసం చేస్తుంది. ఫలితంగా స్త్రీలకు తమ అస్తిత్వంలో అర్ధం కనిపించటం లేదు. అటువంటి అసంబధ్ధ జీవితాన్ని మోయలేని స్థితిలో స్త్రీలు separate peace  ని వెతుక్కుంటున్నారు. ఈ వెతుకులాటలో ఎదురయ్యే పర్యవసానాలకు కూడా వాళ్ళు సిధ్ధపడుతున్నారు.  ఆ సంసిధ్ధత వల్లే ఈ కథలో అమ్మ పాత్రలుగా వాళ్ళు నిజాయితీగా వుండటమే కాకుండా, అటువంటి నిజాయితీ జీవితంలో వుండాల్సిన అవసరాన్ని గురించి పిల్లలకు చెబుతున్నారు, అలాగే పెంచుతున్నారు. ఈ కథలో ఉజ్వల పాత్ర అలా పెరిగిందే. స్వచ్చమైన ప్రేమలో పుట్టి పెరిగిన వ్యక్తి ఎలా వుంటారో ఖచ్చితంగా అలా ఉజ్వల ఈ కథలో కనిపిస్తుంది. ప్రేమ సంగమం నుంచే ప్రేమించే సంతతి వస్తుందని ఉజ్వల అన్న మాటలు అక్షరాల నిజం.

        ఈ కథ చివరలో ప్రేమంటే ఏమిటో తెలిసేదాకా పిల్లలు వద్దు అనే ఒక ప్రకటన చేస్తుంది Narrator.  ఇది రాడికల్ ప్రతిపాదన అయినా, తప్పక ఆమోదించాల్సిన ప్రకటన.

       స్నేహం అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య పరస్పర వైయుక్తిక అవసరాల కోసం ఏర్పడేది కాదు, అందుకు భిన్నంగా సంస్కారాలు సారూప్యతల నుంచి ఏర్పడేది. ఆ విషయాన్ని ఈ కథలో narratorకు ఉజ్వలకి మధ్య వున్న సంబంధంలా చూపించటం జరిగింది. సంసార పరంగా narrator ఉజ్వలను ఆకర్షించటం ఆమె చైతన్యానికి కొత్త భావాలను అందుకోవటంలో వున్న సరళత్వానికి నిదర్శనం. Narrator కథలో ఎక్కడా కూడా భావోద్రేకాలకు గురికాకుండా చాలాబ్యాలెన్స్ డ్ గాచిత్రించటం జరిగింది. ఉజ్వల మీద అతార్కిక ఇష్టాన్ని పెంచుకోదు. ఉజ్వలలోని ప్రతి అంశాన్ని సునిశితంగా ఆమెతో సంభాషించటం లోంచి  గ్రహించిన తర్వాత ఆమెకున్న అభిమానం మరింత పెరుగుతుంది. అందుకే ఉజ్వలతో సంభాషించిన తర్వాత తనకు తాను “సహస్ర దళ పద్మంలా” వికసించినట్లు  భావిస్తుంది. 

         ఈ కథలో ప్రధాన పాత్రలు మూడే. ఆ మూడు కూడా స్వతంత్ర వ్యక్తిత్వమున్న పాత్రలు. వీటిని రూపకల్పన చేయటంలో రచయిత చాలా శ్రద్ద కనబరిచారు.  అన్నింటికన్నా అసలు కథలో ఎక్కడా ప్రత్యక్షంగా కనిపించని  ఉజ్వల తల్లి ప్రేమికుడు  పాఠకుల్ని తన విశేష సంస్కారంతో ఆకర్షిస్తాడు. తెర వెనుక వున్న ఆ పాత్ర మీద పాఠకుడి దృష్టి చదువుతున్నంత సేపు  వుంటుంది.  స్త్రీ వాదంలో సృష్టించే monotonous,   routine  పాత్రలకు భిన్నంగా ఈ కథలో అతని పాత్ర కనిపిస్తుంది. All our actions seems to be motivated by self concern అంటారు అస్తిత్వవాదులు ఈ మూడు పాత్రలను అటువంటి చైతన్యంతో సృష్టించారు వీరలక్ష్మీదేవి.   వీరలక్ష్మి దేవి కథల్లోని పాత్రలన్ని కూడా ఉజ్వలమైన భవిష్యత్తు కలిగినవి. సమకాలీన సమాజంలో తారాసపడే పాత్రలు కావు.    

