స్వరాలాపన-5

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

చిత్రం: అప్పుచేసి పప్పుకూడు (1959)  

సాహిత్యం: పింగళి  నాగేంద్ర రావు

సంగీతం : సాలూరి రాజేశ్వరరావు

రాగం: మోహన రాగం  

ఆరో: స రి2 గ3 ప ద2  స*  

 అవ: స* ద2 ప గ3 రి2 స 

హంసధ్వనిలో ఉండే ని2 కూడా కలుస్తుంది ఇందులో-

ఎచటి నుండి వీచెనో…  

ససరి గాప దాపపసా… దపగరి 

 ఈ చల్లని గాలి

సరిగదపగ  రిగసా 

 ఎచటి నుండి వీచెనో… ఈ చల్లని గాలి

ససరి గాప దాపపసా… దపగరి సరిగదపగ  రిగసా 

తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ

గారిసరీ గాపపా  గాదదదా దసని3 దా

తీవెలపై ఊగుతూ పూవులపై తూగుతూ

గారిసరీ గాపపా  గాదదదా దసని3 దా

ప్రకృతినెల్ల హాయిగా……..

గగప దాస రీ*దదసా రిస రిస దాపా 

ప్రకృతినెల్ల హాయిగా

గగప దాస రీదసా

తీయగా

సరి*సదా 

మాయగా  పరవశింప  జేయుచూ

దసదపా  పసద పదప గదపగరిసా 

ఎచటి నుండి వీచెనో…  

ససరి గాప దాపపసా… దపగరి 

 ఈ చల్లని గాలి

సరిగదపగ  రిగసా 

జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ

జాబిలితో ఆడుతూ వెన్నెలతో పాడుతూ

మనసు మీద హాయిగా….ఆ….

మనసు మీద హాయిగా

తీయగా

మాయగా మత్తు మందు జల్లుతూ

ఎచటి నుండి వీచెనో… ఈ చల్లని గాలి

హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ

హృదయ వీణ మీటుతూ ప్రేమ గీతి పాడుతూ

ప్రకృతినెల్ల హాయిగా….ఆ….

ప్రకృతినెల్ల హాయిగా

తీయగా

మాయగా

పరవశింప జేయుచూ

ఎచటి నుండి వీచెనో… ఈ

చల్లని గాలి ఈ చల్లని గాలి

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.