చిత్రం-12

-గణేశ్వరరావు 

ఈ  ‘అమ్మ’ ఫోటో తీసినది  అలేనా  అనసోవ. ఆమె   రష్యన్ ఫోటోగ్రాఫర్.  అనేక అంతర్జాతీయ అవార్డ్లు ఆన్డుకుంది. ఈ ఫోటో  కూడా అంతర్జాతీయ గుర్తింపు,  అవార్డ్ పొందింది. . 5 ఖండాలకు చెందిన 22 దేశాలనుంచి ఫోటోగ్రాఫర్ లు ఆ  పోటీలో పాల్గొన్నారు.  దృశ్య మాధ్యమంగా మనల్ని అబ్బురపరిచే చాయా చిత్రాల్లో దీన్ని అత్యుత్తమమైనదిగా న్యాయ నిర్ణేతలు గుర్తించారు. దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ – మనం ముఖ్యంగా గమనించదగ్గది ఎలెనా ‘అమ్మ ‘ పట్ల కనబరచిన సృజనాత్మకత, ఆమె దృక్కోణం, సాధారణమైన దృశ్యాన్ని అసామాన్యoగా చూపించిన ప్రతిభ.

ఈ సందర్భంలో    రాజాచంద్ర ఫౌండేషన్ వాళ్ళ కృషిని కూడా మనం గుర్తించాలి.  ‘అమ్మకి జే జే’ అనే  సంకలనాన్ని వాళ్ళు ప్రచురించారు.  వివిధ రంగాలకు చెందిన తెలుగు వెలుగులు  –  ముళ్ళపూడి  రమణ-బాపు..బాలమురళీ కృష్ణ.. రావు బాలసరస్వతి.. భానుమతి.. ఎస్పీ.. మొత్తం 18 మంది  ‘అమ్మ’ పట్ల వెలిబుచ్చిన అభిప్రాయాలను  ఈ పుస్తకంలో  పొందుపరిచారు.

రమణ అన్నట్టు ‘అమ్మ జన్మరీత్యా అమ్మ, జీవిత రీత్యా స్నేహితురాలు,బతకడం నేర్పిన గురువు, హాయిని రుచి చూపిన దైవం ‘! అలేనా అనసోవ  ‘అమ్మ’ అద్భుత రూపాన్ని ఎంత అద్భుతంగా తన ఫోటోలో బంధించిందో!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.