ఉత్తమ ఉపాధ్యాయురాలు – ఆన్ సులివాన్

-శర్వాణి

ఒక ఆణిముత్యాన్ని లోకానికి అందించిన ఉపాధ్యాయురాలు “ఆన్ సులివాన్”.  ఆ ఆణిముత్యం మరెవరోకాదు  ప్రపంచములో ఆత్మవిశ్వాసముతో అంగ వైకల్యాన్నిజయించి జీవించి చూపిన మహత్తర మహిళ “హెలెన్ కెల్లర్” . ఆవిడ పేరు విననివారు సామాన్యముగా వుండరు ఆవిడ  వికాలుంగుల సంక్షేమార్థము నిరంతరముశ్రమించిన మహిళా కెల్లర్.

అంగవైకల్యముతో కృంగిపోయిన వారిలోఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించిన కర దీపికగా కేల్లర్ నుఅభివర్ణిస్తారు కానీ ఆశ్చర్యము ఏమిటి అంటే కెల్లర్ వంటి దీపాన్నివెలిగించిన కొవ్వొత్తి లాంటి మహిళ గురించి చాలా మందికి తెలియదు. ఆ మహిళె “ఆన్ సులివాన్” ఈవిడ హెలెన్ కెల్లర్ పురోగమించాలి అన్న ఏకైక లక్ష్యముతోతన జీవితాన్ని త్యాగము చేసి కెల్లర్ అభివృద్ధికి బాటలు వేసినఅధ్యాపకురాలు. ఆవిడ జీవితమంతా వ్యధాపూరీతము బాల్యము నుండి ఎన్నోకష్టాలుఅనుభవించిన ఆమె జీవితము  శోకానికి అద్దము పట్టింది.

ఆవిడ  జీవితము,స్వయముగాపడ్డ కష్టాలు హెలెన్ కెల్లర్ ను తీర్చి దిద్దటంలో పడ్డ కష్టాలనుతెలుసుకుంటే ఉపాధ్యాయ వృత్తిలో ఉపాధ్యాయులు విద్యార్థుల అభివృద్ధికి ఎలాకృషి చేయాలోఆదర్శ ఉపాధాయులు  ఎలావుండాలో తెలుస్తుంది. అందువల్ల ఆవిడ జీవితచరిత్ర ఉపాధ్యాయులకు స్ఫూర్తి దాయకము మరియు ఆదర్శము.

1886 ఏప్రిల్ 16 న అమెరికాలోని మసాచూట్స్ నగరానికి  దగ్గరలో గల ఒకగ్రామములో నిరుపేద కుటుంబములో ఆన్ సులివాన్ జన్మించింది. ఆమె తండ్రి ఒకతాగుబోతు, సోమరి తల్లి క్షయ వ్యాధి గ్రస్తురాలు వీటన్నికి తోడు ఆన్సులివాన్ కు ఐదవ ఏటనే ట్రాకోమా అనే కంటి జబ్బు వచ్చి చూపు మందగించింది.తల్లి మరణించింది తమ్ముడు కూడా క్షయ వ్యాధి గ్రస్తుడు. పిల్లలను వదిలితండ్రి ఎటో పారిపోయాడు. అప్పుడు తమ్ముడి బాధ్యత అక్క చేపట్టవలసి వచ్చింది. బంధువులెవరు సహాయానికి రాకపోగా చీదరించుకున్నారు.  ఇటువంటి పరిస్తుతులలోబిచ్చగాళ్ల విడిది లాంటి ప్రభుత్వ అనాధ శరణాలయములో చోటు దక్కింది.అక్కడవారికి శోకమయ జీవితమే కొనసాగింది.

తమ్ముడికి అదృష్టము లేదా విముక్తి చావురూపములో లభించింది రెండేళ్లు అలాగే అనాధశరణాలయములో కష్టాలుపడుతున్నప్పుడు ఒక స్త్రీ ఆన్ తో చూపు మందగించిన లేదా కోల్పోయిన వారికోసము ప్రత్యేక పాఠశాల ఒకటి ఉన్నది అని చెప్పింది అటువంటి పాఠశాలలో చేరిచదువుకుంటాను అంటే అందరు పరిహసించారు అయినా ఆ పదేళ్ల బాలిక మనస్సులోచదివి తీరాలి అనే తపన బలముగా నాటుకు పోయింది.

