
చిత్రలిపి
దక్షిణవాకిలి
-మన్నెం శారద
సూరీడా ఒకసారి ఇటువైపు కూడా ఉదయించు …అవును నిజమే …నాది దక్షిణ ద్వారపు ఇల్లే ….పచ్చదనం కోసం నేను పెంచిన మొక్కలేవున్నకాస్త వెలుగుని హరించిచీకట్లని మరీ మరీ పెంచుతున్నాయిచేతిలోని హరికేన్ దీపపు కాంతి ఎర్రబారుతున్నదిచమురు నిండుకుంటున్నదో…వత్తి కొడిగడుతున్నదో…ఏమో ..ఏమో మరి …..!?అయినా నీకిదేమి పక్షపాతమూరెండు దిక్కులనే చక్కర్లు కొడుతూవెలుగులరేడువని వెలిగి పోతున్నావుఒక్క వెలుగు తాడుని ఇటు విసిరేవంటేకొస అందుకుని మరీ పైపైకి వస్తానునిరాశ నా వాదం కాదుఅందుకే ఒకసారి నా మాటవినిపక్షపాతం వదలి ..ఒకసారి.ఇటుకేసి కూడా ఉదయించు !
*****

నా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నాను. నంది అవార్డ్స్ కమిటీ లో రెండుసార్లు పనిచేసాను. The week Magazaine నన్ను Lady with golden pen గా ప్రశంసించింది. దాదాపు వెయ్యి కథలు, 45 నవలలు రాసాను. చిత్రకళ నా హాబీ.