            ప్రేమ చుట్టూ అల్లుకునే మార్మికత, తీయని మాయ, వ్యామోహాలను ఆవిరి చేసే సందర్భాలను ఆధునిక ప్రపంచం అతి తరచుగా ఆఫర్ చేస్తుంటుంది. వాటిని తట్టుకుని నిలబడడానికి ఏం చేయాలి? ప్రేమ పుట్టడానికి క్షణం చాలు. అలాగే ప్రేమికులు విడిపోవడానికి కారణం చాలు. కారణాన్ని ప్రేమికులు ఉపయోగించుకోకుండా ప్రేమరాహిత్యాన్ని భరిస్తుంటారని అనుభవంతో తెలుసుకుంటాడు . ఇన్ సెక్యూరిటీ, ఓవర్ పొసెసివ్ నేచర్, ఇన్ ఫెడిలిటీ, వ్యక్తిగతాన్ని ఆక్రమించే అనుబంధాల చట్రంలో ఇప్పుడు ప్రేమ.. రోజుకు నాలుగు ఎస్.ఎం.ఎస్ లు, రెండు కుళ్ళు జోకులు.. మరికొన్ని తీపి అబద్ధాల కాంబినేషన్ గా మారిపోయిందిఇలాంటి నేటి కాలేజ్ ఏజ్ ప్రేమల ప్రపంచంలోకి నిజంగా  నిజాయితీగా, అంతఃకరణ ప్రకారం నడుచుకునే తృషిత పాత్రను ప్రవేశపెడతారు వీరలక్ష్మి.  జీవితాంతం ప్రేమించడం సాధ్యమా అని అడిగిన ప్రశ్న కొత్తగా పుట్టిన ప్రశ్నేమీ కాదు. ప్రశ్నకు కనీసం రెండు దశాబ్దాల వయసుంది? ప్రశ్నకు సిన్సియర్ గా జవాబు చెప్పుకోవడానికి.. ప్రేమను ఆరాధనగా కీర్తించే హిపోక్రాట్స్ కు చాలా కష్టం. ప్రేమ అంటే ఒకరి పట్ల మరొకరికి కలిగే అపారమైన ఇష్టం.

ప్రేమ శాశ్వతంగా ఉండడమన్నది ఆచరణాత్మకంగా సాధ్యం కాకపోవచ్చన్నది ఎంత నిజమో, శాశ్వత ప్రేమ కూడా ఉంటుందన్నది అంతే నిజం. అయితే, మొదటి నిజం మీద రెండో నిజానిది పైచేయి ఎప్పుడవుతుంది? ప్రశ్నకు జవాబు కూడా ఈ  దశాబ్దంలో చాలానే వచ్చాయి.వాటిలో కుప్పిలి పద్మ సమీర,……………

 “ మనం కోరుకున్న ప్రేమలు మనకు దొరకవు. ఈ మగవాళ్ళు ఇవ్వలేరు.ఎంతకీ వాళ్ళ అహాలు తృప్తి పరుస్తుంటే తప్ప మనల్ని పట్టించుకోరు.(పే. ౨౨ వాడ్రేవు వీరలక్ష్మీదేవి, -తృషిత కొండఫలం కథాసంకలనం)