ఒకరోజు ఆ అనాధశరణాలయాన్ని చూడటానికి వచ్చిన ఒక పెద్ద మనిషి దగ్గరకువెళ్లి తన కోరికను అయన ముందు వెళ్లబుచ్చింది ఆ పెద్ద మనిషి ఆన్ నుపద్నాలుగవ ఏట పెర్కిన్స్ అంధుల పాఠశాలలోమొదటి తరగతిలో చేర్పించాడువిచిత్రము ఏమిటి అంటే ఆ తరగతిలో మిగిలిన పిల్లలు అందరి వయస్సుఐదారేళ్ళలోపే  పైగా ఉన్నత కుటుంబీకులు ఆ విధముగా ఆన్ తన 14 వ ఏట అక్షరాలూ దిద్దటం మొదలు పెట్టింది.

వయస్సులో ఉండే తారతమ్యము వలన తోటి విద్యార్థులుఉపాద్యయులు అవహేళన చేస్తున్నఆన్ ఏంతో  ఓర్పుతో చదువుకోవాలన్న దృఢసంకల్పంతో అన్ని భరించి ప్ర ప్రధమ విద్యార్థిని గా ఉత్తీర్ణురాలైంది. ఈప్రపంచము అంగ వైకల్యము ఉన్నవారిని అంత సులభముగా స్వీకరించరని  ఉద్యోగప్రయత్నములో ఉన్న ఆన్ కు తెలిసింది. ఆన్ కు ఉద్యోగ అవకాశము హెలెన్ కేల్లర్రూపములో వచ్చింది.హెలెన్ కెల్లెర్ సంపన్నుల బిడ్డ కంటి చూపు, వినికిడి శక్తి లేనిఅభాగ్యురాలు పైపెచ్చు గారాబము మొండితనం.

కెల్లెర్ ను చూసుకోవటానికి ఒక ఆయాని నియమించుకోవాలంటే చాలా కష్టముగాఉన్నరోజుల్లో కేల్లర్తల్లిదండ్రులు పెర్కిన్స్ అంధుల పాఠశాల వారిని సంప్రదిస్తే వాళ్ళు ఆన్ నుఅక్కడికి పంపారు అక్కడికి చేరిన ఆన్ అంత పెద్ద ఇల్లు అన్ని వసతులుఎప్పుడు చూడలేదు కానీ ఆన్ అక్కడి చేరిన వెంటనే అడిగిన ప్రశ్న,”హెలెన్కేల్లర్ ఎక్కడ?” మురికి దుస్తులలో, దువ్వని తలతో ఉన్న కెల్లేర్ ను చుసినఆన్ ఆశ్చర్యపోయింది తల్లిదండ్రుల ద్వారా కెల్లర్ మానసిక బాధలో ఉన్నప్పుడుఅలానే ఉంటుందని తెలుసుకుంది.

హెలెన్ కెల్లర్ ను దగ్గరకు తీసుకొనిబుజ్జగించాలన్న ఆన్ ప్రయత్నాలు ఫలించలేదు ఆన్ చేతి సంచిని లాక్కునిఅందులో చాకవులెట్లు ఉన్నయామో అని వెతికింది కానీ ఆ సంచిలో ఆన్ కు స్కూల్వాళ్ళు ఇచ్చిన బహుమతి వాచ్ ను తీసుకొని బొమ్మలా ఆడుకుంటూ కెల్లర్స్తిమితపడింది. ఆ తరువాత ఆన్ తో గదికి వెళ్లటాన్ని చుసిన హెలెన్తల్లిదండ్రులు ఆశ్చర్యపోయినారు   గదిలో ఆన్ తన పెట్టె తెరిచి వస్తువులనుతీస్తున్నప్పుడు హెలెన్ తాన్ చేతి వేళ్ళతో అన్ని వస్తవులను ఆసక్తిగా తడమనారంభించింది హేల్ న వెతికేది.

