రంగు మబ్బులు

-డా. శ్రీనాథ్ వాడపల్లి

ఒక ఎనిమిది వసంతాల పూర్వం. 
ఓ చీకటి రాత్రి 
ఒక చైనీయుడు 
పారిస్ థియేటర్లో సంగీతం వాయిస్తూంటే 
పియానో మెట్ల మీంచి వచ్చిన కమ్మని కవిత్వంలో 
 
నువ్వెందుకు లేవు?
 
మేఘాల మాటున దాక్కున్నావు కదూ !
చీకటి నలుపులో పోల్చుకోలేక పోయాను 
ఇప్పటికైనా కనుక్కొన్నాను. 
మొత్తానికి 
నిన్ను రంగుల మబ్బులతో 
కలపగలిగాను. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.