         ప్రేమకోసం పరితపించే స్త్రీలకు ఎదురవుతున్న ఎండమావిలాంటి అనుభావాలను చిత్రించిన కథ తృషిత. ఒకప్పుడు తృషిత కళ్ళలో  కనిపించే ప్రేమ దాహార్తిని చూడటం వివేక్ కి అందమైన అనుభవం. ఆమె కళ్ళలో కనిపించే ఆకర్షణకు దూరంగా బ్రతకలేక తృషితను పెళ్ళి చేసుకుంటాడు. తనను ఆకర్షించిన ఆమెను, ఆమె పట్లగల తన ప్రేమతత్వాన్ని ఎక్కువ రోజులు నిలుపు కోలేక పోతాడు.  పెద్దగా చదువులేని అతనికి స్టీవార్డు వుద్యోగం తప్ప మరో మంచి ఉద్యోగమేది దక్కలేదు. నిద్రలో కూడా వదలలేని ఆమె చేయిని, పూర్తిగా వదిలించుకోడానికి కూడా రెడీనే. ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందులు, తండ్రిగా మారిన తరువాత అమర్చుకోలేక పోతున్న  సౌకర్యాలు  గుర్తుకొస్తుంటాయి. ఆరేళ్ళల్లో వివేక్ప్రవర్తనలో అనూహ్యమైన వింత  మార్పుకు దారితీసింది.

మగవాళ్ళ ప్రేమ కోసం ఎదురుచూసే స్త్రీలకు మిగిలేది వేదనే” అన్న సత్యాన్ని తృషిత పిన్నిఆమెకు ఎన్ని సార్లు గుర్తుచేసినా తృషిత వివేక్ చూపించే  ప్రేమకు వశమవుతుంది. ఎన్ని హెచ్చరికలు చేసినా ఆమె తన పట్ల అతను  ప్రకటించే ప్రేమకు తనను తాను సంపూర్తిగా  అర్పణ చేసుకుంటుంది.

         తృషిత పిన్ని అనుభవ సారాంశం తృషితకే కాదు ఏస్త్రీ ఐనా  మోహంలో వున్నన్నాళ్ళు తెలీదు. ఆతరువాతే జీవితమంతా పరిరక్షించుకోవాల్సిన ప్రేమానుభవం కొన్ని  సంవత్సరాలలోనే ఆవిరి అయ్యేంత బలహీన సందర్భం మగవాళ్ళ ప్రేమలో వుందా?  పితృస్వామ్య స్వభావాన్ని పూర్తిగా వంట పట్టించుకున్న స్త్రీ,పురుషులిద్దరిలోనూ వుందా? అన్నది ఎన్ని దశాబ్దాలు గడిచిన అంతూ దరిలేని వివాదం లాగ అలాగే వుంది తప్ప ఆమాయను చేధించి దాని అంతరార్థాన్ని ఎందుకు పట్టుకోలేక పోతున్నారన్న ఆవేదనతృషిత పిన్ని పాత్రలో వ్యక్తమవుతుంది.   తృషిత కళ్ళల్లో కనిపించే దాహార్తి అతన్ని ఆమె వెంట నడిపించింది. ఆమె సొంతమయ్యేంత వరకు ఆమె చుట్టూఅతడు తిరిగాడు. కానీ ఇప్పుడతని  దాహార్తిలో చీకటి తప్ప వెలుగు కనపడటం లేదు. అతని ఉదృతమైన మోహావేశం మొదటి రెండేళ్ళకే చల్లారిపోయింది.ఒకప్పుడు ఎంతగానో ఆకర్షించిన ఆమె స్వతంత్ర వ్యక్తిత్వం ఇప్పుడతనికి అహంభావంగాను, పొగరుగాను కనిపించిందితన అహాన్ని తప్ప మరింకేదాన్ని ఆరాధించలేనితనం.అయితే ఈకథలో అతనికి ఆఅహమే పెద్ద అవరోధంగా మారిందన్న అభిప్రాయాన్ని కలిగించే క్రమాన్ని స్పష్టపరిచే పాత్రల ప్రవర్తన ఎక్కడా చిత్రించబడలేదు. పిన్నీ చేసే ఆరోపణలకు తృషిత అనుభవానికి కలిగిన సారూప్యతకు ఆధారమైన  వివేక్ పాత్రను మలచడంలో రచయిత పూర్తిగా విజయవంతంగాలేక పోయారు. కేవలం ఆర్ధికపరమైన సౌకర్యాలు అందుబాటులో లేకపోవడమే అతనిలోని ప్రేమోర్తిని తగ్గించాయని కథకురాలు అంటారు. అంశాలు అలా ద్వంసం చేసాయో చెప్పడానికి  కూడా సరైన ఆధారాలు కథలో కనిపించవు

