రోసలిండ్ ఎల్సీ ఫ్రాంక్లిన్

(1815-1852)

-ఎన్.ఇన్నయ్య

 

సైన్స్ రంగంలో బహుశ యింతగా వివాదాస్పదమైన శాస్త్రజ్ఞురాలు మరెవరూ లేరేమో!   అంటే ఆశ్చర్యం లేదు. జీవశాస్త్రంలో అత్యంత కీలకపాత్ర చూపిన డి.ఎన్.ఎ. విషయాలు తరచి పరిశీలించి బయటపెట్టిన ఫ్రాంక్లిన్ మార్గదర్శిగా వున్నది. ఈ రంగంలో నోబెల్ బహుమానం అందుకున్న రోసలిండ్ చాలా వివాదాలను చవిచూచింది. 1962లో అంటే 37 ఏళ్ళ ప్రాయంలో ఆమె చనిపోయింది. 

 

లండన్ లో విద్యార్థినిగా ప్రతిభను ప్రదర్శించిన ఫ్రాంక్లిన్ 15 ఏళ్ళకే సైన్స్ రంగంలో తన అద్భుత నైపుణ్యతను, ప్రజ్ఞను కనబరచింది. ఆమె విద్యార్థినిగా వుండగా సైంటిస్టు కావాలని ఆంకాంక్షించింది.  ఆశ్చర్యమేమంటే స్త్రీలకు సైన్స్ వలన పైకి వెళ్ళే అవకాశాలు తక్కువ అని, ఆమె తండ్రి బాగా వ్యతిరేకించాడు.  సామాజిక సేవలు చేయమని తండ్రి ప్రోత్సహించాడు. కేంబ్రిడ్జిలోని న్యూహాం కాలేజీలో చేరి గ్రాడ్యుయేట్  అయింది. ఒక ఏడాదికే అక్కడ నుండి బయటపడి, బ్రిటిష్ బొగ్గు ప్రయోజనాలు పరిశోధనలు చేబట్టింది. కార్బన్ గురించి మౌలిక అధ్యనం చేసింది. ఆమె డాక్టరేట్ కు అదే ప్రాతిపదిక అయింది. 1945లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ  ఆమె పరిశోధనలకు డాక్టరేట్ డిగ్రీ యిచ్చింది. 1947 నుండి పారిస్ లో అధ్యయనం చేసి, ఇంగ్లండు తిరిగి వచ్చి పరిశోధనలు కొనసాగించింది. రాండల్ ప్రయోగశాలలో మారిస్ విల్కిన్స్ తో వివాదాలకు దిగింది. డిఎన్ ఎ గురించి లోతుపాతులతో శోధన చేసింది. యూనివర్సిటీలో స్త్రీల పరిశోధన పట్ల ఆనాడు చిన్న చూపు వుండేది. అదే ఆమె విషయంలో బయట పడింది. 

 

తరువాత ఆమె డి.ఎన్.ఎ. ప్రాజెక్టుకై తీసిన ఎక్స్ రే ఫోటోలు మూలాంశాలుగా మారాయి ఫ్రాంక్లిన్ కృషికి మద్దతుగా పరిశోధనా వ్యాసాలు వచ్చాయి. 

 

డి.ఎన్.ఎ. నిర్మాణంలో ఆమె చూపిన బాటలు చక్కగా అతికాయి. ఆమె, పొగాకు మొజైన్ వైరస్ విషయమై చేసిన పరిశోధన ఫలవంతంగా పరిణమించాయి. 1956 నాటికి పోలియో విషయమై ఫ్రాంక్లిన్ మౌలిక పరిశోధన చేశారు.  ఆ తరువాత ఆమె వ్యాధిగ్రస్తురాలై మరణించారు. ఆమె చేసిన పరిశోధన చాలా ప్రయోజనకర ఫలితాలకు దారి తీయడం విశేషం. 

 

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.