గజల్

-జ్యోతిర్మయి మళ్ళ

 

ఒక్కపాట పాడి తేలికవ్వగలద ఈ హృదయం

లెక్కలేని విషాదాల మరువగలద ఈ హృదయం

 

భరతమాత బిడ్డలంత తోబుట్టువులే! అందు

రెక్కలేని పక్షులెన్నొ నిలువగలద ఈ హృదయం

 

కడుపునిండి కునుకు ఉండి కుదురు లేదు! ఎందరో

ఒక్కపూట కల్లాడె సహించగలద ఈ హృదయం

 

ఇల్లు కదల కుండ నేను పదిలమె గానీ! అక్కడ

డొక్కలెండి పోతుంటె భరించగలద ఈ హృదయం

 

ఈ కరోన విలయానికి దేశమంత వొణుకుతుంటె

అక్కరేమి లేక మిన్నకుండగలద ఈ హృదయం

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.