     స్త్రీలు తమను తాము సంపూర్ణంగా అర్పించుకున్నా, స్త్రీలకు ప్రేమతో పాటూ అందవలసిన గౌరవం దక్కదన్న హెచ్చరికలో స్త్రీ పురుషుల మధ్య రిలేషన్స్ లో డైనమిక్స్ ప్లే చేయాల్సిన అవరాన్ని కూడా కథలో పిన్ని పాత్ర ద్వారా చెప్పించారు. అలా చేయలేని పక్షంలో ఆప్రేమ నిలబడదన్నఅంశాన్ని, తృషిత పాత్ర ద్వారా రచయిత పూర్వ పక్షం చేయడానికి ప్రయత్నించారు.. క్రింది మాటలను గమనిస్తే, విషయంలో మరింత స్పష్టత పరిగే అవకాశం వుంది

  “అవును పిన్ని చెప్పనే చెప్పింది ప్రేమ పేరుతో నిన్ను నువ్వు సంపూర్ణంగా అర్పించుకోకు పూర్తిగా అతనిదానవని చెప్తే లోకువైపోతావు అంది. అయినా అర్పించుకోబోయాను. లోకువచేశాడు. నాకేమి చేతకాదన్నాడు. అనవసరంగా దుబ్బులో ఇరుకున్నానంటాడు. అమ్మా నాన్న గుర్తొచ్చాడంటాడు  అతను  తరచుగా. నాకు లేరా అమ్మానాన్న?…(పే. ౨౨ వాడ్రేవు వీరలక్ష్మీదేవి, -తృషిత కొండఫలం కథాసంకలనం) అని వాపోతుంది తృషిత

        .మగవాళ్ళ స్వభావంలో  ప్రేమ ఎంత చంచలమైనదో  నువ్వతని కాళ్ళముందు జీవితమంతా పడి వున్నా జాలిపడగలడేమో గాని, పూర్వ ప్రేమను ఇవ్వలేడు. అతని హృదయంలోంచి ఆకర్షణ , ఆరాటం పోయాయి. కనీసం నీవ్యక్తిత్వం నువ్వు కాపాడుకుంటేనైనా ఎప్పుడైనా తిరిగి అతనికి పూర్వపు మోహం కలుగవచ్చు ఇతను కాకపోతే మరో కొత్త వ్యక్తిని నీ జీవితంలోకి ఇలాగే ప్రవేశించినా అ కథ కూడా ఇలాగే నడుస్తుంది. ఆడవాళ్ళందరం మనల్ని నిలువెల్లా ముంచేసే ప్రేమ కోసం ఎంతగానో ఎదురుచూస్తాం. కొందరికి కొంతకాలమైనా దొరుకుతాయి, మరికొందరికి దొరకనే దొరకవు .అయినా జీవితమంతా ఆదాహం వదలదు”  అన్న కఠోర వాస్తవాన్ని స్త్రీలందరి పక్షాన  తృషిత పిన్ని పాత్ర ద్వారా వాడ్రేవు వీరలక్ష్మీ దేవి వ్యాఖ్యానించారు.  పురుషులలోని ప్రేమ రాహిత్యాన్ని చెప్పే సంధర్భంలో ప్రేమ పట్ల వాళ్ళకుగల దాహార్తి, మోహం  స్త్రీలకు జీవితంలో కొంత కాలం మాత్రమే దగ్గరవుతుందని మిగిలిన కాలమంతా ఆరోజుల్ని తలుచుకుంటూ గడపాల్సిన  ఒక అనివార్యతను ఆవిష్కరించే ప్రయత్నంతృషిత, కథలో వ్యక్తమవుతుంది.