చాకొలెట్ల కోసము అని గ్రహించిన ఆన్క్రిందకు చాకొలెట్ల పెట్టె దగ్గరకు తెచ్చింది కానీ కనిపించని వినిపించనిహెలెన్ కు ఆ పెట్టెలో చాకోలెట్లు ఉన్నాయని ఎలా తెలియజేయటం అందుకని ఆన్కెల్లెర్ చేయి తీసుకుని చాకొలెట్లను తాకించింది  ఆవిధముగా అప్పటి నుండి ఆఇద్దరు భాషకు అతీతమైన ఒక ప్రత్యేక పద్దతిలోపరస్పరము అవగతము చేసుకోవటంప్రారంభించారు.ఆన్ కు హెలెన్ ను ప్రేమతో మార్పు తీసుకు రాగాలను అన్న నమ్మకము ఏర్పడింది.

కానీ అది సులభము కాదు అని ఆన్ కు అర్ధమయింది ఎందుకంటే హెలెన్ ఏమాత్రముచికాకుకు లోనయిన రెచ్చిపోయి ఆన్ ను కొట్టేది ఒకసారి ఆన్ కు పళ్ళు ఊడినెత్తురు కూడా వచ్చింది. అప్పుడు ఆన్ కు హెలెన్ లో క్రమ శిక్షణ అలవాటుచేయాలి అని గుర్తించింది దానికి సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించాలికానీ ఈ పద్దతికి హెలెన్ తల్లి దండ్రులు సమ్మతించరు హెలెన్ ఆహారముతీసుకునేటప్పుడు కూర్చుని తినేది కాదు బల్ల చుట్టూ తిరుగుతూ ఇతరులప్లేట్లలో ఆహారాన్ని తీసుకుంటూ ఎడాపెడా విరజిమ్ముతూ తింటూ ఉండేది.

తల్లిదండ్రులు వీటన్నిటిని భరించేవారు కానీ ఆన్ ఈ సంస్కార రహిత అలవాట్లనుమాన్పించాలని నిర్ణయించుకొని ఆన్ కేల్లర్ ను చిన్నగా కొట్టింది కానీకేల్లర్ వినకపోయేసరికి ఆన్ కేల్లర్ చెంప చెళ్లు మనిపించింది ఇంకేముందికేల్లర్ నెల మీద పది శోకాలు పెట్టటం మొదలు పెట్టింది ఆన్ కేల్లర్ నుకుర్చీలో కూర్చో బెట్టి ఆహారము తినిపించాలి అని ప్రయత్నమూ చేసింది కానీఫలించలేదు అలా కేల్లర్ మొండిగా ప్రవర్తించటం ఆన్ అంతకన్నాపట్టుదలగాప్రయత్నించటము చుసిన కేల్లర్ తల్లిదండ్రులు బయటికి వెళ్లిపోయారు.

ఆన్ గదీ  తలుపులు మూసి వేసింది కేల్లర్ కోపముతో తలుపులు బాదింది ఆన్ నుకొట్టింది ఆన్ అన్నిటిని భరించింది తన మొండితనం ఆగడాలు ఫలించవనితెలుసుకున్న కేల్లర్ అన్న దగ్గరకు వచ్చి ఆమె  చేతుల మీద తన చేతులనుఉంచింది చివరకు కేల్లర్ అన్న తనకు తినిపించటానికి ఇష్టపడి తినటం మొదలుపెట్టింది కానీ ఇది కొంచము సేపే మల్ల ఆగము మొదలు పెట్టింది.

ఆన్ ఓర్పుగాఅన్నిటిని భరించటముతో కొన్ని గంటలకు కేల్లర్ శాంతించింది.ఆ తరువాతతలుపులు తెరిచాక కెల్లర్ ఆడుకోవటానికి వెళ్ళింది.కేల్లర్ పట్ల ఆన్ కటువుగా ఉండటము కేల్లర్ తల్లిదండ్రులకు నచ్చలేదు కానీఆన్ వాళ్ళతో కేల్లర్ లో మార్పు రావాలి అంటే ఇంతకన్నా మార్గము లేదనిఖచ్చితముగా చెప్పింది.ఆన్ ను పంపిస్తే మరొక ఆయా దొరకదు కూతురి కష్టాలనుచూడలేక తల్లిదండ్రులు కేల్లర్ ను ఆన్ సంరక్షణలో వదిలి వాళ్ళు మరోఇంట్లోకి మారారు.

