నువ్వు పరిచిన ముళ్లపానుపు

-గట్టు రాధిక మోహన్

ఉదయాలను,రాత్రులను కట్టగట్టి నాకు నేనే అవుతూ నీ వాసన లేని ఓ కొత్త ప్రపంచంలో బతకాలనుకొని కరిగిపోయే రంగులను ముఖానికి అద్దుకొనికొన్ని నవ్వులని పూయిస్తాను. ఎందుకోగని… ఆ నవ్వులను చూసి కూడా నువ్వు అర్థంలేని చూపులతోపోలికల కోసం వెతుకుతుంటావుఅసూయ లోయలో పడిపోతూ ఉంటావు. సారూప్యం లేని ఆ చూపులకి…ఆ పోలికలకి…ఆ అసూయలకి…ఏం చెయ్యాలో తోచని నేను నాలోని నేనుతో కలిసి ఓ సారి పక్కున నవ్వుకుంటాను. కానీ…నవ్వులా కనబడే ఆ నవ్వులో ఎన్ని మేఘాలు నల్లటి దుప్పటిని కప్పుకొని దాక్కున్నాయనే రహస్యం నీకెప్పటికీ అంతుబట్టదు! ఇప్పుడు ఆ మేఘాల మీది దుప్పటిని దులిపేసి,నవ్వుల మీద ఇంత ధైర్యపుతనాన్ని చల్లుకొని నా పుట్టుక,జాడల కింద నువ్వు పరిచిన ముళ్లపానుపులను ఎగదోయాలి. నా అస్తిత్వ సువాసనలను వెదజల్లుకోడానికిమురిగిపోయిన నీ మనసు నుండి పలాయనం చెంది వాడిపోని కొన్ని ఎర్రని రెక్కలను తొడుక్కొని ఓ గులాబిగా మారిపోవాలి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.