ఆదర్శం

-ఆదూరి హైమావతి

అది ప్రశాంతి పురంలోని ప్రాధమికోన్నతపాఠశాల .ఏడోతరగతి పిల్లలం తా పరీక్షలుకాగానే పాఠశాలవదలి వేసవితర్వాత హైస్కూల్ కెళ్ళిపో తారు.పాఠశాల పెద్దపంతులమ్మ పవిత్రమ్మ ప్రతి ఏడాది లాగే ఏడా దీ ఏడవ తరగతి పిల్లలందరికీ అందరికీ ఫేర్ వెల్ పార్టీ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులూంతా కొద్దిసేపు మాట్లాడి పిల్లల నంతా దీవించా రు.          

పిల్లలందరినీ ఉద్దేశించి పెద్దపంతులమ్మ మాట్లాడుతూ ,

పిల్లలూ! మీరంతా ఎంతోమంచివారు.ఏడేళ్ళు ఇక్కడ చదివి  ‘ఒనమఃలతో మీ విద్యాభ్యాసం మొదలుపెట్టి ఈరోజు పాఠశాల వదలి పెద్ద బడికి వెళ్ళబోతున్నారు.మీరిప్పుడు ఇంచు మించు గా టీనేజ్ లో అడుగు పెడు తున్నారు. ఈవయస్సు గజ్జల గుఱ్ఱం  వంటిది. ప్రతి అడుగూ ఆలోచించి వేయాలి. ప్రతిమాటా ఆలోచించి మాట్లాడాలి. ప్రతిపనీ ఒకటికి రెండుమార్లు మీ పెద్దలతో సంప్రతించి చేయాలి.మూడేళ్ళలో హైస్కూల్నుంచీ కళాశాలకూ, తర్వాత ఉద్యోగాలకూ వెళతారు. మీరు ఏం చేసినా , ఏవృత్తి నిర్వ హించినా , అమ్మాయిలు ఇంటికెళ్ళినా మీ తల్లి దండ్రులకూ, చదువు చెప్పిన గురువులకూ  మీ ఊరికీ ,దేశానికీ మంచి పేరు తెచ్చేలాగా జీవించాలి. మీకు మీ భవిష్యత్ చదువుపట్లా , వృత్తిపట్లా ఒక అవగాహన ఏర్పడి వుంటే మీకు సులువవు తుంది.మీరు కలాశాలకు కెళ్లేముందే మీకు ఒక నిర్ణయం వుంటే ఆవైపు మీ అడుగులు వేస్తే బావుంటుంది.సరే చాలామాట్లాడాను. ఇప్పుడు మీరు ఒక్కోరూ హైస్కూల్ తర్వాత ఏమి చదివి ఏవృత్తి చేపట్టాలనుకుంటున్నారో  ఒక్కోరుగా వచ్చి చెప్పండి”  అని ముగిం చారు.      

ముందుగా మధులేచాడుమేడం! నేను రోజూ స్కూల్ కు వచ్చేప్పుడు మన ఊరి పక్కనుంచీ కడుతున్న హైవే దగ్గర  టోపీ, కళ్ళజోడూ పెట్టు కుని ,కార్లోవచ్చి పనివారితో, కాంట్రాక్టర్తో మాట్లాడుతూ , సిమెంటు, సరిగా కలుపుతున్నారా!’ అని గమనిస్తూ పనివారికి కూలి డబ్బులు సరిగా ముడు తున్నాయా! అని అడుగుతూ అంకిత భావంతో పనిచేసి దేశ ప్రజల ఉపయోగంకోసం కష్టపడే ఇంజనీరును చూస్తుంటాను.నాకూ అలా ప్రజాసేవచేయాలనే కోరిక కలిగింది, మేడం ,నేను ఇంజనీరింగ్ చదవాలని అనుకుంటున్నాను. ” అని ముగించాడు.

గుడ్ మధూ! అలా ఒక వృత్తి పట్ల అవగాహన ఏర్పర్చుకోడం బావుందయ్యా! తర్వాత ..” అని పెద్దపంతులమ్మ అనగానే  , మారుతి లేచింది.” మేడం నేను మన పాఠశాలకు వచ్చే దార్లో ఒక హాస్పెటల్ వుంది. నాకు ఒకమారు జ్వరం వస్తే మా బామ్మ నన్నక్కడికే తీసు కెళ్ళా రు. డాక్టరమ్మ చాలామంచిది. కేవలం మాటలతోనే సగం జబ్బు నయం చేస్తుంటుంది. నవ్వుతూ మాట్లాడుతుంది.ప్రేమగా జవాబిస్తుం ది. అంతా ఆమెను దైవంతో సమానం అనుకుంటారు.నేనూ అలా డాక్ట రమ్మనై ప్రజలకు ముఖ్యంగా పిల్లలకు వైద్యం చేయాలను కుంటు న్నాను.” అంది.   

ఆతర్వాత    నవీనూ, ప్రకాశూ , గోపీ, కమలా,విమలా ఇంకా మిగతావారూ లేచి ,వారు ఎంచుకున్న  వృత్తిపట్ల వారి అభిప్రాయాలు చెప్పారు

వాసు లేచాడుమేడం నేను చాలామార్లు మా తాత గారితోపాటుగా వస్తు వులు కొనను పచారీ షాపుకెళ్తుంటాను. అక్కడ వస్తువులు తూకంవేసి ప్యాక్ చేసిన ప్యాకెట్స్ తాతగారు తీసు కుంటుంటారు.కొన్నిసార్లు బామ్మ కందిపప్పు బాగా ఉడకడం లేదు. గోధుమపిండిలో పురుగులు న్నాయి. బియ్యం బాగాలేవు.’ అంటుంటారు.అదంతా చూస్తుంటేనాకు  అనిపిస్తుంటుంది. చక్కగా మంచి వస్తువులతో ఒక మాల్ పెట్టి కల్తీలేని  మంచి వస్తువులు అమ్మి, న్యాయమైన లాభంతో జనమంతా సంతోషంగా వస్తువులుకొని హాయిగా జీవించేలా చేయాలని , నేను చదువయ్యాక ఒకమంచి  మాల్ పెడతాను మేడంఅన్నాడు, పిల్లలంతా నవ్వారు. పెద పంతులమ్మతప్పు నవ్వకూడదు. అదెంతో ప్రజాసేవ తెలుసా! నాణ్యమైన వస్తువులను , సరైన లాభంతో అమ్మి ప్రజలకు సౌకర్యం కలిగించడమూ ఒక మంచి వృత్తేఅన్నారు.

