అవేకళ్ళు

-అశోక్ గుంటుక

తెలతెలవారుతూనే వాకిట  నే ముగ్గవుతున్న వేళ

డాబాపై వాలిన నీరెండ కురుల ఆరబెడుతున్న వేళ

తోపుడు బండిపై బయలెల్లిన కూరగాయల

మేలిమి వెతుకుతున్న వేళ :

అంతటా అవేకళ్ళు –

వెకిలి నవ్వులు వెకిలి చేష్టలు……

పరుగు జీవితమైన వేళ

అందీ అందని సిటీబస్సు లేదంటే మెట్రోరైలు

చాలీ చాలని సమయం ఒక్కోసారీ

వద్దనుకుంటూనే ఓ ఆటో లేదా ఓ క్యాబు –

నిలుచున్నా కూర్చున్నా :

అంతటా అవేకళ్ళు –

వెకిలి చూపులు వెకిలి మాటలు….

ఆలస్యం హాజరైన వేళ ;

చేసే పనిలో సాయం కోరిన వేళ :

అలసిన కనులు అరనిమిషం  రెప్పలు మూసిన వేళ :

అంతటా అవేకళ్ళు –

వేన వేల ఆకలి చూపుల నెగళ్ళు…

ఆ చూపుల మంటల్లో కాలి కాలి

అనునిత్యం అగ్నిపునీత నేను….

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.