         “తెలుసుకొనవే యువత కథలో ప్రేమికుల మద్య చోటు చేసుకున్న అపార్ధాలు, అపోహలకు కారణం, తమలోని ప్రేమను మాత్రమే చూడగలిగి అవతలి వాళ్ళకు ప్రేమంటే తెలీదన్న స్థితి  యువతీయువకులిద్దరిలోనూ సమపాళ్ళలోనే ఉండటం  ఒక అవగాహనా లోపంగా రచయిత  గుర్తించారు. వాళ్ళిద్దరిలో ప్రవహించే ప్రేమతత్వం తమని తాము తెలుసుకోవడానికి ,దగ్గరవ్వడానికీ మద్య నడచిన ప్రేమ కథ ఇది. వ్యక్తుల సంక్లీష్టతల్లోంచి ప్రేమ స్వరూపం  వైవిద్యభరితంగా మారుతుంది. తాము మాత్రమే ప్రేమలో వున్నామని, అవతలి వ్యక్తిలో అంత ప్రేమ లేదనే విషయాన్ని గుర్తించినట్లు ఎన్నో సంఘటనల కూర్పుతో కథకురాలు అందిస్తుంది. ప్రేమికుల మద్య గెలుపోటములు వుండవని అలాంటి ప్రమేయం వచ్చిందంటే ఇష్టం తగ్గిపోయి నట్టే నన్న భావన. ప్రేమ స్వరూపం విచ్ఛిన్న రూపం కాదు. అది ఎక్కడ వున్నా ఎలా వున్నా  వాళ్ళ మద్య గల స్త్రీ, పురుషుల విభజన రేఖల్ని ,సరిహద్దుల్ని చెరిపివేయగలిగినదే ప్రేమ అనే అర్ధాన్ని కథలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి వ్యక్తీకరించారు

      ఈతరం యువతీ యువకుల్లో వుండే ప్రేమ పట్ల గల సంశయం విచ్ఛిన్నం చేయాలన్న సంకల్పం , ప్రేమ తత్వాన్ని అర్ధం చేసుకోవడంలో యువతీ యువకులిద్దరూ కూడా అపసవ్యంగానే ఆలోచిస్తున్నారన్న complaint వుంది. అందుకే వాళ్ళ అపోహలన్నీ అర్ధంలేనివని, వాళ్ళ మద్య చనువుగా మసిలే మూడో పాత్రను రచయిత ప్రవేశపెడతారు. ఆవ్యక్తి  ముందు వాళ్ళ  మనోభావాలను ఆవిష్కరించే ప్రయత్నంలో,ఒకరికొకరు ఇద్దరిలో వున్న ప్రేమభావంలోని గాఢత, గాంభీర్యం, లోతుల పాళ్ళు సమంగానే వున్నా, వాళ్ళు చూసే దృష్టి కోణంలో లోపం వుందని కథలో నిరూపించే ప్రయత్నం చేశారు.