    రైతుకొడుకైన రామూ లేచాడుమేడం !నేను మహా చదివితే పదోక్లాస్ వరకే చదవగలను, మా అమ్మా, నాయనలు కూరలు అమ్ముతారు.చాలా కష్ట పడుతున్నారు. నేను పదోక్లాసు తర్వాత మాకున్న స్థలంలో మంచి ఆర్గానిక్ కూర గాయలు పండించి , ప్రజల ఆరోగ్యానికి సహకరించే లాగా మంచి కూరగాయల షాపు పెడతాను మేడం, మా అమ్మా నాయనలకు విశ్రాంతినిచ్చి వారిని బాగా చూసుకుంటాను మేడం ”  అన్నాడు. పెద్ద మేడంతోపాటుగా అంతా చప్పట్లుకొట్టారు.  

ఆతర్వాత వందన లేచింది.ముందుగా పెద్ద మేడం పాదాలకు నమస్కరించిమేడం నేను ఒకటోతరగతిలో పాఠశాలలో చేరాను. నాకు బాగా గుర్తుంది .మీరే ఆరోజు నాకు పలక మీద మఃఅని వ్రాసి విద్యా భ్యాసం చేశారు. భయం భయంగా బళ్ళోకొచ్చిన నాకు మీ నవ్వు ముఖం  ఎంతో ధైర్యాన్నిచ్చింది. మా అమ్మ లాగా మీ ఒళ్ళో నన్ను కూర్చో బెట్టుకుని వ్రాసిచ్చి ,”ఏంకావాలన్నా నన్ను అడుగు వందనా! నీపేరు అర్ధం తెలుసా! ‘వందన’ అంటే నమస్కారం , నీవు అందరిపట్లా వినయంగా వుంటావన్నమాట.పెద్దయ్యాక నీకు నీపేరు అర్ధం బాగా తెలు స్తుందిలే. చక్కగా చదువుకుని మంచి పేరుతెచ్చుకోవాలి.సరా!” అనిచెప్పారు.నేను ఆరోజునుంచీ రోజూ మిమ్మల్ని చూస్తూ మీరు మాట్లా డే విధానం గమనిస్తూ వుండేదాన్ని. మీరు పాఠం చెప్తే బాగా వింటే మళ్ళా చదవక్కర్లేకుండా అర్ధమైపోతుంది. మా అదృష్టం వల్ల మీరు బదిలీమీద వెళ్లకుండా ఇన్నాళ్ళూ మా బళ్ళో వున్నారు.     మేడం మాకు మా ఒకటోతరగతి నుంచీ ఇప్పటివరకూ చదువుచెప్పిన టీచర్లంతా మాకు చక్కగా చదువుతోపాటుగా మంచి అలవాట్లూ, కధలూ, పద్యాలూ వాటి అర్ధాలూ మానవతా విలువలూ, మానవునిగా దేశంలో ఎలా బాధ్య తగా జీవించాలో అనే విషయాలన్నీ చక్కగా బోధించారు

      మేడం అందుకే నేను డిగ్రీ చదివి, బిఎడ్ చేసి మీలా పంతులమ్మనై అందరికీ చక్కగా చదువుచెప్పాలని వుంది మేడం. నేను మీలా టీచరునవుతానుఅంది .అంతా చాలాసేపు కరతాళ ధ్వనులు చేశారు.

పెద్దపంతులమ్మ వందనను దగ్గరకు పిలిచి ముదుట ముద్దుపెట్టుకునిబంగారూ! పంతులమ్మ ఉద్యోగం చాలా గొప్పది.ఏదేశ అధ్యక్షుడైనా, ప్రధానీ ఐనా ఒకనాడు ప్రాధమిక పాఠశాలలో  చదివినవారేగా ,అలాంటి వారు మనవద్ద మొదటి సారిగా విద్య నేర్చుకోను రావడం  ఎంతగొప్ప, అంతేకాదు లేతవయసుపిల్లలకు ఉపాధ్యాయులు ఏది చెప్తారో అది వారిమనస్సుల్లోనిలిచిపోతుంది . మంచి పౌరులను  దేశానికి అందించే ఫ్యాక్టరీ లాంటిది పాఠశాల. బంగార్లూ మీరంతా మాపాఠశాల వదలి వెళుతున్నందుకు బాధగా వున్నా ఇన్ని మంచి భావాలతో , లక్ష్యాలతో మీరు బాగా చదివి మంచిపేరు తెచ్చి, మీ వృత్తులో ఘనత సాధించి దేశసేవచేయాలని కోరుకుంటూ Duty is God, work is worship అని నమ్మి మీవృత్తి ధర్మాలను నిర్వహించండి. సమావేశం ఇంతటితో ముగి  స్తున్నాను.” అన్నారు.

కరతాళ ధ్వనులతో సమావేశం ముగుసింది అందరి మనస్సులూ సంతోషతరంగాలలో మునిగాయి

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.