ప్రపంచ యువతకు ప్రోత్సాహం

జెన్నిఫర్ డౌడ్నా, ఎమ్మాన్యుఎల్

-ఎన్.ఇన్నయ్య

జన్యు శాస్త్రంలో ఇద్దరు సైంటిస్టులు మరొక మలుపు తిప్పారు. ఒకామె ఫ్రాన్స్ నుండి వచ్చిన ఎమ్మాన్యుఎల్, అమెరికా నుంచి జెన్నిఫర్ డౌడ్నా ఇద్దరూ కలిసి పరిశోధన చేసిన విప్లవాత్మకమైన అంశం మాలిక్యులర్ సిజర్స్ ను కనుగొన్నారు. దీని ద్వారా జీన్స్ ను ఎడిట్ చేసి చూడవచ్చు.  జెన్యు విభాగంలో D.N.A. క్రమాన్ని ఎక్కడైనా కత్తిరించి అనుకూలంగా మార్చి పెట్టవచ్చు. ఇది విప్లవాత్మకమైనటువంటి కొత్త చర్య. 

జీనోమ్ ఎడిటింగ్ (genome editing)  పద్ధతిని ప్రయోగించి త్వరగా చౌకగా నిర్దిష్టంగా పరిశీలించవచ్చు. దీని ప్రభావం జీవశాస్త్ర పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా కనిపించింది. తదనుగుణంగా వైద్యంలోనూ, వ్యవసాయంలోనూ ఈ పద్ధతులు వినియోగించవచ్చు. 

వీరు కనుగొన్న సిజర్స్ వలన బాక్టీరియాలను అధ్యయనం చేయవచ్చు. వివిధ గొంతు నొప్పులు, అంటు వ్యాధులు, జ్వరాలు పరిశీలించి వైద్యం చేయవచ్చు. జంతువులు, మొక్కలు, సూక్ష్మ జీవుల డీఎన్ఏను ఈ విధానాన్ని ఉపయోగించి మార్చవచ్చునని తెలిపింది. ఈ పరిశోధన కొత్త కేన్సర్ థెరపీలకు ఉపయోగపడుతుందని పేర్కొంది.  వీరి పరిశోధనలు 180 దేశాల నుండి పరిశోధకులు సమర్థిస్తున్నారు.  యువత ఈ పరిశోధనను వినియోగించుకుని చాలా పురోగమించవచ్చు. 

ఫ్రాన్స్ ‌కు చెందిన ప్రొఫెసర్ ఎమ్మాన్యుఎల్ ప్రస్తుతం జర్మనీలోని బెర్లి మ్యాక్స్ ప్లాంక్ యునిట్‌లో డైర‌క్ట‌ర్ గా పని చేస్తున్నారు. మ‌రో శాస్త్ర‌వేత్త జెన్నిఫ‌ర్ అమెరికా  కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రోఫెస‌ర్‌గా సేవలందిస్తున్నారు. 

ఎమ్మాన్యుల్లే చార్పెంటియర్, జెనిఫర్ ఏ డౌడ్నా 2020 నోబెల్ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (The Royal Swedish Academy of Sciences)  ప్రకటించింది. సీఆర్ఐఎస్‌పీఆర్/సీఏఎస్9 (CRISPR/Cas9) జెనెటిక్ సిజర్స్ ను వీరు అభివృద్ధి చెయ్యడం ద్వారా డీఎన్ఏను మార్చవచ్చునని అకాడమీ వెల్లడించింది. 

అయితే వారిద్దరికీ 10 మిలియన్ల స్వీడిష్ క్రోనార్లు (12,01,213.00 డాలర్లు, రూపాయలలో 8,76,96,477.00) చెల్లించనున్నట్లు స్వీడిష్ అకాడమీ పేర్కొంది.

ఒకే సంవత్సరంలో ఇరువురు మహిళా జెన్యుశాస్త్రజ్ఞులకు నోబుల్ ప్రైజు రావటం పెద్ద మలుపు. యువ పరిశోధకులకు ఈ వార్త చాలా ప్రోత్సాహమిస్తున్నది. 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.