       ఈ దశాబ్ధకాలంలో వచ్చిన  ఆర్ధిక సంక్షోభానికి రెమిడియల్ ట్రీట్ మెంట్  “పునరుర్థానం” కథలో  ఆవిష్కరించబడింది. జీవితం ఓడిపోయింది,  బతుకులు చితికిపోయాయి లాంటి మాటల నుంచి జీవితాన్ని విముక్తం చేయగల జీవన స్పూర్తి వాడ్రేవు వీరలక్ష్మీ కథల్లో ఎప్పుడూ  కనబడుతూనే వుంటుంది.  ’పునరుర్థానం కథలో ఆదిలక్ష్మీ  చదువు,ఆర్ధిక స్ధోమత లేకపోయినా జీవనోత్సాహాన్ని నింపుకొని ఎంత అననుకూల పరిస్థితిల్లో కూడా ఆనందంగా జీవితాన్ని చూడగల స్థైర్యవంతురాలు. క్యాన్సర్ రోగంతో ఆరోగ్యం క్షీణించినా, భర్త మరణం తరువాత కుటుంబం మొత్తం చెల్లాచెదురవుతుంది, కానీ రెండేళ్ళలో బంధువుల ఇంట్లో వంట మనిషిగా పని చేసిన అనుభవంతో, జీవితాన్ని కూడగట్టుకునే ప్రయత్నం చేసుంది.  ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న కుటుంబాన్ని, ఏమాత్రం అధైర్యపడక, ఆస్థితిని అదిగమించడంలో ఆమెలోని జీవనోత్సాహం, జీవితేచ్ఛ ఆమెవ్యక్తిత్వాన్ని జీవన శైలినీ వాడ్రేవు వీరలక్ష్మీదేవి ఎంతో జాగ్రత్తగా ఈపాత్రను మలిచారు.  జీవితాన్ని ఉన్నతీకరించుకోవడంలో వ్యక్తుల స్వభావ సంస్కారాలలోని ఔన్నత్యాన్ని ఈకథ తెలియజేస్తుంది.ఆదిలక్ష్మికి ఆర్ధిక వెసులు బాటు కుదిరినా  పరాయిఇంట్లో పొందలేని  మానసిక శాంతిని ,సొంత వూర్లో శిధిలమైన ఇళ్ళైనా సరే తన సాంసృతిక మూలాలను వెతుక్కుంటంలో పొందగలిగింది. 

  ఆదిలక్ష్మి ఆలోచనల్లోని జీవన కాంక్ష శిధిలాల నుంచి  పునర్ణిర్మించబడిన ఇల్లును మనోహర హ్రమ్యంగా రూపుదిద్దుకోవాల్సిన జీవితంతో పోలిక పెట్టారు.  సాధారణంగా ఈనాటి యువత  చూసే దృష్టికోణానికి భిన్నంగా ఈకథా వస్తువును మలచి చూపించడం ద్వారా ఈనాటి యువతరంలో రావాల్సిన మర్పుల్ని,  ప్రత్యామ్నాయ జీవన విలువల్ని పరిచయం చేయాలన్న తపన ఈకథలో స్పష్టంగా బోధ పడుతుంది. స్వతహాగా భావుకురాలైన వీరలక్ష్మిలోని జీవనకాంక్ష  స్త్రీవాద భావజాల ప్రభావంతో  మరింత సునిశితంగా, అందంగా ,అలవోకగా ఆమె కథల్లో ఆవిష్కృతమవుతుంది. అందుకు తార్కాణమే  ఈకథ. 

       ఒకటీన్నర రెండు దశాబ్ధాల క్రితం  తెలుగు సమాజంలో ప్రవేశించిన ఆర్ధిక సంస్కరణల ప్రభావం సాప్ట్ వేర్ రంగంలో పెరిగిన ఉద్యోగిత యువకులలో ఎంత జీవనోత్సాహాన్ని నింపిందో  అంతే నైరాశ్యంలోకి కూడా నెట్టబడింది.  అటు ఆదిలక్ష్మి జీవితంలో సంభవించిన సంక్షోభాన్ని ఒక వైపు నడిపిస్తూనే, మరోవైపు ఈతరం యువతకు ఎదురవుతున్న సవాళ్ళను పక్క పక్కగా నిలిపి, రెండు పార్శాలలో వ్యక్తమయ్యే జీవన వైరుద్యాలను ఈకథలో చిత్రించారు.   జీవన సంక్షోభాన్ని తట్టుకొని  సాధికారికంగా జీవనయానాన్ని ఎలా ఫలవంతం చేసుకోవచ్చో చాలా సున్నితంగా చెప్పిన కథ పునరుర్థానం.             

        

*****

Please follow and like us:

One thought on “కథాకాహళి-వీరలక్ష్మీదేవి కథలు”

Leave a Reply

Your email address will not be published.