ఆన్ చూపుతున్న ప్రేమాదరణలు కేల్లర్ స్వభావంలో క్రమముగామార్పును తెచ్చాయి అంటే గూడు కట్టుకున్న మొండి తనము క్రమముగాతగ్గిపోయింది. ఆ పరిస్థితిలో ఆన్ కేల్లర్ చదువుకు శ్రీకారం చుట్టటంమంచిదని నిర్ణయించుకొని తన దగ్గర గల బ్రెయిలీ వర్ణమాలను తీసింది.కానీకేల్లర్ కు అక్షరాలూ నేర్పటం అంత సులువు ఏమి కాదు ఆన్ పెర్కిన్స్ పాఠశాలనుండి వస్తున్నప్పుడు అక్కడి పిల్లలు ఆన్ కు ఒక బొమ్మను బహుమతిగాఇచ్చారు.

ఆ బొమ్మను ఆన్ కేల్లర్ చేతిలో ఉంచి బొమ్మ అని తెలియజేయటానికి D 0 L L అనేఅక్షరాలను సిటీ మీద వ్రాయగా వ్రాయగా కేల్లర్ ఆన్ చేతి మీద అలాగేవ్రాసింది డాల్ అనేది కేవలము ఒక పదమే కాదు అది బొమ్మ అనే వస్తువుకుగుర్తు అని కేల్లర్ కు అవగతము అయేటట్లు చేయాలి అని నిర్ణయించుకొని ఆభావనను కార్య రూపములో పెట్టింది 32 రోజులకు కప్ వాటర్ అనే రెండు పాదాలనుకేల్లర్ చేతిలో రాయగ ఆ పాదాలకు అర్ధము తెలియక కేల్లర్ తికమక పడి  కోపముతెచ్చుకుంది.

ఆన్ కేల్లర్ ను పంపు దగ్గరకు తీసుకు వెళ్లి పంపు తిప్పినీళ్లు పడుతున్నప్పుడు వాటర్ అనే పదాన్ని కేల్లర్ చేతి మీద వ్రాసింది ఆవిధముగా చూపు కనిపించిన కేల్లర్ కు ఒక్కొక్క వస్తువును తాకించి అరచేతిలోవాటి పేర్లు వ్రాస్తూ అనేక పాదాలను ఆన్ నేర్పింది. .కేల్లర్ రాడ్ క్లిప్ కాలేజిలో చేరినప్పుడు తోడునీడ గా ఆన్ కూడావెళ్ళింది. చదువు తరువాత కేల్లర్ వికాలాంగులకు సేవ చేయాలని కేల్లర్నిర్ణయించుకున్నప్పుడు ఆమె ప్రయత్నాలలో నిరంతరమూ బాసటగా నిలబడిన వ్యక్తిఆన్ ఆ విధముగా తనకంటూ ఒక జీవితాన్నో లేదా కుటుంబాన్నో ఏర్పరచుకోకుండా తనజీవితాన్ని హెలెన్ కేల్లర్ అభ్యున్నతికి అంకితము చేసిన వ్యక్తి ఆన్సులివాన్ తన విద్యార్థి అభివృద్ధియే తన ఏకైక లక్ష్యముగా తనను తానూఅర్పించుకున్న మహోన్నత వ్యక్తి అధ్యాపకురాలు ఆన్ సులివాన్ ఆన్ 1936అక్టోబర్ 20 తేదీన పరమ పదించింది.

హెలెన్ కేల్లర్ వంటి మహానుభావురాలినిసంఘానికి అందజేసిన వ్యక్తి ఆన్ కాబట్టి అటువంటి వ్యక్తి జీవితములో పడ్డకష్టాలను ఇబ్బందులను గుర్తుకు తెచ్చుకుంటే నేటి ఉపాద్యాయులు మరింతసమర్ధవంతముగాపనిచేసి ఎందరో రత్నాలను సమాజానికి అందించగలరు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.